Wednesday, 22 August 2012

ప్రాణ సఖా!


ప్రాణ సఖా!నా ఉచ్చ్వాసము మన ప్రేమ అయితే
నా నిశ్వాసము అంతా నీ పై నా విరహమే
నా హృది నిండా నీ పై నా
అనురాగం పలికిస్తూనే ఉంటాను
అప్పటికీ నీ నాదం నా దరికి చేరకపోతే
నా ధమనుల్లోని ప్రతి కణాన్ని అద్ది
మనసు స్పృహ తప్పనంతవరకు
మన ప్రేమ భాషనే కురిపిస్తుంటాను
సంధ్య వాకిట్లో నిలబడి
పున్నమి చంద్రునికి విన్నవిస్తున్నా
నీ సఖి ఇక్కడ విషాద సితార తంత్రుల్ని
"రవిశంకర్"కన్నా మనోహరంగా మీటుతుందని
నీ చెలి ఇక్కడ నీ రూపాన్ని వందల చిత్రాల్లో
"రవివర్మ" కన్నా  అద్భుతంగా చిత్రిస్తుందని
నీకు చెప్పమని వేడుకుంటున్నా
ప్రభూ నీ కోసం ఎదురు చూస్తున్నా
రేపు తూరుపు పగడపు కొండల నడుమ నుండి
ఉదయించే ఉషస్సులను మోసుకొస్తావని

8 comments:

  1. చక్కని ఉపమానాలతో చిక్కని కవిత.

    ReplyDelete
  2. సఖి విరహం...ఆహ్వానం..ఎదురు చూపులు..
    చాలా బాగున్నాయి రవిశేఖర్ గారూ!
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ స్పందనకు. విరహం లోనే కదా ప్రేమలోని సాంద్రత తెలిసేది.

      Delete
  3. చాలా బాగుంది రవిశేఖర్ గారు. అభినందనలు ఇంత చక్కటి కవిత రాసినందుకు.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారు.చాలా కాలం తరువాతా మీ రాక ఆనందం కలిగించింది.మీకు బాగా నచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  4. రేపు తూరుపు పగడపు కొండల నడుమ నుండి
    ఉదయించే ఉషస్సులను మోసుకొస్తావని...హత్తుకున్నది భావం..

    ReplyDelete
  5. స్వాగతం వర్మ గారు!మీ అభిమానాన్ని పొందినందుకు ఆనందం గా ఉంది.మిగతా కవితలు,పోస్ట్స్ గమనించగలరు.మీకు నెనర్లు.

    ReplyDelete