మనం ఎన్నో రకాలయిన ప్రేమలను చూస్తూఉంటాం.తల్లి ప్రేమ,తండ్రి ప్రేమ ,సహోదర ప్రేమ ,సమ వయసు ప్రేమ .మరి ఏ బంధము లేకుండా సేవ చేసే ప్రేమను ఏమంటాము ....పిచ్చి ప్రేమ అంటామేమో .మతిస్థిమితం లేని వారిపై ఇటువంటి ప్రేమనే చూపుతున్నారు "అమ్మా నాన్న"ఆశ్రమం నిర్వాహకులు శంకర్ ఆయన భార్యపరమేశ్వరి హైదరాబాద్ విజయవాడ రహదారిలోని చౌటుప్పల్ ప్రాంతం లోని ఈ ఆశ్రమంలో పాతిక మంది మతిస్థిమితం కోల్పో యిన వ్యక్తులు కనిపిస్తారు.వారిని కంటికి రెప్పలా చూస్తూ,వారిని మామూలు మనుషులుగా తీర్చి దిద్ది వారి వారి కుటుంబాలకు దగ్గర చేస్తున్నారు.తన అన్న పిచ్చివాడిలా మారి పోయి చాలా కాలం కనిపించక కొన్నేళ్ళకు హైదరా బాద్ ఉస్మానియా ప్రాంతం లో చెత్త కుప్పల్లో చనిపోయి కనిపించాడట.నా అన్నలాగ మరొకరు ప్రాణాలు వదలకూడ దని ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసాము అంటాడు శంకర్.
పని మీద హైదరాబాద్ వచ్చి నిలువ నీడ లేక జేబులో డబ్బు లేక ఉన్నారనుకొండి .అలాంటి వాళ్ళ కోసం డా .వింజమూరి ప్రకాష్ స్థాపించిన "ఓపెన్ హౌస్" సిద్ధంగా ఉంటుంది.సరూర్ నగర్ రిలయన్స్ పెట్రోల్ బంకు ప్రక్కనే ఉన్నఈ హౌస్ లోకి ఎవరైనా రావచ్చు.కాకపోతే అక్కడ వున్న వంట పదార్థాలతో మీరే వండుకొని తృప్తిగా తిని ఒకటి,రెండు రోజులు బస చేసి వెళ్ళవచ్చు.పేద విద్యార్థులు,నిరుద్యోగులు దీనిని ఉపయోగించు కుంటున్నారు .వంట చేసుకోలేని వారికోసం వాలంటీర్స్ ఉన్నారు.దీనికి సాయం చేయాలనుకునే వారు 040-24046000 కు ఫోన్ చేయవచ్చు.
పై రెండు సేవా సంస్థల వివరాలు సాక్షి,ఆంధ్రజ్యోతి నుండి సేకరించినవి.వారికి ధన్యవాదాలు.వారు చేసే ఈ గొప్ప ప్రయత్నాలను అందరికీ తెలియజేయాలనే ఆలోచన.
Thanks for the information Ravisekhar garu.
ReplyDeleteThank you for your response Vennela garu.
ReplyDeleteసామాజిక సేవా సమాచారాన్ని అందించారు.
ReplyDeleteవారు అంత గొప్ప పని చేస్తుంటే కనీసం ప్రపంచానికి తెలియజేయటం నా ధర్మంగా భావించాను.మీకు ధన్యవాదాలు.
Deleteఇతరులకు చేయూతనందివ్వటం చాలా గొప్పవిషయం.
ReplyDeleteఇలాంటి మంచి వారి గురించి అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
మీ స్పందనకు ధన్యవాదాలండి.
Delete