ఈ రోజు జిడ్డు కృష్ణమూర్తి వర్దంతి.1895 మే 11 న జనించిన ఆయన 1986 february 17 న పరమ పదిం చారు.1910 నుంచి 1985 వరకూ ప్రపంచ మంతా పర్యటనలు చేసి ప్రసంగాలు చేసారు.జీవితాన్ని అద్భుతంగా పరిశీ లించి దాన్ని సమగ్రంగా ఏకముఖంగా చూడ మని చెప్పాడు.మనుషులందరు ఎవరికీ వారు హృదయాల నిండా ప్రేమను,అనురాగాన్ని నింపుకొని స్వస్వరూప జ్ఞానాన్ని అవగతం చేసుకోవడం అవసరం అని చెప్పారు .సత్యానికి ఓ నిర్దిష్ట మార్గం లేదని ప్రకటించారు.మనిషిని కట్టి పడవేసిన అలవాట్లు,ఆచారాలు,సంప్రదాయాల పరిమిత ప్రయోజ నాలు గ్రహించి ఆ బంధాల నుంచి ఎవరికీ వారే విముక్తి చెందాలని పిలుపిచ్చారు.
సత్యాన్ని వ్యవస్తీ కరించటం మంచిది కాదని ,సత్యం అనేది pathlessland అని ప్రకటించారు.
నా ఏకైక లక్ష్యం "మనిషిని సంపూర్ణంగా ,నిర్నిబంధంగా విముక్తుడిని చేయాలి."
"to set man absolutely unconditinally free"
ఆనంద సామ్రాజ్యానికి తాతాళపు చెవి ఎవరి అధీనం లోనో లేదు .ఆ తాళపు చెవి మీరే .మిమ్మల్ని మీరు వికాస పరచుకోవడం ,నిష్కల్మషంగా తయారవడం మీదనే ఆ భూమిక నిలిచి ఉంది.
కృష్ణ మూర్తి తన బోధనల సారాంశం(core of teaching) అంటూ అక్టోబర్ 21 1980 న ఒక ప్రకటన చేసారు.దీనిని 7 విభాగాలుగా పరిశీలించాలి.
1)సత్యం అనేది ఒక దుర్గమ క్షేత్రం .దానిని చేరటానికి రహదారులు లేవు.దానికి ఒక సంస్థ ద్వారా ,వ్యవస్థ ద్వారా సిద్దాంతం ద్వారా చేరలేము.తన సంబంధ బాంధవ్యాల దర్పణం ద్వారా మనస్సు అంతర పరివర్తనల అవగాహన ద్వారా మనస్సును సమగ్రంగా పరిశీలించటం ద్వారా చేరు కోవచ్చు.
2)మనిషి తన మనస్సులో ఎన్నో రూపాలు,అభిప్రాయాలు ,విశ్వాసాలు తయారు చేసుకున్నాడు.వాటి బరువు అతని మానసిక వాతావరణాన్ని క్రుంగ దీస్తుంది.తన సంబంధాలను భారం చేస్తుంది.ఇదే మన సమస్యలన్నింటికీ మూల కారణం.
3)మనిషి చిత్తం లో ఉన్నదంతా కలిసి మనిషిని రూపొందిస్తుంది.పేరు,రూపం ,సంప్రదాయం వాతావరణం .పర్యావ రణాల వలన బాహ్యంగా ఏర్పడిన సంస్కారం ఇదంతా కలిసి మనిషి వ్యక్తిత్వం గా భావించ బడుతుంది.చేతనం లో ఉన్న దాన్నుండి విముక్తుడిగా ఉండడం లోనే ప్రత్యేకత ఉంది.
4)ఎటువంటి దృక్కోణం లేకుండా జీవిత పరిశీలన చేసుకోవడమే స్వేచ్చ.పరిశీలన చేసుకున్న కొద్దీ తనకు ఎంత స్వేచ్చ లేదో తెలిసివస్తుంది.మన దైనందిన కార్య కలాపాలలో అరమరికలు లేని ఎరుకతో నిండిన స్వేచ్చ అతి ప్రధాన మైనది .
5) కాలం నుంచి గతం నుంచి పుట్టిందే అనుభవమూ,జ్ఞానము .మన పనులన్నీ అనుభవం నుంచి,సమయం నుంచీ పుడుతున్నాయి.మనిషి ఎప్పుదూ గతానికి బానిసగా తయారవుతున్నాడు మనసును ఆలోచనలను మన పనుల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి.ఎప్పటికప్పుడు విముక్తుడిగా పని చేయ గలగడం సహజ ప్రవృత్తి గా తయారయి పోవాలి.
6)మనిషి తన ఆలోచనలను భావనలను పరిశీలనాత్మకంగా చూసుకున్నందువల్ల భావకునికి(thinker)
భావన(thought) కు మధ్య వున్నా అంతరం తొలగిపోతుంది.అప్పుడు పరిశీలనా మటుకే మిగులుతుంది.అదే అంతః స్పూర్తి దాని మీద గతం యొక్క సమయం యొక్క నీడలు ప్రభావాలు పడవు.
7)పరిపూర్ణంగా కాదనడమే(total negation) ఉన్న దాని సారాంశం మనసు తీసుకు వచ్చిన అన్ని రూపాలను ప్రతి రూపాలను తోసి రాజనడం వలన మానసిక వాతావరణాన్ని సుధ్ధం చేయడం అవుతుంది.అప్పుడే ప్రేమ అంకురిస్తుంది.అదే కారుణ్యం(compassion) అదే వివేకం (intelligence)
పై అంశాలను సంపూర్ణం గా ఆచరణ లోకి తెస్తే చివరి మెట్టు సాధ్య మవుతుంది.
చివరి మెట్టు "ప్రేమ"
మనస్సును పూర్తిగా ప్రేమతో నింపుకో.ఆ తరువాత ఏదయినా చేయి. అంటారు కృష్ణ మూర్తి.మనసు హృదయము ప్రేమతో నిండిన తర్వాత మనిషి చెడు చేయ లేడు . మంచి చేయడం తప్ప ఇంకేమీ చేయలేడు.
శ్రీ విరించి రచించిన "నిరంతర సత్యాన్వేషి " అన్న రచన నుండి పై వ్యాసం సేకరించటం జరిగింది.వారికి కృతజ్ఞతలు . .
No comments:
Post a Comment