కృష్ణా నది పరవళ్లు ఎగువ ప్రాంతాల్లో పడ్డ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం చేరుకొనడం తో డాం 10 గేట్లు ఎత్తి నీరు వదిలారని తెలిసి ఆదివారం(14/8/2022) చూద్దామని వెళ్ళాం.వందలాది కార్లు బస్సు లతో విపరీతమైన ట్రాఫిక్. Site seeing అని ఇంతకు ముందు 50 rs ticket తో APSRTC buses నడిపేది. ఆ service నిలిపివేయడం తో మనిషికి 200 rs పెట్టి auto లో వెళ్ళాం. మళ్ళీఈ service పునరుద్దరిస్తే సామాన్యులకు చాలా మేలు. మరి APSRTC వాళ్ళు స్పందిస్తారో లేదో చూడాలి. ఇక డాం దగ్గరకు చేరుకొని ఆ మనోహర దృశ్యాన్ని తనివి తీరా చూసి వీడియోల్లో ఫోటోల్లో బంధించాము. మనకు దగ్గరకు ఇంత అద్భుతమైన జల ప్రవాహాన్ని చూడడం అపూర్వం. 1 కి.మీ మేర నీటి తుంపరలు వెదజల్లుతుంటే చూడటానికి రెండు కళ్ళు చాల్లేదు.10 గేట్ల నుండి దూకిన జల ప్రవాహం తిరిగి పాము పడగ విప్పినట్టు మళ్ళీ పైకి లేచి పడటం మహాద్భుతం. డాం నిండుకుండలా ఉంది. కానీ ఒకటే బాధ. ఇంత నీరు వృధా గా సముద్రం లోకి వెళ్ళిపోతుందే అని. ఈ నీరంతా వెలుగొండ ప్రాజెక్టు కు రాయలసీమ, తెలంగాణ లోని ప్రాజెక్ట్ లలో పట్టుకుంటే కొన్ని కోట్లమంది రైతులకు పండుగ అవుతుంది.... ఒద్దుల రవిశేఖర్.
No comments:
Post a Comment