ఏప్రిల్ 28 వ తారీకు హైదరాబాద్ జిల్లా ఎడిషన్ చూసిన వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి రైల్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవటం ముక్కలుగా మారి చనిపోవటం. ఆ సమా చారం మా బంధువుల ద్వారా నాకు తెలిసింది.అతను మాకు వరుసకు అన్నయ్య అవుతారు.షాక్. చనిపో వటానికి కారణాలు అంతు చిక్కలేదు.అప్పులు లేవు.ఒక్కడే కొడుకు.పెద్ద బిల్డింగ్.ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం తరువా త తెలిసింది ఏవో చిన్న కారణాలని.ఇంతకు ముందు మా మిత్రుడి ఆత్మహత్యను ఆపగలిగాను అతను నాకు ఫోన్ చె య్యటంతో ఆ విషయాన్ని ఇదే బ్లాగు లో వివరించాను.అలాగే ఈయన కనుక ఫోన్ చేసుంటే ఆపగలిగే వాడినేమో ఇలా ఎందరో చిన్నకారణాలకు జీవిత యాత్ర చాలిస్తున్నారు.
ప్రతి సమస్యకు చావే పరిష్కారం అయితే ఎవరు ఈ ప్రపంచంలో మిగలరు.గంటకు 14 మంది సంవత్సరానికి ఒక లక్షా ఇరవై వేల మంది.ఇది మన దేశం లో ఆత్మ హత్య చేసుకుంటున్న వారి సంఖ్య.ఇందులో 12.1 శాతం తో మన ఆంధ్ర ప్రదేశ్ది రెండవ స్థానం.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది ఆత్మ హత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.ప్రతి 40 సెకన్లకు ఒకరు చనిపోతున్నారు.ఇది 2020 కి ప్రతి 20 సెకన్లకి ఒకటిగా నమోదవుతుందని అంచనా.అందులో 60 శాతం మంది 45 సంవత్సరాలలోపు వారే!మొత్తం బలవన్మమరనాల్లో చైనా,భారత్ లోనే 30% నమోదవుతు న్నాయి.
యువత ఇలాంటి నిర్ణయం తీసు కోవడానికి ప్రధాన కారణం ఒత్తిడిని ఎదుర్కో లేక పోవడం,ప్రేమ విఫల మైన వారు,పరీక్షలు,ఎంట్రన్స్ లలో మంచి రాంక్ రాకపోవటం వలన పెద్దల మందలింపులత,ఉద్యోగం సాధించలేక జీవి తంలో స్థిరపడలేక పోవటం,సంసారంలో గొడవలు,ఆర్హిక ఇబ్బందులు,వ్యాపారాల్లో నష్ట పోవటం ఇలా విభిన్న కార ణాలతో జీవితాలను అంతం చేసుకుంటున్నారు.మరీ దారుణ మైన విషయం ఏమిటంటే అప్పుల పాలైన వారు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మ హత్య చేసుకోవటం.
మరి ఇలాంటి వారు ఆగాలన్నా,ఆలోచించాలన్నా ఏమి చేయాలి?
అంతార్జాతీయంగా ఆత్మీయ నేస్తం.
ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో సేవలందిస్తున్న "Befriendars"అనే సంస్థ ఉంది.మన దేశం లో దీనికి 11 శాఖలున్నాయి.నలభై వేల మంది సిబ్బంది ఉన్నారు.దీనికి అనుబంధంగా హైదరాబాద్లో ఏర్పాటయిందే రోష్ని .వీరికి ఫోన్ చేస్తే చాలు. చక్కని సలహాలతో సాయ పడతారు.నెలకు వీరికి 400 కాల్స్ వస్తుంటాయి.
చిరునామా
రోష్నీ,ఇం.నం 1-8-48/21,కలావతి నివాస్,
సింధీ కాలని, s.p road,secunderabad phone:040-66202000,27848584,email :help@roshnihyd.com
పుస్తక నేస్తాలు.
ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చే పుస్తకాలు.
1)suicide:the forever decision
2)choosing to live
3)how i stayed alive when my brain was trying to kill me
4)change your brain change your life
మన తెలుగులో కూడా మంచి పుస్తకాలు ఉన్నాయేమో సలహాలివ్వండి .
మంచి websites
www.depressionlife.com
www.suicide.com
www.suicidehelplines.comteenadvice.about.com
www.befrienders.com
www.youthsuicide.ca
మనకు ఎవరయినా ఇటువంటి వ్యక్తులు కలిస్తే వాళ్ళ సమస్యను పూర్తిగా విని
ధైర్యం చెప్పండి .అవసర మైతే psychologist ల దగ్గరికి తీసుకేల్లండి.ఈ సమాచారాన్ని మీకు తెలిసిన మార్గాల్లో అందరికి తెలియజేయగలరు.
(ఇందులోని సంఖ్యా వివరాలు, helpline,books,websites సమాచారం ఈనాడు పేపర్ నుండి సేకరించాను.వారికి ధన్యవాదాలు.)
(ఇంతకు ముందు ఆత్మ హత్యలపై ఇదే బ్లాగు లో నేను వ్రాసిన వ్యాసం కోసం ఇక్కడ చూడగలరు.
http://ravisekharo.blogspot.in/2012/09/blog-post_10.html)