ఓ స్వరం
నిశీధి నిద్రను చెరిపేస్తూ
ఓ గాత్రం
భావనా వీచికలను శ్రుతిచేస్తూ
స్వాప్నిక జగత్తులో
ప్రేమైక లోకంలో
విహరిస్తూ
తపిస్తూ వున్న
నన్ను స్పర్శించింది
అలలా
సెలయేటి గలగలలా
కరిగిన మంచులా
చల్లగా
మెల్లగా
వీణను మీటిన నాదంలా
కోయిల గొంతున రాగంలా
నన్నే స్మరిస్తూ
నన్నే జపిస్తూ
నా హృదయ కోశం లో
ప్రతి పొరను కదిలిస్తూ
గగనంలో ఎగురుతున్న
మేఘాలను పలకరిస్తూ
సున్నితంగా
సునిశితంగా
చిరుగాలి సవ్వడిలో
వెన్నెల చల్లదనంలో
మిళితమై చేరింది
వీనుల విందుగా
Enjoyed it sir,
ReplyDeleteLiked it very much.
మీరు ఆనందించినందుకు మాకానందం .ధన్యవాదాలు.
Deletevery very nice ravi sekhar garu
ReplyDeleteస్వాగతం రమేష్ గారు!మీరు మెచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
Deletebeautiful lines sekher, keep writing.
ReplyDeleteమీకు అంత అందంగా కవిత నచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
Deleteవీనుల విందుగా చేరిన "ఓ స్వరం" చాలా బాగుంది..
ReplyDeleteవీనుల కింపైన ఓ స్వరం అలా ప్రతి ఒక్కరికి ఉంటుందేమో!ధన్యవాదాలండి.
Deleteచాలా చాలా వీనుల విందుగా ఉంది....
ReplyDeleteనా హృదయ కోశం లో ప్రతి పొరను కదిలిస్తూ.. ఎందుకో ఆ లైన్ బాగా నచ్చింది అండీ...
మీ స్పందించే హృదయానికి ధన్యవాదాలండి.
Deleteగుండెకు హత్తుకుంది రవి శేఖర్ గారూ!
ReplyDeleteచాలా బాగుంది
@శ్రీ
కవి హృదయాన్ని కవే పసిగట్టగలడని మిమ్మల్ని చూస్తే అనిపిస్తుందండీ.మీకు అంతలా నచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
Deleteమీ "ఓ స్వరం" లోని
ReplyDeleteప్రతి పదం...
మధురమైన భావమై...
తాకింది హృదయం!
ఇటువంటి కవితలు మీరు ఇంతకంటే చాలా బాగా వ్రాస్తారు.ఈ కవితకు మీ ప్రశంస దక్కిందంటే చాలా ఆనందం .మీ స్పందనకు మరిన్ని ధన్యవాదాలు.
Deleteముందు ఆ గాత్రం, స్వరం ఎవరిదో చెప్పండి.సుశీలదా, జానకిదా, శ్రేయా ఘూషాల్ దా, లేక లత మంగేష్కర్ దా చెప్పండి ముందు..లేక మీకోసం మాత్రమే పాట పాడిన మీ ప్రియ నెచ్చెలిదా? (తిట్టుకోకండే, ఇలా అడిగానని)
ReplyDeleteకవిత మాత్రం simply very sweet!!!
సినిమా సంగీతం ఎంత విన్నా కవితలో వున్నంతలా ఉంటుందంటారా!ఉండొచ్చేమో .కాని ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్వరం వినిపించి ఉండదా!ఆ స్వరం కోసం ఎంతలా ఎదురుచూసి ఉంటారో కదా!అది గుండెను తట్టి మనసును మైమరిపించి ఉంటుంది కదా!అందరి జీవితాల్లో ఇది జరిగి ఉంటుంది కదా!కవి హృదయం కదండీ అలా పలికింది.మీరు అడిగిన విధానం చాలా నచ్చింది.మీకు బోలెడు ధన్యవాదాలు.
Deleteఆ గాత్రం ఆ స్వరం ఎక్కడో విన్నట్టు గుర్తు
ReplyDeleteఎక్కడివి ఈ రాగాలు అరుణ రాగాలు !
రవి .. వింటున్నాను కొత్తగా సరికొత్తగా
మళ్లి మళ్లి వినిపించు
ఎక్కడికి వెళ్లారు సర్.ఈ మధ్య మీ కవితా మందారాలు లేక బ్లాగులోకం చిన్నబోయింది.ఆ స్వరం అలా ప్రతి ఒక్కరికి ఏదో సమయం లో వినిపించి ఉంటుంది.అందుకు ఎవరు అతీతం కాదేమో!మీ స్పందనకు ధన్యవాదాలండి.
Deleteస్వరం పలికింది
ReplyDeleteసర్వం పులకించింది :)
మీ పదాల పొందిక చాలా బాగుంది.ధన్యవాదాలు మీకు.
ReplyDelete