కాలం(Time)
భూమి సూర్యుని చుట్టూ మరో సారి చుట్టి వచ్చింది.అందుకే మన మంతా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం.కాలాన్ని విభజించుకుని పని చేయటం అలవాటయిపోయింది మరి.కానీ గతం లోని పనులు,భావాలు ,అభిరుచులు, లవాట్లు అభిప్రాయాలు దృక్పధాలు ఇవేమన్నా మారాయా,అలాగే ఉన్నాయా తరచి చూసు కోవటం లేదెవ్వరు.కాలంతో పాటు ఎన్నో మారుతుంటాయి. ఆ మార్పు మంచి వైపుకైతే ఆహ్వానించవచ్చు.అదే చెడు వైపుకైతే ఆలోచించాల్సిందే .
కొత్తదనం ప్రతి క్షణానికి సొంతం.దాన్నిమరిచి పోతున్నాం .ప్రతిక్షణం మన మనసు నిత్యనూతనం.ప్రతి క్షణాన్ని ఇలాగే ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది.జీవితం నిత్య నూతన మై పోదూ !మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ,ఉత్సాహంగా ఉంచుకుంటూ ఉంటే ఆనందం వెతుక్కుంటూ వస్తుంది .
గతాన్ని తవ్వుకుంటూ బాధపడే కన్నా వర్తమానంలో ఉంటూ చేసే పనిలో లీనమైతే ఆనందం మన సొంత మవుతుంది.కాలం మనల్ని తనలోకి లాక్కెళుతూ ఉంటుంది.ఆ ప్రవాహంలో కొట్టుకు పోకుండా అనుబంధాలను,స్నేహ సంబంధాలను కాపాడుకుంటూ నిత్య నూతనంగా అందరూ గడపాలని నా కోరిక .