నా పదమంజీరాలు అల్లరి
సవ్వడులు చేస్తున్నాయి ప్రభూ!
నీ హ్రుదయాంచలాన మెరిసే
ఊహా ప్రపంచపు గీతికల్ని
మకరందాన్నిఅద్ది పలికించమంటున్నాయి
నీ హృదయస్పందన అంది
నెలలు గడిచిపోతున్నాయి స్వామీ!
అభిసారికనై నీ పరిష్వంగాల స్మృతులను
క్రుతులుగా కూర్చి పాడుకుంటూ
ప్రతి నిమిషము ఓ యుగంలా గడిపేస్తున్నా!
నా నిమీలిత నేత్రాలు సంధ్యారుణ
కిరణాల్ని చూడలేక పోతున్నాయి
ఈ సంధ్యలోనే కదా మనం
పాడిన ప్రేమ పల్లవులు
ప్రతి కెరటం విని పులకించి పోయింది
ఆ జ్ఞాపకాలు గుర్తువచ్చి నా మనసు
నా వశం తప్పి పోతుంది
ఆకసములోని ప్రతి మబ్బు తునక
మన ప్రేమ రాగాన్నేఆలపించలేదా!
సముద్ర తీరాన ప్రతి ఇసుక రేణువు
మన దోసిళ్ళనుండి జాలువారి
త్రుప్తి పడినదే కదా!
ప్రతి అలను అడుగుతున్నాను
నా వర్తమానం నీ కందించమని
ఏమిటో ప్రియతమా !నా మదిలో
నీ ఫై నా ప్రేమ ప్రవాహమై ,
ప్రమోదమై! ప్రణవ నాదాన్ని
నిరంతరంగా పలికిస్తూనే వుంది
నీ సందేశం అందే వరకు ఈ విరహం
ఇలా పలుకుతూనే వుంటుంది.
చాలా బాగుంది రవిశేఖర్ గారు. చదువుతుంటే హాయిగా అనిపించింది.
ReplyDeleteరవిశేఖర్ గారు,
ReplyDeleteనిజంగా బాగుంది ప్రెజెంటేషన్.
బాగుంది మీ కవిత...
ReplyDelete@శ్రీ
వెన్నెల గారికి,శ్రీ గారికి,లక్ష్మీదేవి గారికి స్వాగతం,నమస్కారం,ధన్యవాదాలు !ఓ సారి అనిపించింది !మగ కవులంతా ఆడవారి గురించి వ్రాస్తారు,కవయిత్రులంతా మగవారి గురించి తమ ప్రేమను వ్రాస్తుంటారు.మరి కవులు కవయిత్రి మనసు తో వ్రాస్తే ఎలా ఉంటుందనిపించింది .ఫలితం ఈ కవిత !
Deleteకెరటం పులకించి పోయింది
ReplyDeleteమబ్బు తునక రాగం ఆలపించింది
ఇసక రేణువు దోసిళ్ళ నుండి జాలువారింది
ప్రేమ ప్రణవం విరహం అంటూ
ప్రక్రుతి సౌందర్యాన్ని కవిత నిండా కుమ్మరించావు
ఒక ఆహ్లాదాన్ని ఎద ఎదలో నింపావు
నీ ప్రణయ హృదయానికి పలికించిన నీ కలానికి అభివాదాలు
అందుకే కవులంతా మీకు తమ కవితలు చూపిస్తే మరింతగా ఎదిగి బాగా వ్రాయగలరేమో అనిపిస్తుంటుంది .మీలాంటి వారి ప్రశంసలు మాకు టానిక్ లాంటివి.మీరు సలహాలు,సూచనలు కూడా నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు.అప్పుడే మేము మరింత బాగా వ్రాయగలము.మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeletegeethanjalini gurthuchesindi, sekher.
ReplyDeleteస్వాగతం .మీ ప్రశంసకు ధన్యవాదాలు .మీ బ్లాగు చూసాను .బాగా అభివృద్ది చేస్తున్నారు. కీప్ ఇట్ అప్ .
ReplyDelete