Saturday, 17 March 2012

ప్రకృతీ పదనిసలతో సరిగమలు

కురిసీ కురియని మేఘాలెన్నో వచ్చి వెళుతున్నాయి
వసంతాలు హేమంతాలన్ని కరిగి పోతున్నాయి
వెలుగు వెనుక చీకటి,చీకటి వెనుక వెలుగులెన్నో
                                                              దొర్లిపోతున్నాయి
అమావాస్యల అనురాగాలు ,వెన్నెల మందారాలు
                                                             మౌనంగా వెళ్ళిపోతున్నాయి
తీరం తెలియని నావ సంద్రంలో సంగమించి పోబోతుంది
ఉషోదయం చూసి ఉత్సాహంగా ఉందామన్నా
సంధ్య వెలుగువచ్చి చీకటికి స్వాగతమిస్తుంటే
మనసు,మమతల మకరందాలు విన్నవించ లేకున్నా
 మాటలకు రూపమిద్దామని అనుకున్నానంతలో
నీలాల గగనాన జాబిల్లి ఎందుకో ననుచుసి నవ్వుతోంది
పాటకు పల్లవి కూరుధ్ధామన్నా నా శబ్ద విపంచులు
ప్రకృతి నాదాల సవ్వడిలో కలిసిపోతున్నాయి
కవిత్వాక్షరాలను అవనిఫై  అక్షరీకరిద్దామన్నా
ఏమిటో అంతర్భాగాన అర్థం కాని నాదాలు,బాహ్యప్రపంచాన
                                                                            దుఖాశ్రువుల గీతాలు
నీ చిరునవ్వుల ముఖ సౌందర్యాన్ని   
                                            ఆకాశం కాన్వాసుమీద చిత్రిద్దామన్నా
అంతలో తెల్లని మేఘాల మాలికలు
                                             నీ చిరునవ్వులనే శ్రుతి చేస్తున్నాయి
అంటే నీవు నీవుగా లేవనుకుంటున్నాను
నీ కోసం వేచిచూసి చూసి విసుగుచెందానని భ్రమిస్తున్నాను  
ఇప్పుడర్ధమయ్యింది నీవు మౌనంగా దాచుకున్న హృదయానురాగాలను
ప్రకృతిలో మిళితం చేసావని
ఇప్పుడనుకుంటున్నాను!ప్రకృతి రూపమే నీవు,నీ రూపమే ప్రకృతని
కాని నిన్నుచూడాలని సవంత్సరాలతరబడి వేచిచూసిన  ఫలితాన్ని
ఇంత మనోహరమయిన   ప్రత్యూష నాదాలతో పల్లవించే
ప్రకృతీ పదనిసలతో సరిగమలు కూర్చావన్న మాట               

2 comments:

  1. ప్రకృతి లోనే మన స్నేహితున్ని /రాలి ని చూసుకోవటం ఓ చిన్న ప్రయోగం .మీ స్పందనకు ధన్యవాదములు.

    ReplyDelete