ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నిరోధకదినం.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం బలవన్మ రణం పాలవుతున్నారు.ఎంత విషాదం.అందులో 30% విద్యార్థులే వున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఈ ఆత్మ హత్యలకు ఎన్నోకారణాలు.కుటుంబంలోమనస్పర్ధలు,నయం కాని జబ్బులు కలిగిన వారు,అప్పుల పాలయిన వారు,సన్నిహితులను కోల్పోయిన వారు,,జీవితం పై విరక్తి చెందినవారు విద్యార్థులయితే ranks,marks రాలేదని విపరీతమయిన మానసిక ఒత్తిడితో,ఉద్యోగాలు సాధించలేదని ఇలా విభిన్న కారణాలతో జీవితాలను అంతం చేసుకుంటున్నారు.
నా అనుభవంలో ఓ మిత్రుని ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపగలిగాను.ఒక ఉదయాన్నేఅతను ఫోన్ చేసి రైల్ పట్టాలపై ఉన్నాను.జీవితం పై విరక్తి కలిగింది.అని చెబుతుంటే అతన్ని చిన్నగా కారణాలు అడు గుతూ మాటల్లో పెట్టాను.తన కుటుంబ సమస్యనంతా వివరించాడు.అతనికి రకరకాలుగా నచ్చ జెబుతూ మాట్లాడ సాగాను.మధ్య మధ్యలో ధైర్యము నూరి పోస్తు సంభాషణను కొనసాగిస్తున్నాను.అలా ఒక గంట మాట్లాడిన తరువాత కూడా అతను మళ్ళీ మొదటికి వచ్చి నాకు చావు తప్ప పరిష్కారం లేదు అనే సరికి ఎలా సముదాయించాలోఅర్థం కాలేదు అప్పుడు ఓ ఆలోచన వచ్చింది.చనిపోయే ముందు నాతో ఒక్క సారి మాట్లాడమని అడిగాను.ఈ రోజు రాత్రి బయలు దేరి రేపు ఉదయం నీ దగ్గరికి వస్తాను.అప్పుడు మాట్లాడు దాము.అప్పటికి నీకు అదే భావం ఉంటె అలాగే చనిపోదు వుగానీ అని అడిగాను.అలాగే అంటూ బాధపడు తూ కొంత కోలుకున్నాడు.చివరికి వద్దులేరా!అంత రిస్క్ తీసుకొని రావద్దులే నేను ఏమి చేసుకోనులే!అన్నాడు.నేను నమ్మలేక మాట ఇవ్వ మన్నాను.నీకు ఎప్పుడు అలా చనిపోవా లనిపిం చినా నాతో కలవ కుండా ఆత్మహత్య చేసుకోనని మాట ఇవ్వమన్నాను .అలాగే ఇచ్చాడు.ఒక గంటన్నర మాట్లాడాను తరువాత మళ్ళీ కలిసినప్పుడు అంతా బాగుందని చెప్పాడు.
నా అనుభవంతో అందరికి చెప్పేదేమంటే మీ సన్నిహితులు గాని,ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు వారు చెప్పినా మీరు పసిగట్టినా ఆ ప్రయత్నాన్ని మాటలతో వాయిదా వేపించండి.అలా వారితో మాట్లాడుతూ వుంటే కొద్ది సేపటిలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు.మీరు చెప్పే మాటలతో వారికి బ్రతుకు మీద ఆశ కలుగుతుంది.ఇలా తెలు సుకోలేక ఇద్దరు దగ్గరి బంధువులను కోల్పోవాల్సి వచ్చింది.ఒకరు అప్పులతో,మరొకరు సంసార సమస్యలతో.
జీవితం ఎంత విలువైనది.విద్యార్థులయితే మంచి marks,ranks రాలేదని తమ జీవితాలను తామే బలి తీసు కుంటున్నారు.ఆ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీర్చ గలరు.జీవితాన్ని జీవించటానికే గాని అంతం చేసు కునేం దుకు కాదు.తల్లిదండ్రులు కూడా పిల్లల ఆశలను,ఆకాంక్షలను అర్థం చేసుకొని ఒకవేళ అవి తప్పయితే వారికి స్నేహితుల్లాగా నచ్చజెప్పి ధైర్యమివ్వాలి గాని వారిని మందలించ కూడదు.వారి సామర్ద్యాలేమిటో తెలుసుకోకుండా తమకు నచ్చిన చదువులు చదవమని వాటిలో చేర్పించటం విపరీతమైన ఒత్తిడితో వారు ఆత్మ హత్యా చేసుకోవటం చాలా ఘోరం.విద్యాలయాలు కూడా విద్యార్ధి వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్యనూ అందిస్తూ,వారికి జీవితం పట్ల సరి యిన అవగాహనను కల్పిస్తూ బోధించాలి.
అలాగే విభిన్న సంసార సమస్యలు ఉన్నవారు వాటిని ఎలా అధిగమించాలో పరిష్కారాలకై,మిత్రులతో సన్నిహితు లతో చర్చించి అవసరమయితే సైకాలజిస్ట్ ల సహకారంతో పరిష్కారాలను కనుగొనాలి గాని ఆత్మహత్యలకు పాల్ప డకూడదు.అలాగే అప్పులైన వారు ఆత్మాభిమానంతో ఆత్మ హత్యలు చేసుకోకుండా I.P పెడితే పోలీసు,కోర్ట్ లు రక్షణ కల్పిస్తారు.లేదా ఆ ఊరికి దూరంగా ఎక్కడయినా బ్రతకవచ్చు.తమ అప్పులకు తమ పిల్లలను చంపి ఆత్మచేసుకునే వాళ్ళను ఏమనాలి?
అలాగే ప్రభుత్వం కూడా సలహా కేంద్రాలు ఏర్పాటు చేసి విస్త్రుత ప్రచారం చేయాలి.ఎక్కడయినా ఈ విషయం పై help lines కేంద్రాలు ఉంటె తెలియజేయగలరు
మంచి పోస్ట్ రవి శేఖర్ గారూ!
ReplyDeleteభగవంతుడు ఇచ్చిన జీవితాన్ని అంతం చేసుకొనే హక్కు ఎవరికీ లేదు...
జీవితంలో ఎదురు దెబ్బలు ఎన్ని తిన్నా,
మరో దెబ్బని ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోవాలి.
మీ సలహా చాలా బాగుంది...
@శ్రీ
జీవితాన్ని ఎదుర్కొనే సామర్ద్యాన్ని పెంపొందించే చదువు లేని రోజులివి.మీకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు!
DeleteYes! Ravisekhar Ji.... what you said is true!!! One must council the people.. is a good idea for giving some sort of realisation and relief to those are in desperation. "All is well"
DeleteYes!! it is really true. And your try for keep a life alive is great. Also, your idea of keep on talking with the people those who are in desperate mood, is good. Keep going, Bravo.
Deletethank you sir.your analysis and encouragement gives inspiration for me to council pupil who ever in need.all of us start to think in this way.
Deleteశేకర్ గారూ, నిజమే మీరు చెప్పింది, ఒక్కోసమయం లో మనిషి విరక్తితో జీవితం అంతం చేసుకోవాలి అనుకుంటాడు.
ReplyDeleteఅలాంటి సమయంలోనే, సన్నిహితులు ఆదుకోవాలి. చక్కటి పోస్ట్.....మెరాజ్
అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కొంత ఓపికగా గమనించగలిగితే అర్థమవుతుంది అంటారు.అప్పుడు ఎవరైనా నాలుగు మాటలతో వారి ప్రయత్నాన్ని ఆపవచ్చు.మీకు ధన్యవాదాలు meraj gaaru!
Deleteచక్కటి టపా.
ReplyDeleteమీరు మీ స్నేహితుని జీవితాన్ని రక్షించారండి.
ఇంకొకరికి చేతనైనంత సహాయం చేసినప్పుడు కలిగే సంతోషం వేలు, లక్షలు పోసి కొనుక్కునే వస్తువుల వల్ల దొరకదు.
జీవితం లో ఇలాంటి సహాయం చేయటం మీరన్నట్లు ఎంతో త్రుప్తి నిచ్చింది.ఒక ప్రాణాన్ని కాపాడిన ఆనందం దేనిలోనూ రాదేమో!
Deleteమీకు ధన్యవాదాలు అనురాధగారు!
Deleteనిజమే రవి శేఖర్ గారు సరిగ్గా చెప్పారు మానసిక ధైర్యం లేక చెప్పేవారు లేక ఎంతో మంది ఇలా బలవన్మరణాలకు పాలబడుతున్నారు మీరు మీ మిత్రునికి సరైన సమయంలో సహాయాన్నందించి వారిని కాపాడగలిగారు అభినందనలు మీరన్నట్లు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తే చాల బాగుంటుంది.
ReplyDeleteఅటువంటి ఆలోచన వున్నవారు ఏదో ఒక సంకేతం ఇస్తారటండి.అది గుర్తించగలిగితే వారిని కాపాడవచ్చు.helpline గురించి అన్వేషించాలి.మీకు ధన్యవాదాలండి.
DeleteInteresting topic to read.
ReplyDeleteస్వాగతం యోహాంత్ గారు ! ధన్యవాదాలండి.
Deleteచక్కని సమాచారం. ఈ రోజే మా బంధువు ఒక అతను మానసికంగా వికలం చెంది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటుంటే ఆసుపత్రికి తీసుకువచ్చారు.మీ టపా ప్రస్తుతం నాకు చాలా ఉపయోగకరం.ధన్యవాదాలు రవి గారు.
ReplyDeleteమానవ జీవిత మంతా అనుభవాలను పంచుకోవటమేనండి.మీకు ఉపయోగపడితే అదే నాకు ఆనందంమీకు ధన్యవాదాలండి.
Deleteబలహీనత మనిషిలో ఇటువంటి విపరీత బుద్ధిని పెంచుతుంది అని నా అభిప్రాయం. ఒక మంచి పని చేసినందుకు అభినందనలు! హెల్ప్ లైన్ సంగతి నాకు తెలియదు కానీ ఇప్పటికే కౌన్సేల్లింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ సామాన్యులకి అందుబాటులో లేవు. దీని గురించి తగు చర్యలు చేపడితే బాగుంటుంది.
ReplyDeleteనిజమేనండి మానసికం గా బలహీన మైన మనస్తత్వం ఉన్నవారే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు.ఈ రోజు పేపర్లో కూడా ఇద్దరు ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్నారు అని వ్రాసారు.మీ స్పందనకు ధన్యవాదాలు.
DeleteVery happy
ReplyDeleteస్వాగతం మరియు మీకు ధన్యవాదాలండి.
Deleteశేఖర్ గారు, ఒక నిండు ప్రాణాన్ని కాపాడినందుకు అభినందనలు. మీరన్నట్లు ఎవరైన ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడితే ఆసమయంలో వారికి నచ్చజెప్పి ధైర్యమిస్తే, తర్వాత వాళ్ళు ఆత్మహత్యకు ఆమడ దూరంలో ఉంటారు.
ReplyDeleteఒక జీవితన్ని కాపాడారు. నాకు తెలిసిన దగ్గర బంధువు ఒకరు ఇలాగే ఆత్మహత్యకి చేసుకుని మరణించడం జరిగింది. అప్పట్లో చాలా రకాలుగా అతను జీవితం అంటే నిరాశ, నిశృహ వ్యక్తపరిచినా తెలుసుకోలేకపోయాము. మీ అర్టికల్ చదవగానే అదే గుర్తొంచిందండి. మంచి టపా అండి రవిశేఖర్ గారు.
Deleteఅలా అందుబాటులో ఉన్న వారు ఎవరైనా గమనిస్తే ఖచ్చితంగా రక్షించవచ్చుధన్యవాదాలు నాగేంద్ర గారు!.
Deleteఈ లక్షణాలు గలవారు ఏదో ఒక సందర్భం లో బయటకు చెబుతారు.అది గుర్తించగలిగితే సహాయం చేయవచ్చు.ఈ రోజు కూడా ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు.ధన్యవాదాలు వెన్నెల గారు!
ReplyDelete