పుస్తక రచయిత:రాబర్ట్ హెల్బ్రోనర్ అనువాదం:జాస్తి జవహర్ లాల్. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్. ఆర్థిక సమస్యల మీద చర్చలు ఒక సిద్ధాంతానికి,ఇజానికి కట్టుబడక,ప్రతి ఇజం లోను ఎంతో కొంత నిజం ఉంటుందని,ఏ విషయాన్నయినా,ఇతరుల దృక్పధాన్ని అర్ధం చేసుకోవడానికి నిష్పాక్షికత అవసరం.దీన్ని రాబర్ట్ చక్కగా సమతౌల్యం చేశారని అనువాదకులు ముందుమాటలో చెప్పటం తో పుస్తకం చదవాలన్న ఉత్సుకత కలుగుతుంది. ఆర్థిక దృక్పధం:ఉమ్మడి అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థికశాస్త్రం అవసరమైంది.17 వ శతాబ్దం వరకు కూడా అమెరికాలో లాభం ఒక నేరంగా పరిగణించేవారు అని తెలిసుకుంటే ఆశ్చర్యమేస్తుంది.లాభాపేక్ష ఆధునిక మానవుడితోనే వచ్చింది.16 శతాబ్దం చివరివరకు ఇంగ్లాండ్ లో ఎక్కడ చూసినా బీదలే ఉండేవారు.పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ఆర్థిక వ్యక్తిగా అవతరించాడు. ఆర్థిక శాస్త్రవేత్తలలో ఆద్యుడు ఆడమ్ స్మిత్.ఈయన నైతిక భావ సిద్ధాంతం ప్రతిపాదించారు.విపణిని నియంత్రించే సూత్రాలు వివరించాడు. మాల్తస్ రికార్డో: జనాభా గుణశ్రేడి లో వనరులు,ఉత్పత్తులు అంక శ్రేడి లో పెరుగుతాయి.ఆహార లభ్యత మానవుల సంఖ్యని శాసిస్తుంది.ఇంకా ఇందులో సోషలిస్టులు అయిన రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్,చార్లెస్ పౌరియర్,జాన్ స్టువర్ట్ మిల్ ల గురించి వివరించారు. కార్ల్ మార్క్స్:కమ్యూనిస్టు మేనిఫెస్టో అనేది మార్క్స్,ఏంగెల్సులు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక.హెగెల్ ప్రతిపాదించిన గతి తార్కిక భౌతిక వాదం మార్క్స్ ఏంగెల్స్ లను ఆకర్షించింది.సాంఘిక మార్పులకు,రాజకీయ విప్లవాలకు అప్పటి ఆర్థిక పరిస్థితులే కారణం.ఫ్యాక్టరీలు కార్మిక వర్గాన్ని సృష్టిస్తే,విపణి విధానం వ్యాపార వర్గాన్ని సృష్టించింది అంటారు మార్క్స్.డార్విన్ జీవ పరిణామాన్ని కనుగొన్నట్లుగా మార్క్స్ చరిత్రలో సంఘ పరిణామాన్ని కనుగొన్నారు అంటారు ఏంగెల్స్.ఇంకా ఇందులో వెబ్లెన్,మేవర్ట్ జోసెఫ్ షాంపెటర్ వంటి వారి గురించి వివరిస్తారు. గతం లో సంపద అన్న ధ్యాసగాని,దాచిపెట్టుకోవాలన్న తపన గాని లేవు.కొన్ని పనులు చెయ్యడం లో లాభం ఉన్నదనుకొన్నప్పుడు పెట్టుబడిదారుడు అవతరించాడు.ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలతో కూడిన పుస్తకం ఇది.ఆర్ధిక శాస్త్రం మీద ఇష్టం ఉన్న వ్యక్తులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
No comments:
Post a Comment