Saturday, 11 December 2021

తెలుగు కోసం

 తెలుగు కోసం రచయిత:డా.జి.వి.పూర్ణచందు.                  పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్.    భాష,సాహిత్యం, సంస్కృతి,చరిత్ర ల అనుశీలన అన్న శీర్షికలోనే పుస్తకం లోని విషయాలు ఏంటో తెలుస్తాయి.1)సంస్కృతి చరిత్ర:ఈ విభాగంలో వినాయకుడు,గణపతి ల గురించి వ్రాస్తూ వినాయకచవితిని పర్యావరణ పరిరక్షణ పండుగగా జరుపు కొమ్మని పిలుపివ్వడం బాగుంది.తొలి తెలుగు దేవతలు గురించి ఆసక్తికర విషయాల్లో ఆసక్తికర విషయాలెన్నో.ఆంధ్ర్ర మహావిష్ణువు, మురుగ స్కంధ ,సుబ్రహ్మణ్యం ల వివరణ,అలెగ్జాండర్ దాడి కథల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకి.సుశ్రుతుని వైద్య విధానాలు,బౌద్ధయుగంలో సభాసంప్రదాయాలు,వైదికుల పరిభాషలో విశేషాలెన్నో.,2) మన ఆహారం భాష సంస్కృతి : అన్నమయ్య వంటకాలు, తెలుగు పచ్చళ్ళ ముచ్చట్లు చదువుతుంటే నోరూరాల్సిందే.తినే ఆహారాన్ని అన్నం అనేది తెలుగు వారే. పంచదార చెరకు పండించిన తొలి రైతులు తెలుగు వారే  3) మన భాష:పాణిని వ్యాకరణానికి చేసిన సేవను గూర్చి చక్కగా వివరించారు.కోడింగ్ పద్ధతిని కంప్యూటర్ లో ఒక భాషను వ్రాయటానికి పాణిని పేరు కూడా చేర్చి పాణిని బాకస్ నౌర్ పద్ధతి అనే వ్యవహార నామం వ్యాప్తి లో ఉంది.భాషను పరిశోధించడం ద్వారా చరిత్రను ఎన్నో విధాలుగా మనం తెలుసుకోవచ్చు .ద్రావిడ కుటుంబంలో తెలుగే తొలిభాష అనే ఆశ్చర్యం గొలిపే తెలుస్తుంది.సింధు నాగరికత   ద్రావిడుల నాగరికత.అందులో తెలుగు వారి పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది.దక్షిణ భారతీయ కులాలు,జాతులలో ఆఫ్రికన్,ఆసియన్ మూలాలు ఉన్నట్లు  mt DNA పరీక్షలో నిర్దారణ అయింది.ఈ జాతులు ప్రస్తుతం తెలుగు నేలమీద నివసిస్తున్నారు.వైదిక యుగం కన్నా ముందు పూర్వ ముండా భాష మాట్లాడిన నాగరిక ప్రజలు ఉండేవారని నిరూపణ అయింది.వరి స్పష్టమైన తెలుగు పదం.పూర్వ ద్రావిడ భాషకు దగ్గరగా కనిపించేది తెలుగు భాషే.పాళీ భాషలో తెలుగు వ్యవసాయ పదాలు కలిసి ఉన్నాయి.ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు భాషకు ప్రాచీన హోదాకై విశేష కృషి చేసారు4)భాషోద్యమం-భాషాభివృద్ది.కంప్యూటర్ లో తెలుగు భాషాభివృద్ది ప్రపంచ భాషగా తెలుగును తీర్చటానికి ఇది మొదటి అడుగు.5) మన భాష మన చారుత్ర:అమెరికా మెక్సికో లోని రెడ్ ఇండియన్లు ,'ఇంకా' మయా అనే రెండు ప్రధాన తెగలు కూడా మూల ద్రావిడ భాషకు సంబంధీకులే అన్న విషయం సంభ్రమానికి గురిచేస్తుంది.మూలా ద్రావిడ భాష మాట్లాడిన ప్రజలు ప్రపంచ దేశాలన్నింటా విస్తరించి ,దక్షిణ భారతదేశంలో తెలుగువారిగా స్థిరపడినట్లు అనిపిస్తుంది.ఇప్పటికి 2700 సం. క్రితం తెలుగు నేలను అస్మకులు పరిపాలించారు.15 వ శతాబ్దానికి ప్రపంచం లోనే అత్యధిక ధనిక సామ్రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని తొలుత గుర్తించినవారు పోర్చుగీస్ లు.రాయల కాలం లో వజ్రాల గనులు నిర్వహించారు.ఆంధ్రవిశ్వ విద్యాలయ స్థాపన గురించి వివరంగా ఇచ్చారు.తొలి ద్రావిడ ప్రజలు సుమేరియా మీదుగా బంగాళా ఖాతం గుబడా కృష్ణా,గోదావరి ముఖద్వారాల్లోంచి తెలుగు నేల మీద మొదటగా పాదం మోపారని భారతదేశం లో తొలి ద్రావిడులు తెలుగు ప్రాంతీయులేనని ప్రాంక్లిన్ సి సౌత్ వర్త్ ప్రకటించారు.6) మన సాహుత్యం:పాల్కురికి సోమనాధుని తెలుగు పద ప్రయోగాలను సోదాహరణంగా వివరిస్తారు.రాయల నాటి పాలనా భాష గురించి వివరించారు.తొలి తెలుగు నిఘంటువు "ఆంధ్రదీపిక" మామిడి వెంకటార్య పండితులు రూపొందించారు.తొలి తెలుగు పత్రికల గురించి సవివరంగా వివరిస్తారు.1831 లో తొలి పత్రిక 'తెలుగు జర్నల్' అనే పత్రిక వెలువడింది.స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి పత్రిక "ఆంధ్రపత్రిక" 1908 లో ప్రారంభమయి 1991 లో మూత పడింది.తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ గలా డా.జి వి.పూర్ణచందు గారి విస్తృత పరిశోధనా గ్రంధం ఇది.తెలుగు వారి చరిత్రను పెక్కు ఆధారాలతో వివరించిన వారికి తెలుగు జాతి ఎంతగానో ఋణ పడిఉంటుంది.తెలుగు భాషాభిమానులు,తెలుగు వారి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు,విద్యార్థులు,మరీ ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు,అధ్యాపకులు తప్పక చదవవలసిన పుస్తకమిది.

No comments:

Post a Comment