ప్రతి మనిషి ఏదో ఒక ఉద్యోగం ,లేదా వ్యాపారం ,వ్యవసాయం వృత్తి పనులు ,స్వయం ఉపాధి మార్గాలు ఎన్ను కొని జీవితాన్ని గడుపుతుంటాడు.తరువాత వివాహం చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంబిస్తాడు ఇక్కడ నుండి ఎంతోముందుచూపు,చక్కని ఆర్ధిక ప్రణాళిక ఉంటె కానీ అతని జీవితం సరి అయిన దారిలో నడవదు.
కుటుంబం గడవటానికి అవసరమైన డబ్బు సంపాదన అన్వేషణాక్రమంలో మనిషి ఎన్నో మార్గాలను వెతుకుతుం టాడు.చట్టబద్ధంగా,న్యాయబద్దంగా అయితే ఫర్వాలేదు.తన అవసరాలు,కోర్కెలు తీర్చు కోవ డం కోసం అవసరమైన ధన సంపాదన మనిషిని ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
ముందుగా మనిషి అవసరాలు ఏమిటి? అని ఆలోచిస్తే ఇల్లు,ఆహార పదార్థాలు బట్టలు,విద్య వైద్యం వీటిని మ నం ప్రాధమిక అవసరాలుగా పరిగణిస్తాం.సొంత ఇల్లు కట్టాలంటే స్థలము ఎంతో ముందుగా కొని పెట్టుకోవాలి.ఇల్లు కట్ట టానికి అయ్యే ఖర్చును లెక్కించి ఎంతో చక్కని ఆర్ధిక ప్రణాళికతో ముందడుగు వెయ్యాలి.అలా కాకుండా మన స్నేహి తులో బంధువులో కట్టారని అప్పు చేసి ఇల్లు కట్టటం తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందులుకు లోను కావడం మంచిది కాదు పరిస్థితులు అనుకూలించేంతవరకు వరకు అద్దె ఇంట్లో వుంటూ దీర్ఘకాలిక ప్రణాళికతో ఇల్లు కట్టాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత మన ప్రాధమిక అవసరాలకు దాన్ని ఏవిధంగా ఖర్చు పెట్టాలి?అన్నపూర్తి అవగాహనతోనడచుకో వాలి.
మనం తినే ఆహార పదార్థాలలో పోషకాహారాలకు ఖర్చు పెట్టాలి.చాలా మంది ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థా ల కు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు .బట్టలు కూడా విలువైనవి పోటీ పడి కొంటుంటారు. ఇందులో ఎక్కువగా మిగ తావారిని చూసి వారి కంటే మిన్నగా వుండాలని కొంటుంటారు.ఒక మనిషికి స్త్రీ అయినా పురుషుడు అయినా ఐదు లేక పదిజతలు అవసరమవుతాయి.కానీ ప్రస్తుతం ఇంతకు ఎన్నోరెట్లు కొంటున్నారు.
ఇక ఇంటికి అవసరమయ్యే వస్తువులు కొనే సంస్కృతి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది.ప్రతి ఒక్కరి ఇంట్లో డబు ల్ కాట్ ,టి.వి ,ఫ్రిజ్ కూలర్, సోఫా సెట్,dyning table, ఖరీదయిన కుర్చీలు,కంప్యూటర్ లాంటి పరికరాలు కొంటు న్నారు .ఇవన్నీ ఉంటేనే మిగతా వారికి సరితూగ గలమని భావిస్తున్నారు.తమ ఆదా యానికి మించి అప్పులు చేసి మరీ కొన టం జరుగుతుంది.అలాగే బంగారం మీద విపరీతమైన వ్యామోహం తో ఖరీదయిన ఆభరణాలు చేయించుకో వటం ఒక fashion గా మారిపోయింది.మిగతా వారితో పోలిక ఈ వస్తువులను కొనే సంస్కృతిని పెంచుతుంది
అలాగే cell phones అత్యంత ఖరీదయినవి కొనటం,విపరీతం గా వాటి ద్వారా మాట్లాడటంతో ఎంతో డబ్బు వృధా చేస్తున్నారు.చిత్తూర్ జిల్లాలో ఒక పరిశీలన ప్రకారం గత సం:సెల్ ఫోన్ బిల్ 500 కోట్లు అయి నట్లు తేలింది.జిల్లా మొత్తం వాడిన పాల బిల్ 450 కోట్లు.గమనించండి.కాలేజీ పిల్లలకు కూడా వీటిని కొనిచ్చివారి జీవితాలను పాడుచేస్తున్నారు ఇక ద్విచక్ర వాహనాలు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదు. ప్రతి చిన్న పనికి వాహనాలు వినియోగిస్తూ పెట్రోలు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.అందుకే చైనాలో సైకిల్ ను దేశమంతా వారంలో ఒకరోజు వాడేలా ప్రోత్సాహిస్తున్నా రు.ఇక విందులు,వినోదాలు,ఫంక్షన్లకు పోటీలు పడి ఖర్చు పెడుతున్నారు.కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే ఫంక్షన్ల లో ఆహారపదార్థాలు ఎంతో వృధా అవుతుంటాయి.ఒకరిని మించి మరొకరు తమ ఆడంబరాన్ని చూపటానికి ఈ ఫంక్షన్స్ కి ఖర్చు పెడుతున్నారు.మధ్య తరగతి ,పేదవారు కూడా అప్పులు చేసి మిగతావారితో పోటీలు పడి వ్యయం చేస్తున్నారు.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )
అన్నీ వాస్తవాలే!,చేదు నిజాలు ఇలా చెపితే కష్టం సుమండీ!
ReplyDelete:):)
వాస్తవాలు తెలుసుకుంటేనే మనుషులు నష్ట పోకుండా వుంటారు.కాకర కాయ చేదైనా ఆరోగ్యానికి మంచిదేగా!మీకు ధన్యవాదాలు.
Deletebhaagundi sekher, analysis.
ReplyDeleteధన్యవాదాలు.
Deleteహా హా హా! ఇక్కడ కూడా అదే వైఖరి అండి రవిశేఖర్ గారు!
ReplyDeleteజీతాలకు మించి mansions లాంటి ఇల్లులు కొంటారు, ఉద్యోగం ఫట్ మనగానే bankrupcy లు file చెయ్యటాలు, ఆడంబరాలకు పోవటం చాలా ఎక్కువ! మంచి పోస్ట్ రాసారు.
ప్రపంచంలోని మనుషుల మనస్తత్వం ఎక్కడైనా ఒకలాగే ఉంటుందండి.మీరన్నట్లు ఈ మధ్య అమెరికా లోని ఆర్ధిక సంక్షోభానికి ఈ house loans కారణం కదా!india లో అంత సులభంగా ఇవ్వరు.ప్రపంచం లో తెలివి పెరిగే కొద్దీ సమాంతరం గా అజ్ఞానం పెరుగుతుందేమో అనిపిస్తుంటుంది.లేకపోతే కష్టపడి సంపాదిం చిన డబ్బు షేర్లలో పెట్టి పోగొట్టుకోవటం చాలా చిత్రంగా ఉంటుది మనిషి మనస్తత్వం.
Deleteమీరు చెప్పింది అక్షరాల నిజం రవిశేఖర్ గారు.... అవసరాల కన్నా ఆడంబరాలకే ఎక్కువ ప్రాధాన్యర ఇస్తున్నారు...
ReplyDeleteతమ స్ధాయి, స్ధోమత మరచి గొప్పకోసం విచ్చలవిడి ఖర్చులు చెయ్యడం సాధారణం అయిఫోయింది..
సూపర్... తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ...
ఇప్పుడు పల్లెల్లో కూడా సంపాదించింది అంతా ఖర్చు చేసే సంస్కృతి బాగా పెరిగింది.ఆడంబరం కోసం అప్పులు చేయటం ,తమ హోదా ప్రదర్శించుకోవటం స్తాయికి మించి ఖర్చు పెట్టటం ఇవన్నీ మనిషి పతనానికి మార్గాలు.మీకు ధన్యవాదాలు .
Delete" చిత్తూర్ జిల్లాలో ఒక పరిశీలన ప్రకారం గత సం:సెల్ ఫోన్ బిల్ 500 కోట్లు అయి నట్లు తేలింది.జిల్లా మొత్తం వాడిన పాల బిల్ 450 కోట్లు."...
ReplyDeleteఈ లెక్కన ఒక సంవత్సరంలో ప్రజలు ఖర్చు చేసే అన్ని బిల్లులూ చూస్తే ఇండియా పేదదేశం అని ఎవరనగలరండి ?
...ప్రజలు కొన్ని అనవసరమైన ఖర్చులను తగ్గించి ఆ డబ్బును సమాజాభివృద్ధికి ఖర్చు చేస్తే పేదరికం ఉండనే ఉండదు.
మనది పేదదేశం కాదు. సమాజాభివృద్ధి గురించి సరైన ప్రణాళిక లేకపోవటం, అందుకు తగ్గ చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే..... దేశంలో పేదరికం ఉన్నదనిపిస్తుందండి... సంపద కొందరు సంపన్నుల వద్దే ఉండటం కూడా పేదరికం పెరగటానికి ముఖ్యకారణం..
మీరు చెప్పింది అక్షర సత్యం .సంపద పోగుపడటమే పేదరికానికి కారణం.ప్రభుత్వాల దగ్గరనుండి వ్యక్తుల వరకు ఎవరికీ సరయిన ప్రణాళిక లేక ఈ దేశం ఇలా తయారయ్యింది.ధన్యవాదాలండి.
Delete@కష్టపడి సంపాదిం చిన డబ్బు షేర్లలో పెట్టి పోగొట్టుకోవటం చాలా చిత్రంగా ఉంటుది మనిషి మనస్తత్వం.
ReplyDeleteలక్షలాది రూపాయలు షేర్లలో సంపాదించేయ వచ్చు అని ఆ మయాజాలంలో పడీ కొట్టుకుపోతారు...బాంక్ లో వచ్చే వడ్డీ తక్కువ అది తృప్తినివ్వదు...తక్కువ టైమ్ లోబోలెడంత గడించేయాలి...ఇదీ మూల కారణం...