మనం మానసిక ప్రయోగాలు చేద్దామా !
మనం రోజంతా గడిచిన తర్వాత ఇంటికి వచ్చి పడుకునేలోపు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్క సారి మన ప్రవర్తనను విశ్లేషించుకుంటే మనకు మనం అద్దం లాగా కనబడతాము.దీనికి ఇంకో ఉపాయం వుంది.ఇంటికి వచ్చేదాకా ఎందుకు మనం ఇతరులతో మాటలాడుతున్నప్పుడే ఒక వైపు ఈ ప్రక్రియ నడిపించగలిగితే మరీ మంచిది.సరే మీకు తోచిన సమయంలో చేయండి.
సహజంగా మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అనుకూలమయిన విధంగా ఎవరయినా మాట్లాడితే మనకు సరిపోతుంది.అలాకాకుండా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే స్పందిస్తాము.ఆ స్పందన లో మాటలు జారుతాము.ఇక విషయం ప్రక్కదారి పట్టి మనం వాడిన భాష ఫై చర్చ మొదలవుతుంది.ఇక్కడ ఒక్క చిన్న విషయం .ఎవరికయినా తమ స్పందన తెలిపే హక్కు వారికుంటుంది.దానిలో మంచి చెడ్డలను మనం విశ్లేషించాలే గాని స్వరం పెంచి వ్యక్తిగత విషయాలఫైకి మల్లించాల్సిన అవసరం లేదు. ఇలాంటి చర్చలు ప్రభుత్వ ఆఫీసులలో బాగా జరుగుతుంటాయి.పార్టీలలో,సమావేశాలలో పదిమంది కూడి ఉన్నప్పుడు ఇవి సాధారణం.మన అభిప్రాయాలు చెప్పడం వరకే మన భాద్యత .అది ఎదుటివారికి నచ్చాలని లేదు కదా.
సహజంగా వార్తాపత్రికలలో వచ్చే విషయాలఫై చర్చలు మొదలవుతాయి.అందులో రాజకీయాలదే కీలక పాత్ర .సినిమాలు,క్రికెట్ తరువాత !ఈ చర్చల్లో ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చవు.ఇక వాదోపవాదాలు .అంతా అయిన తర్వాత మనం వాడిన భాష గుర్తుంటుంది .మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇక సామాజిక సమస్యలఫై కూడా ఇటువంటి చర్చలే నడుస్తుంటాయి.ఈ ప్రక్రియ నంతటిని ఒక వైపు మనసు గమనిస్తుంటే సూక్ష్మం లో చర్చ ముగుస్తుంది.ఇలా ప్రయత్నించండి.మరోసారి కలుద్దాము..

No comments:
Post a Comment