రచయిత:N.R.నారాయణమూర్తి. అనువాదం:వసుంధర. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్ ఇండియాలో ఉపాధి కల్పనకు,పేదరిక నిర్ మూలనకి వ్యాపారదక్షతను సాధనం చేసుకోవాలన్న ఆలోచన నుండి ఉదయించిందే ఇన్ఫోసిస్ అని ,యువతతో పనిచేస్తున్నప్పుడు తన మెదడు బాగా పనిచేస్తుంది అని ముందుగా చెప్పడం ద్వారా పుస్తక ఉద్దేశ్యాన్ని,ఆయన ఇచ్చే సందేశాలను గూర్చి తెలియజేసారు రచయిత.మన దేశం సాధించిన విజయాలు తక్కువేమీ కావంటూ దేశంలో పేదరికం,నిరక్షరాస్యత, వ్యాధులు,విద్య వంటి విషయాల్లో మనం ఉన్న స్థాయిని వాస్తవికంగా తెలియజేసారు.నిజాయితీ పరులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేస్తే ఏ దేశమైనా ఎన్ని అడ్డంకులనైనా అధిగమించి గొప్పతనాన్ని సాధించగలదు.ఉన్నత లక్ష్యాల కోసం కలలు కనాలి.వాటి సాఫల్యాని కి త్యాగాలు చేయాలంటారు. విద్యార్థులారా అన్న వ్యాసం లో మనం ఉత్పత్తి చేసిన సంపద కారణంగా గుర్తింపు వస్తుంది.మనకున్నది నిర్భాగ్యులతో పంచుకోవడమే మన సంపదకు సద్వినియోగం అని యువతకు గొప్ప సందేశమిచ్చారు.మనదేశ ప్రజల దయనీయ స్థితులు వివరిస్తూ 1000 సం. రాల బానిసత్వం వల్ల వచ్చిన ఉదాసీనత ను వదిలి పెట్టాలని,నమ్రతను అలవర్చుకోవాలని పిలుపిస్తారు.రేపు నేను కనిపించకపోతే,నేనేమయ్యానని నా వాళ్ళు వెతుక్కునేందుకు నేనేం చెయ్యాలి?అని అంతర్మధనం చెందుతారు.మార్పొక్కటే నేటి ప్రపంచం లో నిత్యం .ఏ రంగం లో నైనా ప్రావీణ్యత సాధించటం మొక్కటే విజయానికి మార్గం అని దిశానిర్దేశం చేస్తారు.ఎందుకూ అని కాదు,ఎందుక్కాదు అని ప్రశ్నించుకోవాలంటారు. పాశ్చాత్యుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్న వ్యాసం లో తనకంటే ఎక్కువ సాధించినవారిపట్ల గౌరవభావం ఉండాలని,పూచీ పడే స్వభావముండాలని,నిజాయితీతో,సమయపాలన పాటిస్తూ ఉండాలంటారు.1991 లో మన దేశానికి ఆర్ధిక స్వాతంత్ర్య0 వచ్చింది.హరిత,శ్వేత విప్లవాలు ,1991 ఆర్ధిక సంస్కరణలు రోదసీ విజ్ఞానం,అణుశక్తి,software విప్లవం దేశ స్వరూపాన్ని మార్చివేశాయి అంటారు.జ్ఞానాన్ని నవీకరణకు ఉపయోగించుకునే దేశం లాభపడుతుంది అంటారు.ఉన్నత విద్యారంగం లో సంస్కరణలు రావాలని ఆశిస్తారు.నాయకుల స్థాయిని బట్టి దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు.తను స్థాపించిన ఇన్ఫోసిస్ యాత్రాక్రమాన్ని వివరిస్తూ లాభాల్ని చట్టబద్ధంగా నైతికంగా సాధించాలి అంటారు.ఇందులో ఇంకా వాణిజ్య సంస్ధ పాలన,వ్యాపార దక్షత,ప్రపంచీకరణ వంటి ఎన్నో అంశాలపై స్పూర్తిదాయక,సందేశాత్మక వ్యాసాలున్నాయి.యువతను తీవ్రంగా ప్రభావితం చేసే పుస్తకం ఇది.ముఖ్యంగా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఎదగాలనుకున్న యువత చదివితీరాల్సిన పుస్తకం ఇది.
No comments:
Post a Comment