చిన్నారి పాపల చిలిపి నవ్వులు
మురిపించే చిలిపి చేష్టలు
స్వచ్చమయిన వారి మోము
వారిని వీడి మేముండ లేము
బోసి మాటల మా బుజ్జి రూపాలు
మా పాలిట మరువ లేని కల్ప వృక్షాలు
సొట్టలు పడే మా పాప బుగ్గలు
చూడాలనిపించే చిన్ని నడకలు
అలరారే ఆనందాల వలయాలు
కురిపిస్తారు చిరునవ్వుల జల్లులు
పాల వెన్నల లాంటి పాప పళ్ళు
గంతులేసే లేడి కూనల్లాంటి పాదాలు
చక్రాల్లాంటి అందమయిన కళ్ళు
మాకు కలకాలం వారి తీపి గుర్తులు
కమ్మని లాలి పాటలకు వారి సంతోషాలు
కల్మషం లేని బంగారు హృదయాలు
మా భవిష్యత్ ప్రతి రూపాలు
save Girl child.. ki andamgaa..anubandam gaa mee ee post baagundi.
ReplyDeleteప్రతి ఇంట్లో ఓ ఆడపిల్ల ఉండాలండి .అప్పుడే మగవాడికి తన అమ్మ గుర్తొస్తుంది .అలాగే అమ్మాయిలు చూపించే ప్రేమ అబ్బాయిలు తమ తల్లి దండ్రుల మీద చూపించరేమో అనిపిస్తుంటుంది .మీకు thanks .
Deleteచాలా బాగుందండి!
ReplyDeleteమీరిచ్చిన మెయిల్ ద్వారా మాలికలో చేరాను. స్పందనకు, సహాయానికి ధన్యవాదాలు వెన్నెల గారు!
ReplyDelete