Tuesday 15 October 2013

విశ్వ నరుడు(స్టీఫెన్ హాకింగ్ పై పాపినేని శివశంకర్ కవిత)

physically challenged  కాదు
Physics నే  challenge చేసినవాడు
దేహ విధ్వంసం చేసే
మోటార్   న్యురాన్  వ్యాధిని
విజ్ఞాన వ్యాయామంతో
అధిగమించినవాడు
ధ్వనులుగా పొల్లులుగా  విడిపోయి
పడిపోయిన మాటని
speech synthesizer లో స్థిరపరుచుకున్నవాడు
ప్రపంచంలో ప్రతి వికలాంగుడికి
గుండెదిటవు నిచ్చినవాడు
కాస్మిక్ కడలిలో
బుద్ది బాహువుల గజ ఈతగాడు
కాల్లూ చేతులు  ఆడకపోయినా
కాలబిలంలో ఏరోబిక్స్ చేసినవాడు
అండాండ పిండాండాల నులిపోగుల్లో
ఉయ్యాల లూగినవాడు
విశ్వానికి అంతం లేదని పంతంతో
బ్రహ్మాండానికి Grand design నిర్మించి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికే
ప్రవేశం నిరాకరించినవాడు
వికలాంగుడు కానే కాడు
సకల మేధాంగ  సుందరుడు
స్టీఫెన్ హాకింగ్  einstein కు
అసలైన వారసుడు

Sunday 13 October 2013

అన్నార్తులకు ఇ-సాయం

              ప్రపంచ వ్యాప్తంగా తినేందుకు తిండి లేక ప్రతిరోజు 24,000 మంది చనిపొతున్నారు.వీరిలొ 3 వ వంతుమంది 5 సంవత్సరాల వయసు లోపు చిన్నారులే .ఈ విషయం తెలుసుకున్న జాన్ బ్రీన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్  ఇంటర్నెట్ తో అన్నదానాన్ని ముడి పెట్టాలనుకున్నాడు .ఈ ఆలోచన పలితమే hungersite అనే website.1999 june లో ఏర్పాటయింది.తరువాత  ఆర్ధిక  సమస్యల  కారణంగా ఈ సైట్ charityusa   అనే సంస్థ చేతుల్లోకి వెళ్ళింది.
              కొన్ని సంస్థలు విరాళాలు తీసుకుంటాయి.కానీ ఈ సైట్  మనం చేసే క్లిక్ ల ఆధారంగా నడుస్తుంది www.thehungersite.com  open చెయ్యగానే  click here its free అని  వస్తుంది రోజు కొక సారి క్లిక్ చెయ్యటమే అలా చెయ్యగానే మనం  thankyou పేజి లోకి వెళ్తాము అక్కడ కొన్ని వ్యాపార ప్రకటనలు ఉంటాయి.  మనం   కొన్నా    కొనకపోయినా చూస్తె  చాలు.స్పా న్సర్స్ hungersite కు foodpackets  పంపిస్తారు అది వాళ్ళ మధ్య ఒప్పందం .ఈ సైటుకు అమెరికా లోని mercycore,second harvest అనే  సంస్థలు  సాయం  అందిస్తున్నాయి.
             ఇంకా ఈ సైట్ లో breastcancer,animals,veterans,autism,diabetes,literacy,rainforest వంటి సమస్యలకు కూడా సైట్స్ ఉన్నాయి .
            ప్రతి రోజు ఒక్క  సారయినా ఈ  సైట్ లోకి వచ్చి క్లిక్స్ ఇవ్వడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపిన వారమవుతాము. మరెందుకు ఆలస్యం ఈ రోజే మొదలెడదాము.

www.thehungersite.com
(ఈ సమాచారం ఆదివారం ఈనాడు అనుబంధం  లోనిది .వారికి ధన్యవాదాలు)

Sunday 28 July 2013

విహార యాత్రలకు యూత్ హాస్టల్స్


                మనం  ఎన్నోప్రాంతాలను చూడాలనుకుంటాం.కాని కొత్త ప్రాంతాలు అక్కడి విషయాలుతెలియవు ఉండ టానికి వసతి సౌకర్యం చాలా ఖరీదుగా ఉంటుంది.ఆహారం సమస్య.ఇంకా చెప్పాలంటే భద్రత కూడా ఒక సమస్యే!ఇన్ని ఆలోచనలతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటాం.కాని అన్నిటికీ పరిష్కారం ఒక సంస్థ  చూపిస్తుంది.
               అదే YHAI(youth hostels association of india).ఇది  HOSTELLING INTERNATIONAL వారి  అనుబంధ సంస్థ .దీనికి ప్రపంచ వ్యాప్తంగా  90 దేశాల్లో 4000 hostels ఉన్నాయి.45 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు..మన దేశంలో 23 రాష్ట్రాల్లో దీని శాఖలున్నాయి.మన రాష్ట్రం లో సికింద్రాబాద్(040 27540763) విశాఖపట్నం(9441246987),తిరుపతి(0877 2240300),హైదరాబాద్(9396539854),విజయవాడ(9000094949) లలో శాఖలున్నాయి.
     దేశ వ్యాప్తం గా సంవత్సరం పొడవునా వారు యాత్రలు నిర్వహిస్తుంటారు.ముందు అందులో సభ్యత్వం తీసు కుంటే వారు ఇచ్చేఅన్నిసౌకర్యాలు పొందవచ్చు.ప్రస్తుతం DR HAREESH SAXENA గారు YHAI  CHAIRMAN   ఉన్నారు . వారు  ఇప్పటికి  90 దేశాలు  తిరిగారు.వారు ఒక బ్లాగు కూడా నిర్వహిస్తున్నారు. harishtravels.blogspot.in ఇంకా మరిన్ని వివరాలకు ఈ క్రింది websites చూడండి .
  www.yhaindia.org
www.hihostels.com

Thursday 27 June 2013

IIT లో సాయి సందీప్,రవి చంద్ర ల అద్బుత విజయం.


                 IIT లో సీట్  తెచ్చుకోవటమే గొప్ప అనుకుంటే ప్రపంచం లోనే అత్యంత కష్ట మైన ప్రవేశ పరీక్షగా పేరు తెచ్చుకున్న ఇందులో అఖిల భారత స్థాయిలో  ప్రధమ,ద్వితీయ  స్థానాలు సాధించడం ఆ కుర్రాల్లిద్దరు తెలుగు వాళ్ళు కావడం అందరు గర్వించాల్సిన విషయం.వారు మొదటి RANKER  సాయి సందీప్  రెడ్డి ,రెండవ  RANKER రవిచంద్ర .
                ప్రపంచ స్థాయి ఇంజినీరింగ్ విద్య ను అందిస్తున్న IIT లో ప్రవేశం కొరకు ఎలా తయారవ్వాలనే విధాన్ని  వారిద్దరి మాటల్లోనే తెలుసుకుందాం.
                  ముందుగా సందీప్ రెడ్డి చెప్పిన విషయాలు.
ఈ rank  సాధించటానికి నా సరదాలనేమీ త్యాగం  చేయ లేదు.నాకు అబ్దుల్ కలాం స్పూర్తి.ఇంజినీర్ ను కావాలని మొదట నుండి  ఉండేది.గణితం పై ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాన్ని.ఇందుకు సిద్ధ పడేవారికి కనీస స్థాయి తెలివితేటలు .ఇంటర్లో సగటున రోజుకు 12 గంటలు చదవ గలగాలి.ప్రతి అంశాన్ని లోతుగా చదవాలి.పూర్తీ ఏకాగ్రత అవసరం.Maths:R.D.sharma,M.T.G publications;PHYSICS;H.C.VERMAI.E IRODOV;CHEMISTRY:ATKINSVED JUNIOR,J.D LEE. చదివాను.
       IIT లో  application ప్రధానం .చదివిన  concept లని  apply చేయగలగాలి .నిజానికి  ఈ  పరీక్ష  అంత  కష్టం  కాదు .చక్కని  ప్రణాళికతో  సమయం  వృధా  చేయకుండా  చదివితే  ఎవరైనా  iit ప్రవేశ  పరీక్షలో  మంచి  rank సాధించవచ్చు .
                 రెండవ  ranker రవిచంద్ర  మాటల్లో  .....
                    నేను  సరదాగా  చదివాను .సబ్జెక్టు  మీద  అమిత  ఇష్టంతో చదివాను.IIT ప్రవేశ  పరీక్షకు  జ్ఞాపక  శక్తి  కంటే  ఆలోచింపగల సామర్థ్యం  కావాలి .నిజ  జీవిత  పరిస్థితుల్లో  ఇచ్చిన  సమస్యలను  అనువర్తించగలగాలి .
MATHS :TMH publishers-MATHS  for iit jee ;physics iradov;chemistry bahadur,himanshupandegopi tandon పుస్తకాలు  చదివాను .సీట్  సాధించాలంటే  6 లేదా  7 గంటలు  చదవాలి .topper గా  నిలవాలంటే  10 గంటలు  చదవాలి .సబ్జెక్టు  కు  సిద్ధ  మవటా న్ని  ఇష్టంగా  ఆస్వాదించాలి .ఇందులో  విజయానికి  బోధనా  ప్రాముఖ్యం  20%  అయితే  80%  విద్యార్ధి  సన్నద్ద్హత మీద  ఆధార  పడి ఉంటుంది .ఎంత  చదివాం  అన్నది  కాదు  ముఖ్యం  ఎంత  సాధన  చేసాం  అన్నది  ముఖ్యం
  ఇంటర్వ్యూ  కోసం 24/6/2013 ఈనాడును చూడగలరు.వారికి ధన్యవాదాలు.
                         వారి విజయాన్ని మనస్పూర్తిగా అభినందిద్దాం. 

Saturday 25 May 2013

క్షణికావేశం ఆపుకొని కొద్దిగా ఆలోచించండి!



               ఏప్రిల్ 28 వ తారీకు హైదరాబాద్ జిల్లా ఎడిషన్ చూసిన వారికి ఈ విషయం తెలిసి ఉంటుంది నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి రైల్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకోవటం ముక్కలుగా మారి చనిపోవటం. ఆ సమా చారం మా బంధువుల ద్వారా నాకు తెలిసింది.అతను మాకు వరుసకు అన్నయ్య అవుతారు.షాక్. చనిపో వటానికి కారణాలు అంతు చిక్కలేదు.అప్పులు లేవు.ఒక్కడే కొడుకు.పెద్ద బిల్డింగ్.ప్రైవేటు కంపెనీలో మంచి ఉద్యోగం తరువా త తెలిసింది ఏవో చిన్న కారణాలని.ఇంతకు ముందు మా మిత్రుడి ఆత్మహత్యను ఆపగలిగాను అతను నాకు ఫోన్ చె య్యటంతో ఆ విషయాన్ని ఇదే బ్లాగు లో వివరించాను.అలాగే ఈయన కనుక ఫోన్ చేసుంటే ఆపగలిగే వాడినేమో ఇలా ఎందరో చిన్నకారణాలకు జీవిత యాత్ర చాలిస్తున్నారు.
       ప్రతి సమస్యకు చావే పరిష్కారం అయితే ఎవరు ఈ ప్రపంచంలో మిగలరు.గంటకు 14 మంది సంవత్సరానికి ఒక లక్షా ఇరవై వేల మంది.ఇది మన దేశం లో ఆత్మ హత్య చేసుకుంటున్న వారి సంఖ్య.ఇందులో 12.1 శాతం తో మన ఆంధ్ర ప్రదేశ్ది రెండవ స్థానం.
       ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది ఆత్మ హత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది.ప్రతి 40 సెకన్లకు ఒకరు చనిపోతున్నారు.ఇది 2020 కి ప్రతి 20 సెకన్లకి ఒకటిగా నమోదవుతుందని అంచనా.అందులో 60 శాతం మంది 45 సంవత్సరాలలోపు వారే!మొత్తం బలవన్మమరనాల్లో చైనా,భారత్ లోనే 30% నమోదవుతు న్నాయి.
       యువత ఇలాంటి నిర్ణయం తీసు కోవడానికి ప్రధాన కారణం ఒత్తిడిని ఎదుర్కో లేక పోవడం,ప్రేమ విఫల మైన వారు,పరీక్షలు,ఎంట్రన్స్ లలో మంచి రాంక్ రాకపోవటం వలన పెద్దల మందలింపులత,ఉద్యోగం సాధించలేక జీవి తంలో స్థిరపడలేక పోవటం,సంసారంలో గొడవలు,ఆర్హిక ఇబ్బందులు,వ్యాపారాల్లో నష్ట పోవటం ఇలా విభిన్న కార ణాలతో జీవితాలను అంతం చేసుకుంటున్నారు.మరీ దారుణ మైన విషయం ఏమిటంటే అప్పుల పాలైన వారు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మ హత్య చేసుకోవటం.
        మరి ఇలాంటి వారు ఆగాలన్నా,ఆలోచించాలన్నా ఏమి చేయాలి?
అంతార్జాతీయంగా ఆత్మీయ నేస్తం.
              ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో సేవలందిస్తున్న "Befriendars"అనే  సంస్థ ఉంది.మన దేశం లో దీనికి 11 శాఖలున్నాయి.నలభై వేల మంది సిబ్బంది ఉన్నారు.దీనికి అనుబంధంగా హైదరాబాద్లో ఏర్పాటయిందే రోష్ని .వీరికి ఫోన్ చేస్తే చాలు. చక్కని సలహాలతో సాయ పడతారు.నెలకు వీరికి 400 కాల్స్ వస్తుంటాయి.
చిరునామా
  రోష్నీ,ఇం.నం  1-8-48/21,కలావతి నివాస్,
సింధీ కాలని, s.p road,secunderabad phone:040-66202000,27848584,email :help@roshnihyd.com
పుస్తక నేస్తాలు.
 ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చే పుస్తకాలు.
1)suicide:the forever decision
2)choosing to live
3)how i stayed alive when my brain was trying to kill me
4)change your brain change your life
మన  తెలుగులో  కూడా  మంచి  పుస్తకాలు  ఉన్నాయేమో  సలహాలివ్వండి .
మంచి  websites
www.depressionlife.com
www.suicide.com
www.suicidehelplines.comteenadvice.about.com
www.befrienders.com
www.youthsuicide.ca
  మనకు ఎవరయినా  ఇటువంటి  వ్యక్తులు  కలిస్తే  వాళ్ళ  సమస్యను  పూర్తిగా  విని
ధైర్యం  చెప్పండి .అవసర  మైతే  psychologist ల  దగ్గరికి  తీసుకేల్లండి.ఈ సమాచారాన్ని మీకు తెలిసిన మార్గాల్లో అందరికి తెలియజేయగలరు.
(ఇందులోని సంఖ్యా వివరాలు, helpline,books,websites సమాచారం ఈనాడు పేపర్ నుండి సేకరించాను.వారికి ధన్యవాదాలు.)
(ఇంతకు ముందు ఆత్మ హత్యలపై ఇదే బ్లాగు లో నేను వ్రాసిన వ్యాసం కోసం ఇక్కడ చూడగలరు.
http://ravisekharo.blogspot.in/2012/09/blog-post_10.html)

Wednesday 22 May 2013

"సిరివెన్నెల" పాటల్లో ఆణిముత్యాలు

              1985 వేసవి సెలవుల్లో అనుకుంటా సిరివెన్నెల విడుదల ఆయింది.  సంగీతం పట్ల అంతగా అవగాహన లేకపోయినా అందులోని హరిప్రసాద్ గారి వేణు గానం మరోలోకాల్లోకి తీసుకు వెళ్ళింది అప్పటినుండి వేణువు నేర్చుకోవాలని ఉంది .ఇంత వరకు  తీరలేదు .
1)విధాత తలపున :        సిరివెన్నెల
             ఈ పాట బాగా పాడుకుంటుంటాను.ఇందులోని వాక్యాలు పలకటమే కష్టంగా ఉంటాయి.
2)తెలవారదేమో స్వామి:  శ్రుతిలయలు  
3)అందెల రవమిది :         స్వర్ణ కమలం
             విశ్వనాధ్  వారి కళాత్మకతకు సిరివెన్నెల గారి సాహిత్యం తోడయితే ఈ పాట  

              అర్థం చేసుకోరు అంటూ భానుప్రియ పలికే పలుకులు సరదాగా ఉంటాయి.
4)సురాజ్య మవలేని :              గాయం
              సమాజం పట్ల సిరివెన్నెల గారు సంధించిన పాశుపతాస్త్రం ఈ పాట.దీనికంటే ముందు త్రిశంకు స్వర్గం లో         అంటూ ఒక privatesong వ్రాసారు.అది నేను తరచుగా వేదికల మీద పాడేవాన్ని.దాన్ని మార్పు చేసి సినిమా కోసం ఈ పాటగా వ్రాసారు.
5)చిలుకా ఏ తోడు లేక:           శుభలగ్నం
6)మనసు కాస్త కలత పడితే :  శ్రీకారం
             ఈ పాటలో జీవిత సారాన్ని నింపారు.
7)అర్థ శతాబ్దపు :                   సింధూరం
             కృష్ణవంశీ తీసిన సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు . చాలా ఫైర్ తో తీసారు.కానీ సినిమా ఆడలేదు బాగా   నష్ట పోయారు.ఈ పాటలో సిరివెన్నెల గారు స్వాతంత్ర్యం గురించి పడే ఆవేదన మనకు తెలుస్తుంది.
8)దేవుడు కరునిస్తాడని :      ప్రేమ కథ
             వర్మ గారు ఈ సినిమాకు కథ పంపించమని పేపర్ లో ఆడ్ ఇస్తే ఓ కథ తయారు చేసుకొని ఆ మనవి ఎక్కడ తీసుకుంటారులే అని మానేశాను.ఈ పాట ఇందులో చాలా బాగుంటుంది.
9)తరలిరాద తనే వసంతం : రుద్రవీణ
10)చెప్పాలని ఉంది :          రుద్రవీణ
12)నమ్మకు నమ్మకు ఈ రేయిని : రుద్రవీణ
            నెల్లూరు లో డిగ్రీ చదివే రోజుల్లో  అర్చన థియేటర్ లో సెకండ్ షో చూసి వచ్చి ఆ ఆవేశం తో ఓ కవిత వ్రాసాను.ఇప్పుడు చదివితే ఆ సినిమా అంతగా ప్రభావితం చేసిందా అనిపిస్తుంది.
13)ఎవరో ఒకరు :     అంకురం
            ఉమ మహేశ్వర  రావు అనే  డైరెక్టర్ అనుకుంటా ! ఈ సినిమాని చాలా బాగా తీసారు.ఎందుకో ఆయన తరువాత నిలదొక్కుకోలేకపోయారు.
14)తెలిమంచు కరిగింది :స్వాతికిరణం
          ఈ సినిమా నిజంగా హృదయాన్ని కదిలించి వేసింది.ఒకే రంగం లో ఉండే వారి మధ్య ఇంత ఈర్ష్య ఉంటుందా  అనిపిస్తుంది.అలాగే ఆ పిల్లవాని నటన ,ముమ్మట్టి నటన అద్భుతం
15)అపురూపమైనదమ్మ ఆడజన్మ:పవిత్ర బంధం
         జేసుదాస్ గొంతు ఈ పాటకు వరం.
ఇలా కొన్ని పాటలు మీకు పరిచయం చేయాలనిపించింది.






































)




Sunday 12 May 2013

ధ్యానం అంటే .... జిడ్డు కృష్ణ మూర్తి


  • ధ్యానించే మనసు ఆధ్యాత్మికత గల మనసు. ఆధ్యాత్మికత చర్చీలుఆలయాలు,భజనలు,తాకలేని మతం.విస్పోటం చెంది ప్రేమ జ్వలిం టమే ఆధ్యాత్మిక మైన మనసు అంటే . 
  • జీవితం లోని అత్యుత్తమమైన కళల్లో ధ్యానం ఒకటి.బహుశా ఇదే అత్యు త్తమమైనదేమో!ఒకరు మరొకరి వద్ద నుంచి దీన్నినేర్చుకోలేరు.అదే దీని లోని సౌందర్యం.మిమ్మల్నిగురించి మీరు తెలుసుకుంటుంటే అదే ధ్యానం 
  • ధ్యానానికి అంతమనేది లేదు.ఒక ఆరంభము లేదు.ఒక వర్షపు చినుకు వంటిది.ధ్యానంలేని హృదయం ఎడారిగా మారిపోతుంది.బంజరు భూమి అయిపోతుంది.
  • మస్తిష్కం తన కార్యకలాపాలన్నింటిని తన అనుభవాలనన్నింటిని కట్టి పెట్టి అచంచలమైన ప్రశాంతితో ఉండగలదా అని కనిపెట్టడమే ధ్యానం.
  • ధ్యానానికి అత్యుత్తమమైన క్రమశిక్షణ ఎంతో అవసరం.అసూయ నుండి అత్యాశ నుండి,అధికారదాహాన్నుండి విముక్తి పొందాలి.
  • ధ్యానం మేధకు సంబంధించిన వ్యవహారం కాదు.హృదయం మనసు లోకి ప్రవహించినప్పుడు మనసు తత్వం భిన్నంగా ఉంటుంది.ప్రేమ కదులుతూ ప్రవహించడమే ధ్యానం.
  • ధ్యానం ఒక గమ్యానికి చేర్చే సాధనం కాదు.ధ్యానమే మార్గం.ధ్యానమే గమ్యం.రెండూ అదే. 
  • తెలిసిన విషయాలనుండి విముక్తి చెందడమే ధ్యానంలోని పరిపక్వత ధ్యానం అంటే జ్ఞాన ప్రపంచంలో సంచరిస్తూనే దాని నుంచి విముక్తి చెంది అజ్ఞేయం లోనికి ప్రవేశించడం.
  • మీకు నిజంగానే ధ్యానం అంటే ఏమిటో కనిపెట్టాలని కనుక ఉంటె అప్పు డు ఆధిపత్యాలను అన్నింటినీ పూర్తిగా సమిష్టిగా ప్రక్కకి తోసి వేయాలి 
  • సంతోషాన్ని,సుఖాన్నికొనవచ్చు.నిశ్చలానందాన్నికొనలేరు.పరిపూర్ణ స్వేచ్చ కలిగిన మనోస్థితికి మాత్రమే  నిశ్చలానందం కలుగుతుంది.  నిశ్చలానందము యొక్క స్వేచ్చలో మనసు ప్రవహించడమే ధ్యానం  విస్పోటంలోకన్నులు నిర్మలమై అమాయకత్వంతో నిండి పోతాయి అప్పుడు ప్రేమ దివ్యానుగ్రహ మవుతుంది. 
  • సావధానతతో స్పృహతో వున్నప్పుడు "నేను" అనే కేంద్రం ఉండదు. సావధానమే మౌనమే ధ్యానంలోఉన్న స్థితి.
  • విడదీసుకోవడాన్ని,వేరుపరచుకోవడాన్నిఅంతం చేయడమే ధ్యానం.  ధ్యానం జీవితాన్నుంచి వేరుగా ఉండే విషయం కాదు.అది జీవితపు అస లు సారం.
  • ధ్యానంలో గొప్ప తన్మయీభావం ప్రవహిస్తూ ఉంటుంది.ఇది కంటికీ మస్తి ష్కానికీ హృదయానికీ నిర్మలమైన అమాయకతత్వాన్ని ప్రసాదించే తన్మయత్వం.
  • ధ్యానం అంటే మనసు,హృదయము పూర్తిగా సమూలంగా మార్పు చెంద డం అనే అర్థం వున్నది.
  • కాలాన్ని ఎరుగని అమాయకత్వంలో ఉండటమే ధ్యానం.
  • ప్రపంచం,దాని తీరుతెన్నుల్నిఆకళింపు చేసుకోవడమే ధ్యానం.
  • అవగాహన వికసించడమే ధ్యానం.అవగాహన ఇప్పుడే జరగాలి మరెప్ప టికీ జరగదు.అది ఒక విద్వంసక ప్రజ్వలనం.ధ్యానం అంటే చేతనను అజ్ఞాతాన్నిబాహ్యమైన దానినంతటినీ అవగాహన చేసుకోవడం.
  • ఏకాంతంగా ఉన్నప్పుడే ధ్యానించాలి.మనసును ఆలోచనలుండి విడిపిం చినపుడు  ఏకాంతం కలుగుతుంది.ప్రశాంతమైన ఏకాంతంలో నిశ్శ బ్దంగా,రహస్యంగా ధ్యానం సంభవిస్తుంది.
  • ఆలోచనలు,మనోభావాలు పూర్తిగా ఎదిగి నశించి పోయినప్పుడు ధ్యానం కాలానికి అతీతమైన వాహినిగా ప్రకాశిస్తుంది. కదలికలో తన్మయత్వం ఉంటుంది.
  • మనసులోని వెలుగే ధ్యానం.నేనును అంతం చేయడమే ధ్యానం.
  • ప్రతి నిముషము మరణించడమే ప్రేమ.ప్రేమ పూవులుగా వికసించడమే ధ్యానం.
  • తెలిసిన దాని నుంచి విముక్తి చెందడమే ధ్యానంలో మనం చేయవల సినది.
  • ఒంటరిగా ఉండటానికి భయపడనప్పుడు, ప్రపంచానికి చెందకుండా అసలు దేనితోను మమకార బంధంలేకుండా ఉన్నప్పుడు ఏకాంతంలో ని తన్మయత్వం మీకు లభిస్తుంది.
  • మనసు సమస్తం పూర్తిగా మౌనంగా అయినప్పుడు జరిగే ధ్యానమే మానవుడు చిరకాలంగా అన్వేషిస్తున్న దివ్యానుగ్రహం.
  • ధ్యాన మంటే అసలు సారాంశానికి తలుపులు తెరవడం,సర్వస్వాన్ని దగ్ధంచేసి బూడిద కూడా మిగల్చని ఒక అగ్నిగుండాన్ని దాని తలు పులు తెరిచి ఆహ్వానించడం.
  • నిజమైన ధ్యానానికి పునాది అనాసక్త మైన ఎరుక.అంటే ఆదిపత్యాల నుండి,ఆకాంక్షలనుండి,అసూయనుండి భయాలనుండి విముక్తిని కలిగించే సంపూర్ణ స్వేచ్చ.
  • ఆలోచనలనుండి విముక్తి పొంది సత్యం అనే తన్మయానందంలో ప్రవ హించడమే ధ్యానం.
  • ధ్యానంలో సమస్త ఆలోచనలు ఆగిపోవాలి.ధ్యానానికి ఇదే పునాది.
  • మనలో నుండి కాలాన్ని తీసివేసి మనసును ఖాళీ చేయడమే సత్యం అనే మౌనం.
          (నేడు ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డుకృష్ణ మూర్తి జయంతి. ఆయన  వివిధ ఉపన్యాసాలలో ధ్యానం గురించి వ్యక్త పరిచిన విషయాలను తెలుగులో పి సదాశివరావు గారు అనువాదం చేయగా ధ్యానం అనే పుస్తక రూపం లో వెలువడింది.అందులోని కొన్ని అంశాలను ఇక్కడ  వ్రాసాను .వారికి ధన్యవాదాలు.) 

www.jkrishnamurti.org  నందు ఆయన గురించి సమగ్రంగా తెలుసుకొనగరు.

Thursday 25 April 2013

ఆరడుగుల నేల ఆహ్వానించిన వేళ----కె.బాలకృష్ణా రెడ్డి గారి దీర్ఘ కవిత పై సమీక్ష

వర్తమాన సమాజంలో మనిషి జీవితం ఎలా ఉన్నది? 
అతను ఎలా జీవిస్తున్నాడు? ఎటువంటి పనులు 
చేస్తున్నాడు? అతని ప్రవర్తన ఎలా ఉంది?అతను చేసే
తప్పులు ఏమిటి? మనిషి ఎందుకిలా తన జీవితాన్ని నిప్పులకుంపటిగాసంఘర్షణల రణంగా
మార్చుకున్నాడు. 
చివరికి తన వెంట ఏమి తీసుకు వెడుతున్నాడు? జీవితాన్ని 
ఎలా జీవించాలి?మనిషన్నవాడు ఎలా ఉండాలి? 
మరణించేంత వరకు ఏమి చెయ్యాలి?వంటి ప్రశ్నలు 
భావ కవిగా ప్రసిద్ధులైనకె.బాలకృష్ణా రెడ్డి గారిని ఉక్కిరి బిక్కిరి చేసాయి.
అది ఇలా "ఆరడుగులనేల ఆహ్వానించిన వేళ "
 అనే దీర్ఘకవితగా మారింది.

      అరవై పేజీల ఈ జీవన కావ్యాన్ని ఒక వ్యాసంలో విశ్లేషించటం సాధ్యం కాదు.
ఇందులోని ముఖ్యమైన విషయాలను, అద్భు
తమైన కవిత్వాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. "ప్రశ్నిస్తున్నా..."
 అని కవితకు ముందు ఆయన వ్రాసిన కవితా నేపధ్యం చదివితే చాలు మొత్తం అంతా అర్థమవుతుంది.
ఇది మనిషి కథ
ప్రతి మనిషి వ్యథ 

నిరంతరం సంపాదించాలనే చూస్తున్న 
మనిషి అర్ధాంతరంగా మాయమైన వేళ
ఆహ్వానిస్తుంది ఆరడుగుల నేల 
అక్కడ అతని ఆత్మను తట్టి లేపి 
కవి అనుసంధించిన ప్రశ్నల పరంపరలే ఈ కావ్యం. 

మనిషివైతే రగిలిపో మనసుంటే పగిలిపో
దానవతను విస్మరించి మానవతను 
ఆవిష్కరించి మానవుడిగా మిగిలిపో 

అంటూ మనిషి గురించి మానవత్వాన్ని
గురించి పూర్తి కవితా వస్తువుగా వచ్చిన కావ్యమిది. 
పుట్టి నప్పటి నుండి వృద్ధాప్య 
వరకు జీవితాన్ని వర్ణిస్తూ

బాల్యం
బంగరు స్వప్నం
అరిషడ్వర్గం దరిచేరని దుర్గం
వృద్ధాప్యం
వేలవేల అనుభవాల
అనునయాల సంకలనం   ----- చాలా సులభంగా అర్థమవుతున్న పదాల పొందిక. 

జీవితం ఒక కమ్మని యోగం   ------- ఒక యోగం లాగా జీవితాన్ని గడిపితే ఎంత బాగుంటుంది.
మరణం తప్పదని తెలిసి
ప్రతిక్షణం రణన్నినాదం
ప్రతి నిముషం మారణ హోమం
పగలు రేయి అసుర కేళీ కలాపం 
 

వర్తమానంలో జరుగుతున్న వాస్తవ దృశ్యానికి ఇది ప్రతిబింబం.
స్మశానాన్ని వర్ణిస్తూ 

జీవన సాఫల్యాన్ని,వైఫల్యాన్ని
దైన్యాన్ని హైన్యాన్ని
తర్కిం చుకునే ఏకైక ప్రదేశం

సమాజం లోని అన్ని వృత్తుల వారు
తమ వృత్తి ధర్మాన్ని 
సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం బాగుపడుతుందని 
కవి భావిస్తాడు.కాని వారు ఆ పని చేస్తున్నారా అన్న 
ఆవేదనతో

దేశం కన్నీరు పెడుతుంది
సమాజం వెక్కి వెక్కి ఏడుస్తుంది

ఒకప్పటి మనిషి తనం మరచి రాక్షత్వాన్ని
మనిషి అలవరచుకున్నాడు అని కవి బాధపడతాడు.
మరణించిన 
మనిషిని శ్మశానం లోకాసేపు ఆపి అతని ఆత్మతో సంభాషిస్తాడు 
కవి.అతను జీవితం లో ఏమేమి చేసాడో ఏమి కోల్పోయాడో 
ప్రశ్నిస్తూ ఈ దీర్ఘ కవితను కోన సాగిస్తాడు.


జీవితం ఒక వరం
'జీవించు' వాళ్ళెందరు

ప్రేమించటం ఒక తపస్సు
'ప్రేమించే' వాళ్ళెందరు
  
ఎంత లోతయిన ప్రశ్న వేసారో గమనించండి.తన జీవిత కాలంలో అర్థాంగిని
ఏ  మేరకు అర్థం చేసుకున్నావు అమ్మా నాన్నలను ఏ  విధంగా  అర్థం ఎలా చేసుకున్నావు
 అని ప్రశ్నిస్తూ

అర్థం కాలేదా అమ్మ మనసు
వ్యర్థం అయింది కదా నాన్న తపస్సు

నీ ఎదుగుదల కోసం ఎంతో మందిని 
నాశనం చేసావు,
వారి ఉసురు నీకు తగిలిందేమో అంటూ

నువ్వు  మనిషితనం కోల్పోయావు  
మానవతకు దూరంగా జరిగావు.
సంగీతం సాహిత్యం లాంటి కళలంటే 
తెలీకుండాజీవించావు
జీవిత మంటే ఓ ఆహ్లాదం

మందారాలు, మకరందాలు
సింధూరాలు, సిరిచందన గంధాలు
మధు వనాలు, మలయానిలాలు
హరివిల్లులు, విరిజల్లులు
పూల పుప్పొళ్ళు, పున్నమి చప్పుళ్ళు

లాంటి తన భావ కవితా విభ్రమాన్ని
మన కళ్ళ 
ముందు౦చుతాడు. ఇంత అందమయిన జీవితాన్ని నరక ప్రాయం 
చేసుకున్నావెందుకని కవి మనిషిని ప్రశ్నిస్తున్నాడు. 

నువ్వు మాత్రం మనిషి తనం కోల్పోయావు?

మన నాగరికత, భాష సంస్కృతి 
అంతరిస్తున్నాయని   కవి ఆవేదన


ఎంత ఖేదం నలుగురికీ పంచావో 
ఎంత మోదం బూడిద పాలు చేసావో    ------- మనిషి చేస్తున్న
దిదే కదా!

నవ్వడం మరిచి పోయావు
నడవడం మరిచి పోయావు
నయాగరాలు మరచిపోయావు
నయగారాలు మరచి పోయావు
ఎన్ని అద్బుతాలు కోల్పోయావు
ఎన్ని జీవన సత్యాలు విస్మరించావు

అని కోల్పోయిన జీవితాన్ని గురించి చెబుతున్నాడు.

గుట్టలుగా కలిమి పోగుచేసుకున్న వ్యామోహం
కట్టెలతో చెలిమి చేస్తున్న దృశ్యం
  

అంటూ నీ వెంట ఏమీ రావు అనే సందేశం వినిపిస్తున్నాడు. మనిషికున్న భయాలకు మూల కారణం

అజ్ఞానం,అవివేకం
అక్కర లేని ,అవసరం లేని
కలిమితో బాంధవ్యం      ------ అని ఒక్క మాటతో 
తేల్చేస్తారు కవి.


మనిషికి డబ్బు చేసింది
నయం కాని మాయదారి జబ్బు చేసింది    --------

 అన్నకఠిన సత్యాన్ని ఆవిష్కరించారు. 


ప్రతి వ్యక్తిలో నైతిక విలువల పతనం
కుట్రలు,కుయుక్తుల చెలగాటం
మానవత శిధిల మై పోతున్న ఆనవాళ్ళు
దానవత రొద చేస్తున్న కీచురాళ్ళు     --------- 

అంటూ మనిషి తత్వాన్ని x-రే తీసాడు.


ప్రేమంటే ఒక ఉన్మాదం
ప్రేమించకుంటే ఉగ్రవాదం
ఏ ఉదాత్త సంస్కృతికి చిహ్నాలు
ఏ గొప్ప నాగరికతకు ఆనవాళ్ళు       ---------

 అంటూ ప్రేమ పేరుతో జరుగుతున్న
 ఆకృత్యాలను ప్రశ్నిస్తున్నాడు.


మానవత్వం కోల్పోయిన మనిషి
మృదుత్వం ఆర్ద్రత ఆవిరయిన మనిషి    ------

మనిషి ఇలా ఉన్నాడు ప్రస్తుతం.


ఒకటే జీవితం
ఇంత ఉలికి పాటెందుకు
ఒకటే దేహం
ఇంత రాద్దాంతమెందుకు     ------- 

నాలుగు మాటల్లో జీవిత సారం చెప్పారు.

ఒక ఒప్పందం చేసుకుందాం
చితి మంటల సాక్షిగా
చివరి వీలునామా వ్రాసుకుందాం 
కనీసం వచ్చే జన్మ లోనయినా మనిషిగా నడయాడాలని
శపథం చేసుకుందాం       ------- 

 అంటూ
 మనిషికి వీడ్కోలు ఇస్తున్నాడు.

ఈ భూమిపై మనజీవితం
విహారానికొచ్చినట్లుండాలి .
వచ్చిన పని కాగానే మృత్యువు సడి వినగానే
హాయిగా నిష్క్రమించాలి
ఒక చరిత్రను లిఖించి
ప్రతి ఒక్కరూ మహాత్ముడయి
నిర్గమనం చేయాలి.
అదే నిజమైన మరణం.
మహాభినిష్క్రమణం 

మనిషిని గురించి ఇంత వేదన చెంది, 
జీవితం ఎలా ఉండాలో, 
ఎలా ఉండకూడదోఇంత సరళంగా ఇంత అంద మైన 
పదాలతోచెప్పిన కావ్యం మనకు కనిపించదు. 
సామాన్య పాఠకుడిని కూడా చివరి వరకు చదివిస్తూ తీసుకువెడుతుందిప్రతి ఒక్కరికి తన జీవితం లోని 
అనేక సంఘటనలను గుర్తుకుతెస్తుంది.

మనిషి తరపున వారికి ధన్యవాదాలు. 

ఈ జీవన కావ్యం ప్రతి ఒక్కరు చదవతగ్గది. కె. బాలకృష్ణా రెడ్డి గారి కవితల కొరకు వారి "కవితాంధ్ర "
బ్లాగ్ చూడగలరు.