Sunday, 1 January 2017

కాలం(Time)
                     భూమి సూర్యుని చుట్టూ మరో  సారి చుట్టి వచ్చింది.అందుకే మన మంతా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం.కాలాన్ని విభజించుకుని పని చేయటం అలవాటయిపోయింది మరి.కానీ గతం లోని పనులు,భావాలు ,అభిరుచులు, లవాట్లు అభిప్రాయాలు దృక్పధాలు ఇవేమన్నా మారాయా,అలాగే ఉన్నాయా   తరచి చూసు కోవటం లేదెవ్వరు.కాలంతో పాటు ఎన్నో మారుతుంటాయి. ఆ మార్పు మంచి వైపుకైతే ఆహ్వానించవచ్చు.అదే చెడు వైపుకైతే ఆలోచించాల్సిందే .
               కొత్తదనం ప్రతి క్షణానికి సొంతం.దాన్నిమరిచి పోతున్నాం .ప్రతిక్షణం మన మనసు నిత్యనూతనం.ప్రతి క్షణాన్ని ఇలాగే ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.జీవితం నిత్య నూతన మై పోదూ !మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ,ఉత్సాహంగా ఉంచుకుంటూ ఉంటే ఆనందం వెతుక్కుంటూ వస్తుంది .
            గతాన్ని తవ్వుకుంటూ బాధపడే కన్నా వర్తమానంలో ఉంటూ చేసే పనిలో లీనమైతే ఆనందం మన సొంత మవుతుంది.కాలం మనల్ని తనలోకి లాక్కెళుతూ ఉంటుంది.ఆ ప్రవాహంలో కొట్టుకు పోకుండా అనుబంధాలను,స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ నిత్య నూతనంగా అందరూ గడపాలని నా కోరిక .     

4 comments:

  1. మీరు బ్లాగ్ లో రాయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మళ్ళి పాత మిత్రులను చూసిన ఆనందం. ఇక పై ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తారని ఆశ్శిస్తూ....మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. కాలం ఎంతవేగంగా కదిలిపోతుందో కదా!ఈ బ్లాగుల ద్వారానే ఎంతో మంది మిత్రులం ఇక్కడ కలుసుకున్నాము. ప్రత్యామ్నాయ మార్గాలైన ఫేస్బుక్ ,వాట్సాప్ రావటం తో అందరు అటువెళ్ళారు ,కానీ ఇంతకు ముందు మీరన్నట్లు ఇది సొంత ఇల్లు లాంటిది .ధన్యవాదాలు పద్మార్పితగారు మీ పలకరింపుకు తప్పకుండ వ్రాస్తాను .మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

      Delete
  2. nice views on time
    Hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    ReplyDelete