హలాలతో పొలాలదున్నీ
జాతికి జవసత్తువనిచ్చే
కర్షకవీరుల త్యాగం.
గనిలో,పనిలో,ఖార్ఖానాలో
విరామమెరుగక,విశ్రమించక
జగతికి జవజీవాలిచ్చే
కార్మికధీరుల కష్టం.
మెలి తిరిగే నరాలతో
పట్టువీడని కరాలతో
జనుల అవసరాలు తీరుస్తున్న
శ్రామిక లోకపు స్వేదం.
కండర కష్టం నమ్ముకొని
ఎండను,వానను,చలినీ
లెక్కచేయని తత్వం.
చక్రం,రంపం
పగ్గం ,మగ్గం
కొడవలి,నాగలి
సమస్త వృత్తులు
శ్రమైక జీవన సౌందర్యానికి
అచ్చమైన ప్రతీకలు.
మీ కల్యాణానికి
మీ సౌభాగ్యానికి
మీ పోరాటానికి
నేడే!మేడే!
ఈ కవితకు స్పూర్తి శ్రీశ్రీ మహాప్రస్థానం లోని ప్రతిజ్ఞ అనే కవిత
శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు.
కవిత చదవగానే అనిపించిందండీ శ్రీ శ్రీ సాహిత్యంలాగానే వుందని.. బాగుంది!!
ReplyDeleteమేడే శుభాకాంక్షలు.
రాజి గారికి స్వాగతం!పాత పొస్ట్ లు కూడా చదవండి.మీకు ధన్యవాదాలు.
DeleteScience పాటాలు చెప్పేస్తారు, మంచి విషయాలు ఎన్నో చెపుతారు, మంచి కవితలూ రాస్తారు..మీరు all in one అండీ! కవిత చాలా బాగుంది. రాస్తూ ఉండండి!
ReplyDeleteమన దగ్గరున్న వివేకాన్ని,జ్ఞానాన్ని పంచటాన్ని మించిన త్రుప్తి మరేముందండి.
Deleteచెప్పాలని వుంది గుండె విప్పాలని వుంది.........ఇంకా చెప్పాల్సినది ఎంతో వుందండి.ఈ గూగుల్ వాల్లు మనల్ని ఇలా ఎంతకాలం వ్రాయనిస్తారో! మీ స్వచ్చమైన ప్రశంసకు థాంక్స్.
చాలా బాగుంది. శ్రీ శ్రీ గారి కవితని అనుసృజన చేసారు. శ్రీ శ్రీ ప్రభావం లేని తెలుగు కవి ..అంటూ ఎవరూ ఉండరండి.
ReplyDelete"మే " డే ..శుభాకాంక్షలు.
తెలుగు సాహిత్యాన్ని ఆకాశం నుంచి భూమార్గం పట్టించిన నవయుగ కవితా వైతాళికుడు శ్రీశ్రీ ప్రభావం ప్రతియువకుడి పై తప్పని సరి.మీ అభినందనకు ధన్యవాదాలు.
Deleteమీ కవిత చదివాక, ఎందుకో ? ఏమో ! గారు ఇచ్చిన ఒక లింక్ లో శ్రీ శ్రీ గారి కవిత చదివాను. రెండు మే డే కవితలు చదివాను నేను..ధన్యవాదాలు మీకు.
ReplyDeletelink : http://prajakala.org/mag/2007/05/mayday_2007
ఆ లింక్స్ నేను కూడా చూస్తాను.మహా ప్రస్తానం ఎక్కడైనా దొరికితే చదవండి.థాంక్స్.
Deleteచాల బాగుంది రవిశేఖర్ గారూ!
ReplyDeleteశ్రీ శ్రీ గారిని మరోసారి గుర్తు చేసుకుంటూ
నివాళులర్పిద్దాం....
@శ్రీ
థాంక్స్ సర్.ఆయన మహాప్రస్థానం చదివి ఎంతో ప్రభావిత మయ్యాం.
Delete