Friday, 10 August 2012

ఓ ప్రియ నేస్తమా!


ఓ ప్రియ నేస్తమా!
మాట వినని ఈ మనసునేం చేయను ?
నీ కోసం శ్రుతి చేసిన రాగాన్ని
పంపుదామన్న ఈ గాలి ప్లవించదేం    
నీ మౌన వీణా తంత్రులను
మీటుదామన్నా వీలు కాదేం
నిర్ఝర ఝరీ తరంగ ప్రవాహంలా
మధుర స్నిగ్ధ హ్రుదయినిలా
వ్యక్తమయ్యే నీ అవ్యక్త భావనలు
మౌనం ఒడిలో కునుకు తీస్తున్నాయేం
ప్రభాత  స్వప్నంలో నీవు కనిపించావు  అంటే
నీ దరహాస వదనం దర్శనం అవుతుందా!
ఏమిటో చెలి మన ప్రేమ
నా కవిత్వంలో చిందులు తొక్కుతుంది
మరేమిటో సఖీ !మధురానుభూతివి నీవే
అందమైన జ్ఞాపకానివి నీవే
నీ పట్ల కనబరిచే నా భావనలు
ఎంతకీ తరగని స్మృతులు మరి
ఇంకేం వ్రాయను ?వెలుగు వెనుక సంధ్య
సంధ్య వెనుక వెన్నెల విరబూస్తుంది
వుంటాను మరి
నీ జ్ఞాపకాల విత్తుల్ని ఏరుకుంటూ

9 comments:

  1. సర్, ప్రేమ బీజం పడితే చాలు మొలక ఎత్తటానికి ఎంత సేపు,
    బాగుంది మీ కవిత స్వచ్చంగా , అందంగాఉంది.

    ReplyDelete
    Replies
    1. మీకు ధన్యవాదాలు.అంతే కదండీ.

      Delete
  2. నీ మౌన వీణా తంత్రులను
    మీటుదామన్నా వీలు కాదేం
    నిర్ఝర ఝరీ తరంగ ప్రవాహంలా
    మధుర స్నిగ్ధ హ్రుదయినిలా
    వ్యక్తమయ్యే నీ అవ్యక్త భావనలు
    మౌనం ఒడిలో కునుకు తీస్తున్నాయేం....

    చక్కని ప్రశ్నలు...చాలా బాగుంది రవి శేఖర్ గారూ!
    అభినందనలు.
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. దన్యవాదాలు శ్రీనివాస్ గారు

      Delete
  3. ప్రియనేస్తం చాలా చాలా బాగుంది ...!
    చక్కని భావాలు మెత్తగా పలికించారు...:-)

    ReplyDelete
    Replies
    1. మీకు అంతలా నచ్చినందుకు మరిన్ని ధన్యవాదాలు.

      Delete
  4. Replies
    1. స్వాగతం వీనలహరి గారు మీకు ధన్యవాదాలు.

      Delete
  5. ఓహ్
    ఎంతందమైన హృదయ నివేదన

    ReplyDelete