Sunday, 12 May 2013

ధ్యానం అంటే .... జిడ్డు కృష్ణ మూర్తి


  • ధ్యానించే మనసు ఆధ్యాత్మికత గల మనసు. ఆధ్యాత్మికత చర్చీలుఆలయాలు,భజనలు,తాకలేని మతం.విస్పోటం చెంది ప్రేమ జ్వలిం టమే ఆధ్యాత్మిక మైన మనసు అంటే . 
  • జీవితం లోని అత్యుత్తమమైన కళల్లో ధ్యానం ఒకటి.బహుశా ఇదే అత్యు త్తమమైనదేమో!ఒకరు మరొకరి వద్ద నుంచి దీన్నినేర్చుకోలేరు.అదే దీని లోని సౌందర్యం.మిమ్మల్నిగురించి మీరు తెలుసుకుంటుంటే అదే ధ్యానం 
  • ధ్యానానికి అంతమనేది లేదు.ఒక ఆరంభము లేదు.ఒక వర్షపు చినుకు వంటిది.ధ్యానంలేని హృదయం ఎడారిగా మారిపోతుంది.బంజరు భూమి అయిపోతుంది.
  • మస్తిష్కం తన కార్యకలాపాలన్నింటిని తన అనుభవాలనన్నింటిని కట్టి పెట్టి అచంచలమైన ప్రశాంతితో ఉండగలదా అని కనిపెట్టడమే ధ్యానం.
  • ధ్యానానికి అత్యుత్తమమైన క్రమశిక్షణ ఎంతో అవసరం.అసూయ నుండి అత్యాశ నుండి,అధికారదాహాన్నుండి విముక్తి పొందాలి.
  • ధ్యానం మేధకు సంబంధించిన వ్యవహారం కాదు.హృదయం మనసు లోకి ప్రవహించినప్పుడు మనసు తత్వం భిన్నంగా ఉంటుంది.ప్రేమ కదులుతూ ప్రవహించడమే ధ్యానం.
  • ధ్యానం ఒక గమ్యానికి చేర్చే సాధనం కాదు.ధ్యానమే మార్గం.ధ్యానమే గమ్యం.రెండూ అదే. 
  • తెలిసిన విషయాలనుండి విముక్తి చెందడమే ధ్యానంలోని పరిపక్వత ధ్యానం అంటే జ్ఞాన ప్రపంచంలో సంచరిస్తూనే దాని నుంచి విముక్తి చెంది అజ్ఞేయం లోనికి ప్రవేశించడం.
  • మీకు నిజంగానే ధ్యానం అంటే ఏమిటో కనిపెట్టాలని కనుక ఉంటె అప్పు డు ఆధిపత్యాలను అన్నింటినీ పూర్తిగా సమిష్టిగా ప్రక్కకి తోసి వేయాలి 
  • సంతోషాన్ని,సుఖాన్నికొనవచ్చు.నిశ్చలానందాన్నికొనలేరు.పరిపూర్ణ స్వేచ్చ కలిగిన మనోస్థితికి మాత్రమే  నిశ్చలానందం కలుగుతుంది.  నిశ్చలానందము యొక్క స్వేచ్చలో మనసు ప్రవహించడమే ధ్యానం  విస్పోటంలోకన్నులు నిర్మలమై అమాయకత్వంతో నిండి పోతాయి అప్పుడు ప్రేమ దివ్యానుగ్రహ మవుతుంది. 
  • సావధానతతో స్పృహతో వున్నప్పుడు "నేను" అనే కేంద్రం ఉండదు. సావధానమే మౌనమే ధ్యానంలోఉన్న స్థితి.
  • విడదీసుకోవడాన్ని,వేరుపరచుకోవడాన్నిఅంతం చేయడమే ధ్యానం.  ధ్యానం జీవితాన్నుంచి వేరుగా ఉండే విషయం కాదు.అది జీవితపు అస లు సారం.
  • ధ్యానంలో గొప్ప తన్మయీభావం ప్రవహిస్తూ ఉంటుంది.ఇది కంటికీ మస్తి ష్కానికీ హృదయానికీ నిర్మలమైన అమాయకతత్వాన్ని ప్రసాదించే తన్మయత్వం.
  • ధ్యానం అంటే మనసు,హృదయము పూర్తిగా సమూలంగా మార్పు చెంద డం అనే అర్థం వున్నది.
  • కాలాన్ని ఎరుగని అమాయకత్వంలో ఉండటమే ధ్యానం.
  • ప్రపంచం,దాని తీరుతెన్నుల్నిఆకళింపు చేసుకోవడమే ధ్యానం.
  • అవగాహన వికసించడమే ధ్యానం.అవగాహన ఇప్పుడే జరగాలి మరెప్ప టికీ జరగదు.అది ఒక విద్వంసక ప్రజ్వలనం.ధ్యానం అంటే చేతనను అజ్ఞాతాన్నిబాహ్యమైన దానినంతటినీ అవగాహన చేసుకోవడం.
  • ఏకాంతంగా ఉన్నప్పుడే ధ్యానించాలి.మనసును ఆలోచనలుండి విడిపిం చినపుడు  ఏకాంతం కలుగుతుంది.ప్రశాంతమైన ఏకాంతంలో నిశ్శ బ్దంగా,రహస్యంగా ధ్యానం సంభవిస్తుంది.
  • ఆలోచనలు,మనోభావాలు పూర్తిగా ఎదిగి నశించి పోయినప్పుడు ధ్యానం కాలానికి అతీతమైన వాహినిగా ప్రకాశిస్తుంది. కదలికలో తన్మయత్వం ఉంటుంది.
  • మనసులోని వెలుగే ధ్యానం.నేనును అంతం చేయడమే ధ్యానం.
  • ప్రతి నిముషము మరణించడమే ప్రేమ.ప్రేమ పూవులుగా వికసించడమే ధ్యానం.
  • తెలిసిన దాని నుంచి విముక్తి చెందడమే ధ్యానంలో మనం చేయవల సినది.
  • ఒంటరిగా ఉండటానికి భయపడనప్పుడు, ప్రపంచానికి చెందకుండా అసలు దేనితోను మమకార బంధంలేకుండా ఉన్నప్పుడు ఏకాంతంలో ని తన్మయత్వం మీకు లభిస్తుంది.
  • మనసు సమస్తం పూర్తిగా మౌనంగా అయినప్పుడు జరిగే ధ్యానమే మానవుడు చిరకాలంగా అన్వేషిస్తున్న దివ్యానుగ్రహం.
  • ధ్యాన మంటే అసలు సారాంశానికి తలుపులు తెరవడం,సర్వస్వాన్ని దగ్ధంచేసి బూడిద కూడా మిగల్చని ఒక అగ్నిగుండాన్ని దాని తలు పులు తెరిచి ఆహ్వానించడం.
  • నిజమైన ధ్యానానికి పునాది అనాసక్త మైన ఎరుక.అంటే ఆదిపత్యాల నుండి,ఆకాంక్షలనుండి,అసూయనుండి భయాలనుండి విముక్తిని కలిగించే సంపూర్ణ స్వేచ్చ.
  • ఆలోచనలనుండి విముక్తి పొంది సత్యం అనే తన్మయానందంలో ప్రవ హించడమే ధ్యానం.
  • ధ్యానంలో సమస్త ఆలోచనలు ఆగిపోవాలి.ధ్యానానికి ఇదే పునాది.
  • మనలో నుండి కాలాన్ని తీసివేసి మనసును ఖాళీ చేయడమే సత్యం అనే మౌనం.
          (నేడు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డుకృష్ణ మూర్తి జయంతి. ఆయన  వివిధ ఉపన్యాసాలలో ధ్యానం గురించి వ్యక్త పరిచిన విషయాలను తెలుగులో పి సదాశివరావు గారు అనువాదం చేయగా ధ్యానం అనే పుస్తక రూపం లో వెలువడింది.అందులోని కొన్ని అంశాలను ఇక్కడ  వ్రాసాను .వారికి ధన్యవాదాలు.) 

www.jkrishnamurti.org  నందు ఆయన గురించి సమగ్రంగా తెలుసుకొనగరు.

7 comments:

  1. ధ్యానం- మనసుని మన చెప్పుచేతలలో ఉంచుకుని, అలోచనా రహితులమై, అంతులేని ఏకాగ్రతతో చేసేది.
    అది అందరికి సులువుగా సాధ్యమయ్యేది కాదండి.
    మీ టపాలో ధ్యానం గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలువరిచారు.ధన్యవాదాలు రవిశేఖర్ గారు

    ReplyDelete
  2. కృష్ణ మూర్తి తత్వం చదువుతుంటేనే ధ్యానం లోకి వెళ్ళినట్లు ఉంటుంది.ఎన్నో ధ్యాన విధానాలు చెబుతుంటారు.ఈయన మార్గం విలక్షణమైనది.మీ స్పందనకు ధన్యవాదాలండి..

    ReplyDelete
  3. ధ్యానం గూర్చి నేను పలుచోట్ల చదివాను కానీ, మీ వివరణ చాలా బాగుంది, చదివేలా చేసింది.

    ReplyDelete
    Replies
    1. కృష్ణమూర్తి గారు చెప్పిన అంశాలలో కొన్ని ఇక్కడ పొందుపరచాను.మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  4. ayana thathvam chaala klishtaminadhi .baaga bhyapedutundi ardam kaka kadu ardam avutundem,onani bhyamtho ayyannu poorthjiga eppudu chadavanu.endukante ayyana eppudu emi cheppadau kanee anni telusukonela chesatadu.

    ReplyDelete
  5. మానవుని అన్ని బంధనాలనుండి సంపూర్ణ స్వేచ్చను కలిగించటమే ఆయన జీవిత లక్ష్యంగా ఆయన బోధనలు సాగాయి.భయం కాదు గాని నాకు అద్భుతమైన ఆశ్చర్యం కలిగించాయి.చెప్పినట్లుగానే జీవించి వెళ్ళిపోయాడు.నిదానంగా చదవండి.మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. ధ్యానం గురించి బాగా చెప్పారు

    ReplyDelete