Monday, 6 August 2012

అహంకారం తొలగించుకోవడం ఎలా?(ముగింపు)


           ఈ వ్యాసాలు ఎంతోమంది వ్యక్తులను ఎన్నో సందర్భాలలోగమనించిన తరువాత వాటినన్నింటిని క్రోడీకరించి నాకు తెలిసినంత వరకు విశ్లేషించాను.ఇవే పూర్తిగా 100% సరి అయినవి అని నేను అను కోవటం లేదు.ఇంకా ఎంతో మందికి ఎంతో సమాచారం ఈ విషయంపై తెలిసి  ఉండవచ్చు.వారికి సదా స్వాగతం.సద్విమర్శకు ఎప్పుడూ ఆహ్వా నం పలుకుతాను.ఈ వ్యాసాలూ ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావు. ఎవ్వరినీ నొప్పించాలని వ్రాయలేదు.నాకు ఎదురైన అనుభవాలను,ఎంతో మంది అహంకార లక్షణాలు గల వ్యక్తులను గమనించిన తరువాత,ఈ అహంకారం ప్రదర్శిం చిన వారివలన బాధలు పడిన వారితో మాట్లాడిన మేరకు మరియు నా మీద ఈ భావనతో మాట్లాడిన వ్యక్తుల వలన కలిగిన అనుభవాలు అన్నింటిని కలిపి వ్రాసాను.నా పట్ల ఈ భావంతో మాట్లాడిన వారికి అప్పుడే ఇవే విషయాలు ఓపెన్ గా స్పష్టంగా చెప్పాను.ఇప్పుడు కొత్తగా ఏమీ వ్రాయలేదు.కాకపోతే ఆ అనుభవాలు ఈ అహంకారం శీర్షిక క్రింద చేర్చాను.ఒక వేళ అటువంటి వారెవరైనా ఇది చదివి నొచ్చుకుని ఉంటె క్షంతవ్యుడిని.ఇక్కడ  గమనించాల్సిన విష య మేమనగా ఈ వ్యాసాలూ చదివి వారు నొచ్చుకున్నారంటే మరి వారి మాటలకు నొచ్చుకున్న వారు,లోలోన బాధపడ్డ వారెంత మందో కదా!ఈ అహంకారంతో కూడిన మాటలతో బాధ పడ్డ వారు తమ భావాలు వ్యక్తపరిస్తే అది ప్రదర్శించిన వారి వైఖరిలో సహజంగా మార్పు రావాలి.కానీ అలా కాకుండా మరల తిరిగి అలాంటి భావాలను ప్రదర్శించడం సరికాదేమో!దానిని వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.విషయం వరకే తీసుకోవాలిగానీ ఎవరు వ్యక్తి గతంగా తీసుకోకూడదు అని నా భావన. అటువంటి వారు వ్రాసిన సందర్భంకాని వ్యాఖ్యలను తొలగించక తప్పని పరిస్థితి.
      మొదటే చెప్పినట్లు ఈ బ్లాగులో వ్రాసే వ్యాసాలూ ఎక్కువ భాగం మనిషి ఆనందంగా జీవించడం కోసం ఉద్దేశిం చినవే!ఈ విషయం నా గత వ్యాసాలూ చదివితే మీకే అర్థమవుతుంది.
           ఇక మిగిలిన అహంకార లక్షణాలు తొలగించుకోవాలంటే మన హృదయాల్లో మనస్సులో కాస్త స్నేహభావం ప్రేమ నిండి వుంటే చాలు.సాటి మనిషిని మాటలతోబాధించకూడదు అన్న స్పృహ ఉంటె చాలు.అంతే కాకుండా ప్రతి రోజు మనం నిద్రించే లోపు ఆ రోజు మన ప్రవర్తన ద్వారా,మన మాటల ద్వారా ఎవరినయినా నొప్పించామా అన్న ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ అహంకారం దానంతట అదే తొలగి పోతుంది.ఈ విషయాలు అన్ని నిరక్షరాస్యులు కూడా పాటిస్తుంటారు.వారు ఎంతో దయకలిగి ఎవ్వరినీ బాధించకుండా మాట్లాడుతుంటారు.వారి అమాయకత్వాన్ని ఎంతో మంది వాడుకుంటూ వారిపట్ల ఈ అహంకారాన్నిప్రదర్శిస్తుంటారు.రాజకీయ నాయకులు,ప్రజలకు సేవ చేయాల్సిన పదవుల్లో ఉన్న వారు ప్రజలకు అందాల్సిన వాటినన్నిటినీ తామే స్వాహ చేస్తూ వారి పట్ల ఎంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటారు.ఆ అహంకారానికి గురయిన వారు నా కంటే చాలా  బాగా ఈ విషయాల గురించి చెప్పగలరు,ఎందుకంటే ఆ బాధలు పడ్డ వారు కాబట్టి .
     జీవితం ఎంతో చిన్నది.చాలా అందమైనది.ఎంతో సరళ మైనది.కానీ మనిషి దాన్ని ఎందుకో ఇంత క్లిష్టంగా మార్చుకుంటున్నాడు.జీవితం చివరి దశలో వెనుదిరిగి చూసుకుంటే ఎంతో త్రుప్తి కలగాలి మనసంతా ఆనందంతో నిండిపోవాలి.సంపూర్ణ మైన జీవితం గడిపినందుకు సంతృప్తితో చెట్టు నుండి ఆకు రాలినట్లు రాలిపోవాలి.ఎంతో అందమైన,అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు ఉన్న అన్ని రకాల అడ్డంకులను అధిగమించేందుకు మనిషి మానసికంగా,సామాజికంగా మంచి మార్పులకై నిరంతరం  అన్వేషించాలి.

9 comments:

  1. రవిశేఖర్ గారు...
    చాలా గోప్ప గా చెప్పరు అండీ.మీ మంచి ప్రయత్నానికి మనహ్:పూర్వక అభినందనలు :-).
    ఇంకా మంచివి వస్తాయని ఆశిస్తూ...

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహానికి ,అబినందనకు ధన్యవాదాలు.

      Delete
  2. మీ ముగింపు వ్యాసం బాగుంది...
    రవి శేఖర్ గారూ!
    అభినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు జీవితం గురించి వాస్తవిక దృక్పధం తో ఆలోచిస్తే ఎన్నో విభిన్న కోణాలు దర్శనమిస్తాయి.వాటిని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.మీలాంటి అర్థం చేసుకునే వారి ప్రోత్సాహం ఉత్సాహం ఇస్తుంటుంది మరిన్ని వ్యాసాలూ వ్రాయటానికి.

      Delete
  3. జీవితం ఎంతో చిన్నది.చాలా అందమైనది.ఎంతో సరళ మైనది. జీవితం చివరి దశలో వెనుది రిగి చూసుకుంటే ఎంతో తృప్తి కలగాలి మనసంతా ఆనందంతో నిండిపోవాలి.సంపూర్ణ మైన జీవితం గడిపినందుకు సంతృప్తితో చెట్టు నుండి ఆకు రాలినట్లు రాలిపోవాలి.ఎంతో అందమైన,అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు ఉన్న అన్ని రకాల అడ్డంకులను అధిగమించేందుకు మనిషి మానసికంగా,సామాజికంగా మంచి మార్పులకై నిరంతరం అన్వేషించాలి.

    చాలా చక్కటి విశ్లేషణ సర్. చాలా వివరంగా తెలిపారు. అభినందనలండి.

    ReplyDelete
  4. భారతి గారు!మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. సార్ ఎవరు ఏమనుకుంటే మనకేం.వాస్తవాన్నితెలియచేసారు.అందుకు అభినందనలు.ముగింపు అద్భుతం.

    ReplyDelete