10 వ తరగతి ముగిసిన వేసవి.కె.విశ్వనాధ్ గారి సినిమా "సిరి వెన్నెల"పేరే ఎంత మనోహరంగా ఉందో .సినిమా చూస్తున్నంత సేపు గుండె స్పందనలు కళ్ళు పలికిస్తున్నాయి.పాటల్లో అప్పటివరకు వినని సాహితీ సొబగులు,మరోలోకానికి తీసు కెళ్లిన వేణుగానం. అప్పుడు పరిచయమయ్యారు సీతారామ శాస్త్రి.అప్పుడే ఇష్టం పెరిగింది వేణుగానం పై.సిరివెన్నెల లోని "విధాత తలపున"ఎన్ని సార్లు పాడుకున్నానో .ఇక అర్ధరాత్రి నెల్లూరు అర్చన థియేటర్ లో "రుద్రవీణ" సినిమా చూసి అందులోని "చెప్పాలని ఉంది ,గుండె విప్పాలని ఉంది" పాట స్ఫూర్తి తో అర్ధరాత్రి ఒంటి గంటకు ఓ కవిత వ్రాసుకున్నా .ఇక నెల్లూరు VR College లో ఏదో function కు వచ్చిన సిరివెన్నెల గారు "త్రిశంకు స్వర్గం లో త్రివర్ణ పతాకం"అన్న ఒక పాట స్వయంగా పాడారు. తరువాత ఏదో పత్రికలో ఆ పాట వస్తే వ్రాసుకుని ట్యూన్ గుర్తు పెట్టుకుని చాలా వేదికల మీద పాడా.National science fair( రాంచీ,జార్ఖండ్) లో పాడి అక్కడి కలెక్టర్ ప్రశంస లందుకున్నా. ఈ పాట గాయం సినిమా లో వచ్చింది.ఇక "ఎటో వెళ్ళిపోయింది మనసు" జామురాతిరి జాబిలమ్మ" "నిగ్గదీసి అడుగు",తరలి రాద తనే వసంతం" "జగమంత కుటుంబం నాది " నాకు బాగా ఇష్టమై పాడుకునే ఆయన పాటలు.మా తరపు ఊహలకు భావుకత అద్దిన పాటల రేడు సిరివెన్నెల."నీవు లేవు నీ పాట ఉంది"మాకు తోడుగా.శ్రద్ధాంజలి వారికి....ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment