ఆంధ్రప్రదేశ్ లో 3 నెలల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి .నిన్ననే సర్పంచ్ లకు చెక్ పవర్ వచ్చింది .మరి గ్రామాలు ఎలా ఉండాలి?మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఎక్కడుంది? సర్పంచ్ ల నాయ కత్వంలో ప్రజలు సమిష్టి కృషితో ఏ విధంగా అభివృద్ది సాగించాలి? అనే విషయాలను మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా నగర్ తాలుకాలోని హివ్రేబజార్ గ్రామాన్నిపరిశీలిస్తే అర్థమవుతుంది.
ప్రపంచంలోని వంద దేశాల ప్రతినిధులు సందర్శించిన పల్లె అది.సర్పంచ్ ఎలా ఉండాలో ప్రజలెలా ఉండాలో ఆదర్శ గ్రామాలు ఎలా ఉండాలో నిరూపించిన గ్రామం ఇది.ఆ వూరి సర్పంచ్ పేరు పోపట్రావు పవార్.ప్రజలు,నీళ్ళు అడవి,జంతువులు ఆయన అజెండా!అంతర్గత శతృవులయిన కరవు ,పేదరికం నిరుద్యోగం,అనారోగ్యం ఇవే కదా ! పల్లెలకు శత్రువులు .వీటిపై మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలని పిలుపు నిచ్చాడు జల సంరక్షనే ప్రధాన లక్ష్యం వాన చినుకుల్ని ఒడిసి పట్టుకున్నారు.ప్రభు త్వ నిధులు ఒక్క పైసా దుర్వినియోగం కాకుండా 600 ఇంకుడు గుంతలు త్రవ్వుకున్నారు. checkdam లు కట్టుకున్నారు.పల్లె అంతా బిందు సేద్యమే!నీటి ఆడిట్ పద్ధతిని ఏర్పాటు చేసుకుని గొట్టపు బావులు నిర్మించారు.గ్రామసభలోచర్చించి ఎవరు ఏ ఏ పంటలు వేయాలో నిర్ణయిస్తారు. అన్ని వసతుల గల పాటశాల నిర్మించుకున్నారు.ఒక్క దోమ కూడా అక్కడ కనపడదు .ప్రతి ఇంటికి మంచి నీటి కుళా యిలు,మరుగు దొడ్డి ఉన్నాయి.భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ఉంది.ఊరంతా బయో గ్యాస్ తో వంట చేస్తారు.దొంగ తనాలు దోపిడీలు లేవు. మద్యపానం అక్కడ నిషిద్ధం. వ్యాయమశాల,గ్రంధాలయం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పశు వుల ఆసు పత్రి ఆడిటోరియం ఉన్నాయి.నిధులు ప్రభుత్వానియే అయినా ఇవన్నీ ప్రజలు శ్రమదానం ద్వారా కట్టుకున్నవే! పల్లె బాగుపడాలంటే ప్రజల్లో సమైక్యత ఉండాలి .సహకార స్పూర్తి కావాలి..ఇదే గ్రామీణ భారత ధార్మిక నీతి... ---హివ్రేబజార్ విజయ రహస్యము ..
1989 నుండి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న పోపట్ రావు M.COM. చదివారు.అన్నాహజారెను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించారు .సార్క్ సదస్సులో తన అనుభవాన్ని పంచుకున్నారు.వివిధ విశ్వవిద్యాలయాలు,మేనెజ్ మేంట్ స్కూల్స్ లో గ్రామీణాభివృద్ది గురించి మాటలాడారు.మహారాష్ట్ర ప్రభుత్వం golden jubilee india programme క్రింద 300 గ్రామాల్ని హివ్రేబజార్ లా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయనకు అప్పగిం చింది జాతీయఅవార్డ్ అందుకున్నారు.రాజకీయ party లు ఆయనకు M.L.A పదవి ఇస్తామన్నా వద్దన్నారు .
మన రాష్ట్ర సర్పంచ్ లంతా హివ్రే బజార్ చూసి వచ్చి ఇక్కడ కూడా అలా చేస్తే బాగుంటుంది కదా!
(ఈ వ్యాసం ఆదివారం ఈనాడు అనుబంధం లోనిది .వారికి ధన్యవాదాలు.)
మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్ ను గమనించండి
http://www.rainwaterharvesting.org/Rural/Hirve.htm
కలా నిజమా అన్నట్లు ఉందీ వార్త. మంచి సంచారం ఇచ్చారు.
ReplyDeleteగ్రామాలను అభివృద్ది చేయక పోవటం వల్లే నగరాల జనాభా పెరిగి అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. మీ స్పందనకు ధన్యవాదాలండి .
ReplyDeleteTHANK YOU.
ReplyDelete