Sunday, 10 June 2012

జీవితాన్ని తృప్తిగా జీవించటానికి 10 సూత్రాలు(2)


గత భాగం తరువాయి
           వీటన్నింటికి డబ్బు ఎక్కడనుండి వస్తుంది.డబ్బు సంపాదించటం కోసం ,అదనపు ఆదాయం కోసం సులభంగా డబ్బు సంపాదించే మార్గాల వైపు ప్రయాణం చేస్తారు.ప్రధానంగా ఉద్యోగుల్లో నైతే అవినీతి, మిగ తావారు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలకోసం మోసాలు చేయటం,షేర్లు కొనటం ,అమ్మటం, రియల్ ఎస్టే ట్ ,పేకాట,పందాలు కట్టటం, అధిక వడ్డీలకు ఆశపడి ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థల్లో deposites కట్టటం 10000 లకు  60,000 రూపాయలిస్తామని చెప్పే కంపెనీల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకోవటం(ఈ మధ్య india లోని 3 రాష్ట్రాల్లో 2000 కోట్లు జనం పోగొట్టుకున్నారు.) networkmarketing సంస్థల్లో చేరటం ఇలా విభిన్న మార్గాల్లో మోసపోతుంటారు.మరల ఆ కోల్పోయిన డబ్బును సంపా దించటం కోసం పలు అక్రమ మార్గాల వైపు ప్రయాణిస్తుంటారు.మనిషికి ఇదంతా నిత్యకృత్య మయింది.
          వీటన్నింటికి కారణం మనిషికున్న కోరికలు,వస్తువులు విచ్చల విడిగా కొనే సంస్కృతి,అత్యాశ కార ణంగా చెప్పవచ్చు.కోరికలు దుఃఖానికి కారణమని 2500 సం: క్రితం గౌతమ బుద్ధుడు చెప్పాడు కోరికలను పరిమితం చేసుకోవాలి.మనకున్న ఆదాయాన్ని బట్టి మన ఆలోచనలుండాలి .అత్యాశకు పోకూడదు. ఎక్కువ వడ్డీ,ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారంటే అందులో ఏదో మోసం ఉంటుందని అంచనా వేయలేక పోవటం జనం యొక్క బలహీనత.బ్యాంకు, పోస్టల్ వడ్డీల కంటే ఎక్కువ వస్తుందంటే రిస్క్ పెరిగినట్లే.
      ఇక విద్య,వైద్యం వ్యాపారమయంగా మారిపోయాయి.ప్రైవేటు స్కూ ల్స్ ,కాలేజీల ఫీజులు పేద మధ్య తరగతి వారిని అప్పులపాలు చేస్తున్నాయి.అలాగే వైద్యం ఖర్చులు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. జబ్బులు రాకముందే ముందు జాగ్రత్త తీసుకునే అలవాటు మనుషులకుండటం లేదు.విద్య,వైద్యం తప్ప ని సరి అయినవి కాబట్టి సరి అయినవి ఎన్నుకోవటం చాలా అవసరం.లేక పోతే ఫలితం రాకపోగా ఎంతో డబ్బును, విలువైన కాలాన్ని, జీవితాన్ని కోల్పోతాము.వస్తువులు విపరీతంగా కొనే సంస్కృతిని పరిమి తం చేసుకొని తమ పిల్లలకు మంచి విద్యను అందింప చేయటం,చక్కని ఆరోగ్య పరిరక్షణకు తమకున్న వనరులు ఖర్చు చేయటం సరి అయిన ఆర్ధిక ప్రణాళిక.ఇన్ని ఒత్తిడుల మధ్య మనిషి తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు.మానసిక సమస్యలు,B.P,SUGAR,గుండెపోటులకు గురవుతున్నాడు వ్యసనాలకు బానిస కావటం చివరకు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది.
      ఆడంబరం లేని సరళమైన జీవితాన్నిఎలా జీవించాలో తెలుసుకోవాలి.జీవితం తృప్తిగా ఆనందంగా గడిచి పోవాలంటే ఏమి కావాలో తెలుసుకోవాలి.అందుకు కొన్ని మార్గాలు
 1) కోరికలను పరిమితం చేసుకోవటం
2) అవసరం లేని వస్తువులను కొనే సంస్కృతిని తగ్గించుకోవటం
3) ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు
4) ప్రాధమిక అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం
5) అత్యాశకు పోకుండా వుండటం
6) కష్ట  పడకుండా  సులభంగా సంపాదించాలనే ఆశకు పోకుండా వుండటం
7) పొదుపు మంత్రాన్ని పాటించటం
8) సరళమైన జీవితాన్ని గడపటం
9) ఇతరులతో పోటీని ,పోలికను మానుకోవటం
10) వ్యసనాల బారిన పడకుండా వుండటం
ఈ 10 సూత్రాలతో చాలావరకు జీవితాన్ని తృప్తిగా ఆనందంగా జీవించవచ్చు.        

20 comments:

  1. చాలా చాలా బాగా రవిశేఖర్ గారు........!
    అన్నీ నిజాలే కానీ పాటించడం కష్టమేమో కొన్ని..కాని చాలా మంచి పోస్ట్ అందించారు....

    ReplyDelete
    Replies
    1. నిజాలని తెలిసి పాటించక పోతే తనతో పాటు తన కుటుంబం ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది కదా!మీకు బాగా నచ్చిందంటే మీరు సరళమైన జీవితాన్ని ఇష్ట పడుతున్నట్లే.మీకు ధన్యవాదాలు

      Delete
  2. పాటించడానికి కష్టమే అయినా, పదిలమైన సూత్రాలు. బాగాచెప్పారు!

    ReplyDelete
    Replies
    1. పాటించటం అంటే మనిషి ఆ మనస్తత్వం లో వుండాలి.అప్పుడు చేసే పనుల్లో అది ప్రతి ఫలిస్తుంది.కొంతమంది కోటీశ్వరులు కూడా సరళమైన జీవితాన్ని గడుపుతారు.మీకు ధన్యవాదాలు.ఉదాహరణకు infosys నారాయణమూర్తి,సుధామూర్తి జీవితశైలి చదివాను.ఎంత సింపుల్ లైఫ్.అలాగే టాటా చైర్మన్ రతన్ టాటా వారి జీవితం కూడా !

      Delete
  3. బాగా చెప్పారండీ. ఉన్నదానితో తృప్తి పడటం కన్నా ఆనందమయినది వేరొకటి ఉండదేమో!

    ReplyDelete
    Replies
    1. మీరు కరెక్ట్ గా నిర్వచించారు జీవితాన్ని.మీకు ధన్యవాదాలు.

      Delete
  4. Useful post..ధ్యాంక్యూ రవిశేఖర్ గారు....

    ReplyDelete
  5. Replies
    1. thank you.అందరికి తెలిసినవే.ఆచరించరు అంతే!

      Delete
  6. బాగా చెప్పారు.
    పై సూత్రాలు పాటించే ఒక్క మనిషికి 10సంవత్సరాలకు ఉజ్జాయింపుగా ఎంత డబ్బు/సంపాదన అవసరమవవచ్చంటారు?

    ReplyDelete
    Replies
    1. మీకు ధన్య వాదాలు.లెక్క వెయ్యండి .

      Delete
  7. తృపిగా జీవించడానికి పాటించాల్సిన అతి ముఖ్యమైన సూత్రాలు చక్కగా రాసారు.
    ధన్యవాదాలు మీకు!

    ReplyDelete
    Replies
    1. వాటిని సాధ్యమైనంత వరకు జీవితం లో ఆచరిస్తుంటే దాని లోని త్రుప్తి అర్థమవుతుంది.మీకు ధన్య వాదాలు.

      Delete
  8. పాటించాల్సిన పది పదిలమైన సూత్రాలను చక్కగా చెప్పారు. ఇంతకాలం ఇన్ని మంచి విషయాలను ప్రస్తావించిన మీ బ్లాగ్ ని మిస్ అయ్యాను. ఇప్పుడే మీ పోస్ట్స్ చదువుతున్నాను. చాలా చక్కటి పోస్ట్స్. ఉపయుక్తమైనవన్నీ చర్చించారు. మంచి మంచి విషయాలు తెలిపినందుకు అభినందనలు మరియు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  9. స్వాగతం భారతి గారు!మీకు అంతలా నచ్చిపాత టపాలు అనుకోకుండా స్పందించినందుకు మీకు ధన్యవాదాలు.ఆచరిస్తుంటే అందులోని ఆనందం అర్థమవుతుంది.

    ReplyDelete
  10. nice post మీరు చెప్పిన సూత్రాలనే పాటించడం వల్ల ఎగువ మధ్యతరగతి కుటుంబం నుండి మధ్య తరగతి కుటుంబం కి జారిపోయాం అయినా సంతృప్తిగా ఉన్నాం.. ఇలాంటి కుటుంబాల ఆర్ధిక అభివృద్దికి చదువులే శరణ్యమయ్యాయి విదేశీ వలసలు కూడా అందుకే ఎక్కువవుతున్నాయి ఇక్కడే ఉంటి స్థాయిలో బంధుమిత్ర పరివారంతో పోల్చుకుని అసంతృప్తి సెగల మధ్య బ్రతకలేక ఆత్మనూన్యతతో చావలేక అన్నట్లు..

    ReplyDelete
  11. ఎప్పటి పోస్ట్ నో ఇప్పుడు చదివి స్పందించిన మీకు ధన్యవాదాలు .

    ReplyDelete
  12. Needy post for present situations

    ReplyDelete