ప్రతిభా వాగ్దేవి |
లక్ష్మణ రావు |
బాలసుబ్రమణ్యం |
శంకర్ నారాయణ్ |
రామిరెడ్డి మాజీ ఎం ఎల్.సి
ప్రపంచ తెలుగు మహాసభలు ఒంగోలు లో ఘనంగా జరిగాయి .నేను,ఆనంద్ చివరి రోజు సమావేశానికి హాజరయ్యాము ..జనవరి 8 వ తారీకు న విద్య ఫై ఒక సదస్సు జరిగింది.అందులో లక్ష్మణ రావు,బాలసుబ్రమణ్యం, రామిరెడ్డి( శాసన మండలి సభ్యులు) శంకరనారాయణ జర్నలిస్ట్ డా .మన్నార్ ఇందిరా శ్రీనివాసన్,సామర్ల రమేష్ బాబు పాల్గొన్నారు .
బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ మాతృభాషలో విద్య బోధించే దేశాలైన చైనా ,జపాన్ వియత్నాం కొరియా ఉత్పత్తి రంగం లో ముందున్నాయి .పరభాషా బోధనా పై మక్కువున్న మనదేశం సేవల రంగం లో ముందుంది.8 వ తరగతి పూర్తి అయ్యేలోపు ఒక భాష లో నిష్ణాతు లై వుండాలి.మన ఇంగ్లీష్ మీడియం చదువుల్లో బాషలో పట్టు రావటంలేదు .అన్నారు శంకరనారాయణ తన మాటలలో Instein సాపేక్షసిధ్దంతాన్ని, మార్క్స్ దాస్ కాపిటల్ ను తమ మాతృబాష ఐన జర్మనీ లోనే వ్రాసారు. మన్నార్ ఇందిరా గారు ఆఫీసు ల లో మాతృబాష కు ప్రాధాన్యం లేకపోవటం చేత ప్రజలకు ఎలా నష్టం జరుగుతుందో వివరించారు.
బాష ఫై జరిగిన సదస్సు లో డా.పవనకుమార్ మాట్లాడుతూ బాషలు,చరిత్రలు,సంస్కృతులను ఏకం చెయ్యటం కష్టం అన్నారు.ప్రపంచీకరణ లోని ఏకత్వం సంస్కృతిని ఏకం చెయ్యలేకపోయింది సంస్కృతులు భిన్నత్వ దిశగా ప్రయాణం చేస్తాయన్నారు.అన్ని వ్యవస్థలను సమంగా ప్రభావితం చెయ్యగలిగేది విద్య. కంప్యూటర్ కు సంగనకము అని పేరు పెట్టారు.సామల రమేష్ గారు బాషభివ్రుద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.తెలుగు బాష అందచందాల పై ౩౦ నిముషాల పాటు అనర్గళంగా మాట్లాడింది.
ముగింపు కార్యక్రమం లో కృష్ణ జిల్లా వారి డప్పు నృత్యం అధ్బుతంగా వుంది.క్రింద కొన్ని ఛాయాచిత్రములు వున్నాయి
ఛాయాచిత్రాలతో చాలా వివరంగా ప్రపంచ తెలుగు మహాసభల గురించి తెలియజేప్పినందుకు ధన్యవాదాలు. టపా అమరిక సరిగా కుదరలేదు అనుకుంటా... తదుపరి టపా మరింత విపులంగా వస్తుందని ఆశిస్తూ...మీకు అభినందనలు :)
ReplyDeleteకృతజ్ఞతలు.నిజమే
ReplyDelete