"అర్ధ రాత్రి ఆడది స్వేచ్చగా తిరగగలిగిన నాడే
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు "
అన్న మహనీయుల మాటలు తుత్తునియలు చేస్తూ
క్రూర వికటాట్టహాస పదఘట్టనలు
లేడి కూనలను వేటాడే క్రూర మృగాల కర్కశత్వం
ఒంటరి అసహాయ మహిళపై అమానుషం
వ్యంగ్య బాణాలు ,విషరసాయనాల్లాంటి మాటలు
దేహాన్ని దగ్ధగీతంలా దహిస్తుంటే
నెత్తురు సలసలా మరిగి నరనరాల్లోకి
ప్రవహించదా! అభిమాన వతికి
పోరాటం పొత్తిళ్ళలో పెరిగిన బిడ్దేమో
గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ప్రతిఘటిస్తే
కామోన్మాదం తలకెక్కిన విషపురుగుల
వికృత పైశాచికత్వం నిద్రలేచి
దుర్యోధన దుశ్శాసన పర్వానికి తెర తీసింది.
మహా భారతం మళ్ళీ మళ్ళీ పునరావృతం
ఎక్కడో ఓ చోట ప్రతిరోజు ద్రౌపది ఆక్రందనలు
నిస్సిగ్గుగా నిలబడి చూస్తున్న జనం సాక్షిగా
విలువల వలువలు తగల బడుతుంటే
ఒళ్లంతా గొంగళి పురుగులు ప్రాకినట్లు
శరీరాన్ని తాకరాని చోట్ల తాకుతుంటే
నిస్సహాయంగా,బేలగా ముకులిత హస్తాలతో
మొగ్గలా ముడుచుకుని దీనంగా వేడుకుంటుంటే
తోడేళ్ళ గుంపు ఒక్కపెట్టున దాడి చేసినట్లు
అంగాంగాలను దుర్మార్గంగా తడుముతుంటే
కీచకుల వారసత్వాన్ని నీచంగా ప్రదర్శిస్తున్న
ఈ దానవ జాతిని ఏ పేరుతో పిలిచినా తక్కువే
అమ్మల స్తన్యంతో పెరిగిన కండలతో
అక్కచెల్లెల్ల ఆప్యాయత మరచిన రాక్షసత్వంతో
రెచ్చి పోతున్న ఈ మానవ మృగాలను ఏమనాలి?
హృదయవిదారకంగా విలపిస్తున్నా
వినోదంలా చూస్తున్న కన్నులున్న దృతరాష్ట్ర జాతి
సభ్యత సంస్క్రుతులకు సమాధి కడుతున్ననరాధముల్ని
యుగాల తరబడి క్షమిస్తున్నమానవజాతి
ఏ చరిత్రకు వారసులు వీరంతా !
మానవత్వం మరచిన ఈ మదాంధులను
ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
కాల్చి పారెయ్యాలి నిర్ధాక్షణ్యంగా
ReplyDeleteమళ్ళీ ఇంకొక మానవ మృగం ఎలాంటి దుస్సాహసం చెయాలన్నా వణికిపోయేంతగా
శిక్ష నుంచి తప్పించుకోగలమనే ఒకే ఒక్క కారాణాం ఆసరాగా
పాల్పడుతున్నారు ఇలాంటి అమానుష చర్యలకు కర్కసంగా
అమెరికా లో కాప్ అంటే పోలీస్ ని చూస్తే మనుషులకి నిలువెల్లా భయ్యం
పట్టుబడితే శిక్ష ఎంత త్రీవ్రంగా ఉంటుందో అందరికి ఎరుక!
మన దేశం లో తప్పు చేస్తుంటే భయ్యం లేదు
శిక్ష పడుతుందందేమో అన్న సందేహము లేదు
అసోం లో జరిగిన సంఘటన కు కవితా రూపం.చట్టాలు ఇండియా లో కొంత వరకు బాగానే వున్నాయి కానీ అమలు చేసేవారితోనే వస్తుంది సమస్య.అసోం ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి మాటల్లో తెలుస్తోంది.ఈ దేశాన్ని న్యాయ వ్యవస్థే రక్షించగలదు. మీరు చెప్పినట్లు శిక్షలు వుంటే తప్పు చేయటానికే జంకుతారు.
Deleteవారిలో ఉన్న ఏ ఒక్క బిడ్డ నా బిడ్డ అయినా.. నేను క్షమించేదాన్ని కాదు. ఎస్, ఉరి తీయాలి.
ReplyDeleteగొప్ప వ్యాఖ్య .తల్లుల పెంపకం పిల్లల ఈ ప్రవర్తనకు ఒక కారణం.
Delete"మహా భారతం మళ్ళీ మళ్ళీ పునరావృతం"
ReplyDeleteమహా భారతంలో ఉన్న చెడుని ఆదర్శంగా తీసుకున్నంతగా
మంచిని తీసుకుని ఉంటే ఇలాంటివి మళ్ళీ జరిగే పరిస్థితులు రావు కదండీ..
" ప్రతిఘటన సినిమాలో ఈ దుర్యోధన దుశ్శాసన" అన్న పాట గుర్తుకొచ్చింది
నిజమే.చెడుపట్ల వున్న ఆకర్షణ మంచి వైపు ఉండదు కదా!
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteనేను మొదటి కామెంట్ తో ఏకీభవిస్తున్నాను....
ReplyDeletethank you.
Deletegood one, keep writing.
ReplyDeletethank you.
Deleteసర్, విలువలు వీడనంత వరకూ సమాజం బ్రష్టు పట్టదు. నైతిక విలువలు మన చదువులలో ,పెంపకంలో ఉండాలి, బిడ్డల ఆలోచనలు కలుషితం కాని వాతావరణం ఇంటా, బైటా ఉండేలా చూడాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిమీదా ఉంది. పోస్ట్ బాగుంది.
ReplyDeleteమీరన్నది అక్షరాలా నిజమండి.ఇంటినుండే ఈ శిక్షణ ప్రారంభమవ్వాలి.బడులలో నైతిక విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి.
Deleteవెన్నెల గారి కామెంట్ తో ఏకీభవిస్తూ...
ReplyDeleteమళ్ళీ అలంటి తప్పు చేయకుండా శిక్షించే చట్టాలను తెచ్చి
వారిని వదలకుండా శిక్షించాలి...
చాలా బాగుంది మీ కవనం రవి శేఖర్ గారూ!
@శ్రీ
మీరు చెప్పినట్లు శిక్షలతో పాటు,విద్య నైతిక విలువలు పెపొందించేలా వుండాలి.ఈ దేశానికి ఈ రెండు కరువయ్యాయి.మీ ప్రశంసకు ధన్యవాదాలు.
Delete