Friday, 27 April 2012

నా హృ(మ)ది లో ...



మానస వీణకు తీగెలు సరిచేసి
స్వరాలు కూరుద్దామని కూర్చున్నా
సంధ్యా సాగరపు ఒడ్డున
అప్పుడప్పుడు పాదాలు స్పృశించే
అలల చిరుతాకిడి  చెంతన
మనసు నా వశం కావటం లేదు
సరిగమలు పలికిస్తున్నంతలో
ఉవ్వెత్తున సవ్వడి చేస్తూ కెరటాలు
ఎక్కడికో వెళ్లాలని
సముద్రుని విడిచి ఎగరాలని
అంతలోనే మళ్ళీ వెనక్కి
నా ఆలోచనలు అంతే
ఓ వరుసలో కూర్చి పాటగా పలికిద్దామన్నా 
పల్లవులను కూర్చి గొంతెత్తి పాడుదామన్నా
ఏవో సంక్లిష్ట సంకేతాలు
మరేవో అస్పష్ట సంగీతాలు
నా మనో సాగరాన ఒక్కోసారి నెమ్మదిగా
ఇంకోసారి ఉధృతంగా విరుచుకుపడే స్థాయిలో
ఏవేవో ఒత్తిడులు
మరేవో బంధాలు
ఒత్తిడులనుండి కొన్ని దృశ్యాలు
బంధాలనుండి మరిన్ని చిత్రాలు
కాని కెరటాల్లా కాకూడదు నావి
నిగ్రహంతో లక్ష్యాన్ని ఢీకొనాలి
తీగెలు సరిచేస్తూ కాలం గడిపేయకూడదు.
గుర్రపు గిట్టల బలంతో విచారపు
గతాన్ని వెనక్కి తన్ని
వర్తమానపు సంకేతాలను మోసుకుంటూ
భవిష్యత్ ఛాయాపథం లోకి దూసుకెళ్ళాలి.
తేనె లొలుకు తెనుగుకు మాలలు కట్టి
తీయనైన పాటలతో హారతి పట్టి
ముందుకు మున్ముందుకు వెళతాను
కష్ట జీవి స్వేదంతో నేను కలిసిపోతాను
కార్మికుడి కన్నీటిలో లీనమౌతాను
అనాధ నేత్రాలకు వెలుగౌతాను
ఇదంతా కేవలం భావోద్వేగం కాదు
నా హృదిలోని  స్పందనలు
నా మదిలోని   భావనలు

8 comments:

  1. wonder full...
    మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ ..

    ReplyDelete
  2. Superb! చాలా బాగుంది రవిశేఖర్ గారు!

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకు థాంక్స్ వెన్నెల గారూ!

      Delete
  3. రవిశేఖర్ గారూ..మీ హృదిలో స్పందనలకు చక్కని అక్షరరూపమిచ్చారు. మీరనుకున్నది సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    వార్డ్ వెరిఫికేషన్ తీసేయండి. వాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.

    ReplyDelete
  4. కవితని ఇంకాస్త మెరుగు పెడితే - మనసుని సాగరం తో పోలుస్తూనే, ఆశయాలని మాత్రం కెరటాల్లా ఆపకూడదన్న భావం/లక్ష్యం పెట్టుకోవటం అన్న - స్వగతం ఇంకాస్త స్పష్టంగా వెలికి వచ్చేది. వస్తువు వరకు మంచి అంశం. మనిషికున్న నిక్షిప్త నిధి మనసు ఒక్కటే. రత్నాలు వెలికి తెచ్చినా, రాళ్ళని పారవేసుకున్నా ఎవరికీ వారు చేసుకునేదే. అనుభవమే ప్రమాణం, జీవితమే సమాధానం.

    ReplyDelete
  5. స్వాగతం !ధన్యవాదాలండి .నా వ్యాసాలన్నీ మనసు పై సాగుతున్నాయి గమనించండి.

    ReplyDelete