Saturday 25 February 2012

చిరుతిళ్ళు బాగా తింటున్నారా !


చిరుతిళ్ళు    బాగా తింటున్నారా !మనం పడుకునే లోపు ఆహారం 3 సార్లు తీసుకుంటాము.కాని మధ్యలో చాలా పదార్థాలు తింటాము.అందులో ముఖ్యంగా తీపి పదార్థాలు ఎక్కువగా వుంటాయి.తరువాత వేడి వంటకాలు సరేసరి .ఇకశీతలపానీయాలు ఉండనే ఉన్నాయి .వీటన్నింటికి తోడు పార్టీలు,.ఇక నూనె  వస్తువులు ఎక్కువ గా తింటాము. ప్రస్తుతం మసాలాలు చాలా ఎక్కువ గా చిరుతిండ్ల క్రింద తీసుకుంటూ వుంటారు.ఇలా జిహ్వ చాపల్యం కొద్ది ఇష్టం వచ్చినట్లుగా తింటే మన ఆరోగ్యం ఏమి కావాలి !  
               ఎప్పుడన్నా ఈ ఆహారం విషయం ఆలోచించారా !ఎప్పుడన్నా రుచి కోసం అయితే పరవాలేదు కాని ఎక్కువయితే ప్రమాదమే !ప్రస్తుతానికి మీ మీ ఆహారపు అలవాట్లు పరిశీలించుకోండి .ఎలా మార్పులు చేసుకుంటే బాగుంటుందో మరో టపాలో ప్రస్తావిస్తాను.   

Thursday 23 February 2012

IIT-JEE,AIEEE రద్దు మరియు ISECET ఏర్పాటు

  స్నేహితుడు సినిమా చూడమని చెప్పిన టపాకు విపరీతమయిన స్పందన వచ్చింది(చదవటం వరకే ,వ్యాఖ్యలు లేవు).ఆటపా లో కోరినట్లుగా జరిగింది .ఆ టపాను మంత్రులు  చదివారా అన్నంతగా రెండు రోజులకే IIT_JEE
 రధ్ధవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.ఏమైనా ఈ మార్పును మనస్పూర్తిగా ఆహ్వానించాలి.
            ఇంటర్ మార్క్స్ కి ప్రాధాన్యతనిస్తూ, రెండుదశ ల్లోనిర్వహించాలని ప్రతిపాదన .మొదటి దశలో సమగ్రంగా పరిశీలించే పరీక్ష ,రెండవ దశలో సబ్జెక్టు ఫై పరీక్ష ఉంటాయంటున్నారు.ఈ విషయం లో అమెరికా లో ఏవిధంగా వుందో పూర్తిగా తెలిసిన NRI లు ప్రభుత్వానికి సలహా లివ్వగలరు.ఎందుకంటే రాబోయే రెండు నెలలలో నియమాలు తయారు కాబోతున్నాయి.అమెరికా నే కాదు ప్రపంచం లోని ఇతర దేశాల్లో ఎలావుందో కూడా మీ మీ అభిప్రాయాలను భారత మానవ వనరుల శాఖకు పంపించండి .విద్యార్థులకు గొప్ప ఉపకారం చేసినవారవుతారు.మేధావులు,విద్యావంతులు ముందుకు వచ్చి సలహాలివ్వగ లిగితేనే  విద్యా వ్యవస్థ లో మార్పులు వస్తాయి.
            

Tuesday 21 February 2012

మాతృభాష ను మరువకుమా !

మాతృభాషా దినోత్సవం
            మన జీవితమంతా మన ఎదుగుదలకు,మన వికాసానికి ఉపయోగపడేది మన మాతృభాష.అమ్మ మనకు గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించే భాష .దాన్ని జీవితమంతా కాపాడుకోవాలి.మన పిల్లలకు ఆ భాష లోని మాధుర్యాన్ని గ్రోలేటట్లు చెయ్యాలి.మాధ్యమాల చర్చ ప్రక్కనపెడితే ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు తమ భాషను మర్చిపోకుండా బాధ్యత తీసుకోవాలి.అమ్మ,నాన్న అని పిలిచే పలుకులలోని తియ్యదనం మమ్మీ డాడీ లలో ఎక్కడ వస్తుంది.తాతయ్య,అమ్మమ్మ పిలుపుల్లోని కమ్మదనం గ్రాండ్ పా,గ్రాండ్  మా లో వస్తుందా.!విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు మన మాతృ  భాషా పరిరక్షణకు ఎంతగానో తపిస్తుంటే ఇక్కడ ఉన్న మనకు నిర్లక్ష్యంగా వుంది.
               ఒక చేదయిన  వాస్తవమేమంటే  ఆంగ్ల మాధ్యమం లో చదివే పిల్లలకు ఆంగ్లం రావటం లేదు ,తెలుగు రావటం లేదు .విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు  వున్నాయి.విదేశాలలో వున్నవారు ఏదోఒక విధం గా మీ బిడ్డలకి మాతృభాషలోని మధురిమలు పంచండి.క్రొత్త  భాష రావాలంటే ఎంతో కష్ట పడతాము.మరి తల్లి భాషను దూరం చేసుకుంటే ఎలా?

Monday 20 February 2012

స్నేహితుడు సినిమా ఎందుకు చూడాలి?

విద్యార్థులు,తల్లిదండ్రులు ఉపాధ్యాయులు,అధ్యాపకులు, యాజమాన్యాలు, ప్రభుత్వ విద్యా శాఖ ,విద్యకు సంబంధించిన    ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలి. ఇదేంటి !ఈ సినిమాకు ప్రచారం చేస్తున్నాడు అనుకుంటున్నారా!
    హిందీలో 3 idiots చూడలేకపోయాను.ఈ స్నేహితుడు చూసిన   తర్వాత చూడమని  చెప్పకుండా                                                  ఉండలేకపోతున్నాను  .ఎందుకో వినండి! మొత్తం మన విద్యా  వ్యవస్థ లక్ష్యం విద్యార్థులందరినీ  ర్యాంకులు,మార్కులతో విభజిస్తూ భవిష్యత్ గుమస్తాలను తయారు చేసే దిశగా సాగుతోంది.బ్రిటిష్ మెకాలే ప్రవేశపెట్టిన వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది.లేకపోతే ర్యాంకులు, మార్కుల లక్ష్యముగా భోధన జరుగుతుందేకాని విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని అభివ్రుద్దిచేసే విధానాలు భోధనలో లేవు.
         విద్యా వ్యవస్థను రెండు భాగాలుగా చేసి విశ్లేసిస్తే 1)L.KG  నుండి   12 వ తరగతి 2)ఉన్నత విద్య
ఉన్నత   విద్య అయిన మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంట్రన్సు లకు శిక్షణా కేంద్రాలుగా పాటశాలలు మారి పోయాయి. .ఉదాహరణకు 10,000 సీట్లు ఉండే  I.I.T  ఎంట్రన్సు కోసం   5 లక్షలమంది,  A.I.E.E.E  కోసం  10 లక్షల మంది విద్యార్థులు   శిక్షణ పొందుతూ ఉంటె వీటికి  foundation course  పేరిట ఆరవ తరగతి నుండి దేశ వ్యాప్తంగా మరి కొన్ని లక్షలమంది  గణితము, సైన్సునే  application orriented లో అభ్యసిస్తున్నారు  .ఆటలు,పాటలు,కళలు moral values, సైన్సు ప్రయోగాలు అన్ని పాటశాలల లో శూన్యం. ఇలా తయారైతే భవిష్యత్తులో   వీరు ఏమవుతారు   ఉన్నత విద్యలో కూడా సినిమాలో చూపినట్లు ఎక్కడా విద్యార్థి సృజనాత్మకతకు, పరిశోధనకు అవకాశం ఇవ్వకుండా జరిగే విద్యా భోధన  శాస్త్రవేత్తలను ఎలా  తయారు చేయగలదు. అమెరికా డాలర్స్ సంపాదించే కంప్యూటర్  మనుషులను  తప్ప!
                ప్రస్తుత సమాజ అవసరాలఫై    అధ్యయనం చేయని విద్య, పరిశోధనకు ప్రాముఖ్యత    ఇవ్వని విద్య,పరిశ్రమలతో  ప్రత్యక్ష అనుసంధానము లేని విద్య ఎలా భావిభారత పౌరులను తయారుచేయగలదు?మన దేశ బడ్జెట్ లో 2% విద్యకు కేటాయించి ఏమి సాధించాలి?అందులో పరిశోధనకు మరింత తక్కువ కేటాయిస్తారు.6% కేటాయిస్తే కొంతవరకు న్యాయం చేసినట్లు.
        భారత మానవ వనరుల శాఖ నిర్ణయించినట్లు,దేశవ్యాప్త ఇంజనీరింగ్ ఎంట్రన్సు పెడుతూ దానిని SAT(USA) తరహాలో కోచింగ్ లకు ఆస్కారం లేని విధం గా సిలబస్ లోనే ఆయా అంశాలఫై  భోధన వుండే విధం గా తయారు చెయ్యాలి.పాటశాల స్థాయిలోర్యాంకులు ,మార్క్స్ గొడవ తీసివేసి సమగ్ర మూల్యాంకనం ప్రవేశ పెట్టాలి.అప్పుడే విద్యాలయాలు బాగుపడతాయి  .
                  ఈ సినిమా ఆదిశగా ఆలోచింప చేస్తుంది.ఇంత హృద్యంగా కథను తయారుచేసిన రాజు హీర్వాని దాన్ని మన భాష లో అద్భుతంగా అందించిన శంకర్ గారిని,విజయ్ మరియు  సహనటుల్ని  ,అభినందించకుండా   ఉండలేము.
                 అందుకే  "స్నేహితుడు" సినిమా చూడండి.  

Saturday 18 February 2012

మానసిక ప్రయోగాలు

మన ప్రవర్తన ఇతరులతో మన  సంభందాలద్వారా వ్యక్తమవుతుంటుంది .మన ఇంట్లో, మన బంధువులతో మనస్నేహితులతో ,మన ఉద్యోగం లోని సహచరులతో మరియు ఇతర వ్యక్తులతో మనం ఏవిధంగా వ్యవహరిస్తున్నాము అన్న దాన్ని నిరంతరం పరిశీలించు కుంటూ  వుంటే మనకు మన ప్రవర్తన అద్దంలా కనపడుతుంది.మరి ఈ పరిశీలనకు  ప్రతిరోజు మనం కొంత సమయం కేటాయించాలి.అదే విధముగా విభిన్న పరిస్థితు లకు మన స్పందనలు కూడా మన వ్యక్తిత్వాన్నినిర్ణయిస్తాయి.మరి ఈ మొత్తం ప్రక్రియను మనం ఎలా పరిశీలించాలి.మన మనసుతోనే ఈ పని  అంతా జరగాలి.అంటే మనం మనసు చేసిన పనులన్నింటిని దానితోనే పరిశీలించాలి.
             ఇది ఎలా సాధ్యం .తనఫై తనే విచారణ చేపట్టాలి.మన కోర్ట్  లాగా .ఈ విచారణ లో మనమే న్యాయవాది, న్యాయమూర్తి , ఆరోపించేది,ఆరోపించ బడేది.అన్ని మనమయి విచారణ జరగాలి .ఇది  సాద్యమా !సాధ్యమే కాని దీనికి  మనల్ని మనం నిరంతరం మెరుగు పరుచుకుంటూ ఉన్నత మయిన  జీవితం గడపాలనే కోరిక వుండాలి.
           అప్పుడు ఎవరికి వారికే తమ ప్రవర్తన లోని లోపాలు స్పష్టంగా అర్థమవుతాయి.మనం ఎన్నో పుస్తకాలు ,మరెన్నో ఉపన్యాసాలు ఎంతమందో వ్యక్తుల్ని కలుస్తూ  ఉంటాము .మంచి విషయాలు తెలుసుకున్న ప్రతిసారి ఉత్తేజం పొందుతాము.కాని రోజులు గడిచేకొద్దీ మరల మన మామూలు జీవితం లో వుండి   పోతాము.
           దీనికి కారణం మనం ఎప్పుడు ఫైన    చెప్పిన ప్రక్రియకు  సమయము కేటాయించక పోవటమే.మరి ఈ దిశలో ఆలోచిద్దామా ! 

Wednesday 15 February 2012

సాయంత్రము త్వరగా భోజనం చేయటం

మన ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మరో అంశం మీ ముందుకు .
మనం సాయంత్రం ఆలస్యంగా భోజనం చేస్తుంటాము.ఈ అలవాటు అంత మంచిది కాదు .ఎందుకంటే మనం తిన్న తరువాత నిద్ర పోతాము కాబట్టి ఆహారం సరిగా జీర్ణం కాక పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి .దీని పలితంగా పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది.బరువు పెరగటం మామూలే .దీనికి ప్రత్యామ్నాయంగా పెందలకడనే భోజనం ముగించటం ఉత్తమం .
          సరే భోజనం లో ఏమి తీసుకుంటాము?సహజం గా తెలుగువారు అన్నము ఎక్కువగా వాడుతుంటారు.ఒక నివేదిక ప్రకారం ప్రపంచం లో భారత దేశం లో చక్కర వ్యాదిగ్రస్తులు ఎక్కువగా వుంటే మన  దేశం లో మన రాష్ట్రం లో ఎక్కువట .హైదరాబాద్ లో మరీ ఎక్కువ .అన్నము ఎక్కువగా తీసుకోవటం తగ్గించి నూనె  లేని పుల్కాలు రాత్రి త్వరగా తింటే పడుకోవటానికి సమయం ఉంటుంది కాబట్టి ఈలోపు కొంత అరగటమే  కాక బాగా నిద్ర పడుతుంది. 7 గంటలకు తినటం ఉత్తమం .
     ఈ చిన్న మార్పు చేసుకుంటే ఎంతో ఫలితము ఉంటుంది.ప్రయత్నిస్తారు కదూ !  

Tuesday 14 February 2012

సమయపాలన

మనం ఎన్నోవృత్తుల్లోపని చేస్తూ ఉంటాము.మనకు బాగా ఇష్టమైన వృత్తులు దొరకవచ్చు .లేక ఇష్టం లేకున్నా జీవనం కోసం మనం కోరుకొని వృత్తుల్లో పనిచేయవలసి రావచ్చు .ఏదేమైనా ఒక వృత్తి లో చేరినతరువాత దానికి మనం ఎంతమేరకు  న్యాయం చేస్తున్నామో ఆలోచిస్తువుండాలి.అప్పుడు మరింత మెరుగ్గా పనిచేయగలుగుతాము.
         అన్నింటికంటే ముఖ్యంగా సమయపాలన ఎంతో అవసరం .ప్రైవేటు ఉద్యోగాల్లో ఈ అంశానికి చాలా ప్రాధాన్యతనిస్తారు.కాని మనం ప్రభుత్వకార్యాలయాల్లో గమనిస్తే ఇది  తక్కువగా కనిపిస్తూ వుంటుంది.ప్రతి ఉద్యోగి ఈ విషయాన్ని ఎంతో తీవ్రంగా ఆలోచించాలి .మన కోసం ఎంతోమంది వేచి చూస్తుంటారు.వారందరికీ మన ఆలస్యం ఎంతో అసౌకర్యంగా వుంటుంది.ఎన్నో పనులు మనకోసం ఎదురుచూస్తుంటాయి .పల్లెల నుండి పేద ప్రజలు పనులకోసం వ్యయ ప్రయాసలకోర్చి  కార్యాలయాలకు వస్తుంటారు. గాంధీ గారు చెప్పినట్లు వినియోగదారుడే మనకు దేవుడు .వారిని గౌరవిస్తేనే మన ఉద్యోగం మరింతకాలం వుంటుంది.
         ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించటం లో ముందుండాలి .

Saturday 11 February 2012

ప్రేమికుల రోజు

ప్రేమికుల  రోజు 
ప్రేమ వుందని గుర్తు చేసుకోవటానికా!లేక ప్రేమ ను ప్రదర్శించటానికి  ఒకరోజు కావాలా !ప్రస్తుత ప్రేమలను విశ్లేషిస్తే ఒకింత భాదేస్తుంది.సినిమాలు,సెల్ పోన్ సందేశాలు,సరదాగా తిరగటం ,తరువాత ఎక్కువ శాతం విడిపోవటం .అసలు ప్రేమ అంటే ఏమిటి ?ఆకర్షణా ,లేక ఇష్టమా,తను లేకపోతే జీవించ లేనంత అనురాగమా !కబుర్లు చెప్పుకోవటానికి షికార్లు చేయటానికి  ఒక అమ్మాయి కావాలా !అసలు యువత దేనికోసం ఇలా తపిస్తుందో !
          తమ కర్తవ్యాలను విస్మరించి కలాశాలలంటే ప్రేమించుకోవటానికే  అన్నట్లు,చదువును నిర్లక్ష్యం చేస్తూ కన్న తల్లితండ్రులలను కడుపు కోతకు గురిచేస్తూ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.అల్లారి ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలాప్రవర్తిస్తుంటే  ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్దలు విలవిల్లాడి పోతున్నారు .
        ప్రేమకు నేనేదో పూర్తి వ్యతిరేకమనుకునేరు .ఒకవేళ ప్రేమించుకుంటే ,ఎంత హుందాగా ఆప్రేమను చదువయ్యేవర కు కొనసాగించాలి.ఎక్కడా హద్దులు దాటని ప్రేమ ని గుండెల్లో నింపుకుని తమ చదువులను ప్రేమ కోసం మరింత పట్టుదలగా తీసుకొని జీవితం లో స్థిరపడ్డ తరువాత ఆ ప్రేమను పెద్దలకు చెప్పి ఒక్కటయితే ఎంత బాగుంటుంది .అలా చేయకుండా సరదాల పేరుతో తిరిగి చదువులు పాడుచేసుకునే ప్రతి విద్యార్థి తల్లి తండ్రులకు ద్రోహం చేస్తున్నట్లే !
        మనం ఏపని చేసినా మన అభ్యున్నతికి అది పనికి వచ్చేట్లుగా వుండాలి.మనతల్లితండ్రులు గర్వంగా చెప్పుకునేట్లు వుండాలి.జీవితం లో ఒక మంచి స్థానానికి చేరుకోవాలి.ఆ దిశలో యువత ప్రయత్నాలు వుండాలి.
ఇందుకు కుటుంబ విలువలు ,మన సంప్రదాయాలు ,నైతికత,వ్యక్తిత్వ వికాసం దోహదం చేస్తాయి .
        యువత కో సలహా !ముందు మంచి స్నేహితుల్లా వుండండి .అభిప్రాయాలను పంచుకోండి.అన్నిసరిపడితే చదువయ్యేంత వరకు ఆగి అప్పటికి అవతలి వ్యక్తి తో నేను జీవితాంతం గడపాలి అన్నంత ఇష్టముంటే మీ ప్రేమను ప్రకటించండి.లేదంటే స్నేహంగా విడి పొండి.అంతేగాని తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి.జీవితం చాలా విలువయినది .ప్రేమ అవతలి మనిషి ఉన్నతిని కోరాలి.ఫలించకపోతే చంపటం, చనిపోవటం కన్నవారికి తీరని వేదనే .  
        ఒకమనిషిని మనం ఇష్టపడుతున్నామంటే వారికి ఇష్టముండాలని లేదుగా!మన ఇష్టం వారికి కష్టం కలిగించ కూడదుకదా!
              ప్రేమించిన హృదయం ప్రేమను పంచాలే కాని విషం చిమ్మకూడదు .నిజమైన ప్రేమలో అవతలి వ్యక్తి అభిప్రాయాలను గౌరవించటం,దయ,అనురాగం ఆత్మీయత,మిళితమై ఉంటాయి .ప్రేమించటం ,ప్రేమించ బడలేకపోవటం 
లాంటి విషయాలను తీవ్రంగా తీసుకోకండి .ప్రేమించి పెళ్ళిచేసుకున్న వాళ్ళకంటే పెద్దలు కుదిర్చిన సంబంధాలే ఎక్కువశాతం విజయం సాదిస్తున్నాయి .పెళ్లి అయిన తరువాత జీవితాంతం ప్రేమించుకోవచ్చు .
        యువతీ యువకులు ఈ దిశగా ఆలోచించండి         

Monday 6 February 2012

ఎదుగుతున్న లేత శరీరాలఫై

ఎదుగుతున్న లేత శరీరాలఫై
కర్కశంగా బరువు మోపుతున్న సమాజం
వికసిస్తున్న మనసుఫై 
విరుచుకుపడుతున్న పని వత్తిడి ఫలితం
                 నవ్వులపువ్వులు పెదవులఫై విరబూయాల్సిన క్షణం
                 బాధల కేదారంలో ముడుచుకుపోతున్న బాల్యం 
స్వేచ్చ లేదు 
ఆనందం లేదు ఆత్మీయత లేదు 
అమ్మ నాన్నల ప్రేమ  తెలీదు 
                వెట్టిలో,నిర్భందాలలో 
                గనుల్లో,ఫ్యాక్టరీలలో 
                పొలాల్లో,ఇళ్ళల్లో,
                నలుగుతున్న పసిడి బాల్యం 
కాయలు కట్టిన చేతులు 
బరువులతో వంగిన భుజాలు 
పని అలసటలో దైన్యం నిండిన కళ్ళు 
ఎంత కష్టం -ఎంత కష్టం 
               ఎవరున్నారు వారికి?
               వారివైపు పోరాడేదేవ్వరు   
               పిల్లలు పనిచేసి పెద్దలను బ్రతికించాలా?
               రక్షణ ఇవ్వాల్సినవారే   భక్షించాలా? 
ఎలా ఒప్పుకోవాలి ఈసంస్కృతిని   
పిల్లలకు జ్ఞానం అందించనిధీ ఇదేమి సమాజం  
మార్చాలి ఈసంస్క్రుతిని చట్టాలను 
పిల్లలను ఒడుల్లాంటి బడులలో సేదతీరనివ్వాలి 
వారి కనురెప్పల వెనుక విద్య కమ్మని కల కావాలి 
              స్వేచ్చ లోని మాధుర్యాన్ని 
              ఆత్మీయత లోని అనుభూతిని 
              అక్షరాల్లోని ఆకర్షణను  
చదువు లోని ఆనందాన్ని 
వారిని అనుభవి౦చ నీయండి
ఆపొద్దు ...ఆపలేరెవ్వరు  వారిని 
అరుగో వస్తున్నారు పిల్లలు బడులకు .. 


Monday 30 January 2012

ఆరోగ్యం

ఆరోగ్యం
చెమట పట్టిన వాడికే ముద్ద తినే హక్కుంటుందని పెద్దలు అంటుంటారు.ఇదెంత సత్యమో ఆలోచిస్తే అర్థమవుతుంది.శ్రమ జీవులు అధిక ఆహారం తీసుకోవాలి .చేసే పనికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి .కాని శ్రమ లేని జీవులు ఆహారం మితంగా తీసుకోవాలి.కాని అంతా విరుద్ధంగా జరుగుతుంది .సరే తీసుకున్నారు మరి దానిని ఖర్చు చేయాలి కదా! ఎలా! ఇంకెలా ! వంటికి చెమట పట్టించడమే 
        మరి సిద్ధమా !శ్రమ చేసే పనులు లేనివారందరూ ప్రతి రోజు 1 గంట వ్యాయామానికి కేటాయించాలి.ఇదంతా సులభమా కష్టమే కాని ఆరోగ్య లక్ష్యం పెట్టుకున్నవారు ఈ విషయాన్ని పాటించాలి.కాని చాలామంది మొదలెడతారు కాని కొద్ది కాలానికి ఆపి వేస్తుంటారు .అలా ఆపి ఇక  మనం కొనసాగించలేము అని పూర్తిగా మానేస్తుంటారు.వారికి ఒక సలహా గుర్తు వచ్చినప్పుడు మరల మొదలెట్టండి.ఎన్ని సార్లు ఆపివేసిన పరవాలేదు .

   వివేకానందుడు చెబుతాడు కదా ఉక్కునరాలు,ఇనుప కండరాలు కల యువత కావాలని .అంత కాకపోయినా మనం మన ఆరోగ్యం కోసం ఆమాత్రం శ్రద్ధ తీసుకోకపోతే ఎలా .సరే ఏమి చేస్తే బాగుంటుంది .మొదట సరళం గా మొదలెట్టండి .
మీకు తెలిసిన చిన్నచిన్న వ్యాయామాలు చేయండి .దగ్గరలో జిం వుంటే అందులో చేరడమో లేదా కొన్ని శిక్షణా సంస్థలు ఆసనాలు,ప్రాణాయామం ధ్యానం లాంటివి నేర్పిస్తుంటారు మీకు ఎలా అనుకూలం గా వుంటే అది .నడక కూడా ఆరోగ్యానికి మంచిదే .కాని నడక కంటే ఆసనాలు ఇంకా మంచిది అని నా అనుభవంమీ ఇష్టం. 
                ఈ వాక్యాన్ని గమనించండి .దేహమున్నంత వరకు వ్యాయామము,శ్వాస ఉన్నంత వరకు ప్రాణాయామము ,మనసున్నంత వరకు ధ్యానం చేయాలట .
         మరి మొదలెడతారా !            
                

Friday 27 January 2012

ఆరోగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు .ఎన్నిసంపదలున్న ఆరోగ్యం సరిగా లేకుంటే వాటి ఉపయోగం సున్నే .మరి ఎంతమంది ఈ స్పృహ కలిగిఉన్నారు.ఈ విషయం తెలిసినా ఆచరణకు వచ్చేసరికి జావకారి పోతారు.జిహ్వచాపల్యం మనిషిని వూరుకోనీయదు.మన ఆరోగ్యం క్షీనించ టానికి  ప్రధాన కారణం మన జీవనశైలి .
          మనం తీసుకునేఆహారం ,శరీరానికి శ్రమ లేకపోవటం ,మన నిద్ర ,విశ్రాంతి,మానసిక ఒత్తిడులు వీటిల్లో వున్న తేడాలవల్ల మన ఆరోగ్యం అదుపుతప్పుతుంది.మరి ఎన్నో లక్ష్యాల ఫై  గురిపెట్టి పనిచేస్తుంటాము.మరి ఆరోగ్యాన్ని
ఒక లక్ష్యం గా ఎందుకు తీసుకోము.
       చాలా మంది ఆరోగ్యలక్ష్యం పెట్టుకుంటున్నారు.కాని కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు.ఆపిన గుర్తు రాగానే మల్లి మొదలు పెట్టాలి.తప్పాము కదాని పూర్తిగా వదిలి పెట్టేకంటే మరల ప్రయత్నం చేయడం  మంచిదే కదా !
మరి మనకు చాల విషయాలు తెలుసు.వాటిల్లో కొన్నింటిని ఆచరణలో పెడతామా !
    ఆరోగ్యం సరిగా ఉండాలంటే మొదట మనం తీసుకునే ఆహారం ఫై దృష్టి పెట్టాలి.పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోకుండా మనం చేయగలిగేవి ఆలోచించాలి.మంచినీరు కనీసం 2   లీటర్లు త్రగాలంటారు డాక్టర్స్.ఇంకా ఎక్కువ త్రాగితే మంచిదంటారు ప్రకృతి వైద్యులు.వివాదాల్లోకి పోకుండా మధ్యేమార్గం లో వెళ్ళడం మంచిది  2   తో మొదలు పెట్టి 3
కు  వెళ్ళడం  మంచిది.సరే ముందు రెండు లీటర్లు త్రాగడానికి ప్రయత్నిస్తే ఆ తరువాత మూడు సంగతి.రోజును రెండు  భాగాలు చేసుకునుని త్రాగడం మంచిది.ఉత్తమం ఒక లీటర్ పరగడుపున త్రాగటం .లేకపోతే మధ్యాహ్నం లోపు 4  గ్లాసులు త్రాగితే సరి.సాయంత్రం 7   లోపు మరి నాలుగు గ్లాసులు తీసుకుంటే సరి .ఈ చిన్న లక్ష్యం పెట్టుకుంటే సరి.తరువాత మరో అలవాటు గురించి చెబుతా .
     

Wednesday 25 January 2012


వ్యక్తిత్వ వికాసం

వ్యక్తిత్వం
          మానవుడు మొదట జంతువు లా జీవించినా తరువాత ఆహారం ,దుస్తులు,కుటుంబం ఏర్పరుచుకున్నతరువాత జీవితాన్ని జీవించే క్రమం లో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆచరిస్తూ ,అలవాట్లు మార్చుకుంటూ ప్రస్తుతమున్న స్థితికి చేరుకున్నాడు.
         కాని ఈ స్థితి మనిషికి సరి అయినదేనా !మన ఆలోచనా ధోరణి, మన ప్రవర్తన ,మనం ఆచరించే  పద్ధతులు ఇవన్నీ మన ఎదుగుదలకు సరిపోతున్నాయా లేదా అని ఆలోచించుకుంటే మనకు లోపమెక్కడుందో అర్థమవుతుంది.ఆ కాస్త సమయం మనం మన మనసుకు ఇస్తే అది చాల సరిచేసుకుంటుంది.కాని అంత తీరిక మనకుందా!
       వ్యక్తి యొక్క తత్వాన్నివికసింపచేసుకోవటమే వ్యక్తిత్వ వికాసం.ఇది చిన్నప్పట్నుంచి విద్యార్థులకు పాటాల్లో భోధిస్తే  దేశం ఎంతో అభివృద్ది చెందుతుంది.వ్యక్తి వికాసమే కదా దేశం, ప్రపంచ వికాసం. అలాగే విభిన్న వృత్తుల్లో వున్న  వారికి వృత్తిలో శిక్షణ తో పాటు మానసిక పరివర్తన కొరకు శిక్షణ అవసరం .మనిషి ప్రతి విషయాన్ని  గ్రహించి,విశ్లేషించుకునే సామర్థ్యాన్ని కలిగివుంటాడు.కాబట్టి విషయాన్ని తెలుసుకుని తన మనసుకు పనిపెడితే సరి.మనసుకు ఆలోచించే సమయం ఇస్తే అది అద్భుతాలు సృష్టిస్తుంది .మరిన్ని విషయాలతో కలుద్దాం .    

Saturday 21 January 2012

సేవ


సేవ
సృష్టి లో మానవుడు ఇతరుల సహాయం లేకుండా తనంతట తాను మనుగడ సాగించలేడు.శారీరక వైకల్యం తో  బాధపడేవారికి,మానసిక వికలాంగులకు,నయంకాని జబ్బులతో బాధపడేవారికి,వృద్ధులకు, అనాధ పిల్లలకు ఇలాంటి వర్గాలకు  సహాయం మరింత అవసరం .ఈనాడు పేపర్ నూతన సంవత్సరం సందర్భంగా(1/1/2012 ) ఆదివారం సంచికలో కొందరు సేవామూర్తుల వివరాలు ఇచ్చింది.వారి వివరాలు అందరితోపంచుకోవాలనుకుంటున్నాను.ఈనాడు వారికి కృతజ్ఞతలు
1) అన్నదాత:స్విట్జర్లాండ్ లోని 5నక్షత్రాల హోటల్ లో చెఫ్ ఉద్యోగాన్ని వొదులుకొని అక్షయ అను సంస్థను స్థాపించి 500  మందికి మూడు పూటలా  అన్నం పెడుతున్నాడు మధురయి కి చెందినా నారాయణన్ కృష్ణన్ .మధురయి శివార్లలో 3 1/2 ఎకరాల    విస్తీర్ణం  లో  అన్నిరకాల  వసతులతో  అక్షయ  హోం  నిర్మానంజరుగుతోంది .akshayatrust.org ph:09843319933.
2)మరణం అంచున :చికిత్స అనవసరం అనుకున్న వ్యక్తులకు ఆసరాగా,ఆరోగుల్లో ధైర్యం నింపుతూ ,ముంబయ్ నగరం లోని మౌంట్ మేరీ చర్చి ప్రాంతం లో శాంతి ఆవేదనా సదన్ ఈర్పాటు చేసి
 వంద మందికి పైగా మరణం అంచున ఉన్నవారిని అక్కున చేర్చుకొని వారికి పరిచర్యలు చేస్తూ గొప్ప సేవ చేస్తున్నారు డా .డిసౌజా ఎంత గొప్ప సేవా భావం .shanthiavednasadan.org 02226427464
3)అభయ ఫౌండేషన్ :ఎక్కడ అవసరం వుంటే అక్కడ తక్షణ సాయుం అందాలి,అనే సిద్ధాంతం తో c.s బాలచంద్ర సుంకు 
2006  లో  హైదరాబాద్ లో ఈ ఫౌండేషన్ తన మిత్రులైన s.v హరిప్రసాద్ ,s.n రంగయ్య ,a.వ సతీష్ కుమార్  లతో కలిసి స్థాపించారు.నిశ్శబ్ద విప్లవాని సృష్టిస్తున్నారు. abhayafoundation.org 040 23393654
4)అమ్మలకు అమ్మ నిరుపేద అనాధ వృద్ధులను తన ఇంటికి తీసుకువెళ్లి  ఓ తల్లిలా సాకుతారు నాగచన్ద్రొఇకా దేవి మెహదిపట్నం లోని ఓ అద్దె ఇంట్లో 2002 లో kinnera welfare society ఏర్పాటు చేసి 600 మంది వృద్ధులను చేరదీసి  సొంత కూతురు లాగ వారికి సేవ చేస్తుంది.కేంద్ర ప్రభుత్వం ఆమెను వయోశ్రేష్ట సమ్మాన్ తో గౌరవించింది. kinnerawelfaresociety.org
phone:9247367379
5)దివ్యదిశ :అనాధపిల్లలు,ఇంటినుంచి పారిపొయి పిల్లలను చేరదీసి వారి బాల్యాన్ని భద్రంగా కాపాడుతూ మంచి చదువు చెప్పించి ఉన్నత స్థానానికి చేరుస్తోంది.ఈ సంస్థ స్థాపకుడు ఎసిదోరే ఫిలిఫ్స్ .ఇప్పటికి  10 లక్షల మంది బాలల జీవితాల్ని ప్రత్యక్ష్జంగానో పరోక్షంగానో ప్రభావితం చేసారు divyadisha.org      phone no:9247367379   
హైదరాబాద్ లో పిల్లలను రక్షించేందుకు 1098 helpline ఏర్పాటు చేసారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లల కోసం 18004253525 toolfree number ఏర్పాటు చేసారు. 

Monday 16 January 2012

బాల్యం


బాలల పెదాలఫై
చిరునవ్వుల చిరునామా లేదెందుకు ?
స్వచ్చమైన  ఆ కళ్ళల్లో నిశ్చలమైన
నిర్వికారమైన  దైన్య మెందులకు   
  లేత  రెమ్మల్లాంటి  ఆచేతుల్లో
కందిన ఆ కాయల వెనుక కథలేమిటి ?
తల్లి చేతుల స్పర్శతో తన్మయం
చెందాల్సి న ఆ  తలఫై  బొప్పుల గుర్తులేమిటి ?
పాల్గారు పాదాల కోమలత్వం
కరకు రాతిబాటల పడి కమిలినకారనాలేమిటి ?
గని నుండి, పనినుండి,
క్వారీ నుండి,కార్ఖానాల నుండి,చేలనుండి
రాల్లెత్తుతూ,బరువులు మోస్తూ
విషవాయువులు పీలుస్తూ
చిన్నపని,పెద్దపని అంతా తామై  మోస్తూ
అవిద్య,అజ్ఞానం,అంధకారం లో
మగ్గుతున్న నిస్సహాయులయిన బాలల బ్రతుకుచిత్రం
ఛిద్రం  కావలసిందేనా!లేదు!లేదు!
నేటిబాలలునేటి పౌరులే
వారికీ హక్కులుంటాయి 
బడిబయట పిల్లలంతా బాలకార్మికులే
బాలలకు బద్రత బడిలోనే
అప్పుడే వారి జీవితాల్లో వెలుగులు  నిండుతాయి 





Sunday 8 January 2012

ప్రపంచ తెలుగు మహాసభలు















ప్రతిభా వాగ్దేవి 

లక్ష్మణ రావు 

బాలసుబ్రమణ్యం

శంకర్ నారాయణ్




 రామిరెడ్డి  మాజీ   ఎం ఎల్.సి







ప్రపంచ తెలుగు మహాసభలు ఒంగోలు లో ఘనంగా జరిగాయి .నేను,ఆనంద్      చివరి రోజు సమావేశానికి హాజరయ్యాము ..జనవరి 8  వ తారీకు న విద్య ఫై  ఒక సదస్సు జరిగింది.అందులో లక్ష్మణ రావు,బాలసుబ్రమణ్యం, రామిరెడ్డి(  శాసన మండలి సభ్యులు) శంకరనారాయణ జర్నలిస్ట్ డా .మన్నార్ ఇందిరా శ్రీనివాసన్,సామర్ల రమేష్ బాబు పాల్గొన్నారు .
         బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ మాతృభాషలో విద్య బోధించే దేశాలైన చైనా ,జపాన్ వియత్నాం కొరియా ఉత్పత్తి రంగం లో ముందున్నాయి .పరభాషా బోధనా పై మక్కువున్న మనదేశం సేవల రంగం లో ముందుంది.8 వ తరగతి పూర్తి అయ్యేలోపు ఒక భాష లో నిష్ణాతు లై  వుండాలి.మన ఇంగ్లీష్ మీడియం చదువుల్లో   బాషలో    పట్టు రావటంలేదు .అన్నారు శంకరనారాయణ తన మాటలలో Instein సాపేక్షసిధ్దంతాన్ని, మార్క్స్ దాస్ కాపిటల్ ను  తమ మాతృబాష ఐన జర్మనీ లోనే  వ్రాసారు. మన్నార్ ఇందిరా గారు ఆఫీసు ల లో మాతృబాష కు ప్రాధాన్యం లేకపోవటం చేత ప్రజలకు ఎలా నష్టం జరుగుతుందో వివరించారు.
బాష ఫై జరిగిన సదస్సు లో డా.పవనకుమార్ మాట్లాడుతూ బాషలు,చరిత్రలు,సంస్కృతులను ఏకం చెయ్యటం కష్టం అన్నారు.ప్రపంచీకరణ లోని ఏకత్వం సంస్కృతిని ఏకం చెయ్యలేకపోయింది సంస్కృతులు భిన్నత్వ దిశగా ప్రయాణం చేస్తాయన్నారు.అన్ని వ్యవస్థలను సమంగా ప్రభావితం చెయ్యగలిగేది విద్య. కంప్యూటర్ కు సంగనకము అని పేరు పెట్టారు.సామల  రమేష్ గారు బాషభివ్రుద్ధికి  అన్ని విధాల కృషి చేస్తామన్నారు.తెలుగు బాష అందచందాల పై  ౩౦ నిముషాల పాటు అనర్గళంగా మాట్లాడింది.
     ముగింపు కార్యక్రమం లో కృష్ణ జిల్లా వారి డప్పు నృత్యం అధ్బుతంగా వుంది.క్రింద కొన్ని ఛాయాచిత్రములు వున్నాయి                 

Tuesday 3 January 2012

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5  వ తారీఖు నుండి 7 వ తారీఖు  వరకు ఒంగోలు లో పివిఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు జరుగును.కావున తెలుగు బాషాభిమానులు తప్పకుండ వచ్చి విజయవంతం చేయగలరు .ఇవి రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యం లో జరుగును . వివరములకు 3 -1 -2012 ఈనాడు పేపర్ చూడగలరు

నీవే

కమ్మని కలలకు రాగం నీవే
ఆలసిన బ్రతుకుకు ఆమని నీవే
కలిసిన మనసుకు కావ్యం నీవే
విరిసే వలపుకు గమనం నీవే
నీ వూహల వెల్లువకే
నా పాటను శ్రుతి చేర్చు
నీ వెన్నెల హాసానికి
నా మాటను కృతి గా కూర్చు

Monday 19 December 2011

భవానీద్వీపం( విజయవాడ )

విజయవాడ లో కృష్ణా నది ఒడ్డున వున్న భవానీద్వీపం చాలాఅందమైన ప్రదేశం .దీన్ని ప్రభుత్వం ఒక మంచి పర్యాటకప్రదేశం గా మార్చితే చాలా బాగుంటుంది. బోట్ మీద విహారం అందమైన అనుభవం.వూయల వూగుతుంటే చిన్నప్పుడు చెట్టుకు త్రాల్లు కట్టీ వూగిన జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి నిలువెత్తు చెట్లు,కృష్ణమ్మ పలకరింతలు పక్షుల కిలకిలారావాలు ఓహ్ .చెట్టుకొమ్మల పైన రెసార్ట్స్,కాఫీ త్రాగుతుంటే నదిని చుస్తూ ఎంత టేస్ట్ .రిసార్ట్లో అక్కడే ఒక రోజు గడిపితే ఎంత బాగుంటుందో అనిపించింది
దీన్ని ఓ అద్భుత ప్రదేశంగా మార్చల్సిన బాధ్యత ప్రభుత్వం పైవుంది.




Saturday 26 November 2011

ఈ క్షణం

ఈ క్షణం
క్షణ క్షణం మనం స్పృహలో వుంటే,అంటే ఎరుకలో వుంటే
ఫూర్తిగ ఆ క్షణంలోనె జరుగుతున్నసృష్టి కార్యాల
పట్ల,కంటికి కనపడే ప్రకృతి కదలికలపట్ల,మనసులొ ఆక్షణంలో జరిగే స్పందనలను మనం గమనించగలిగితే అప్పుడు ఒక సజీవ దృశ్యం సాక్షాత్కారమౌతుంది.వివేకం ఉదయిస్తుంది. .వస్తున్న ఆలోచనలవెనుక మర్మం,మనసు చేస్తున్న మాయ అర్థమవుతాయి.దాన్నిప్రేక్షకుడిగా వీక్షిస్తూ వుండగలగడమే వర్తమానంలో వుండటం .అప్పుడు కలిగే భావనల్లోంచి ఆనందం మనసునిండా స్వచ్చంగా,స్వేచ్చగానిండా ప్రవహిస్తుంది.

ప్రేమ

ప్రేమ
ప్రేమ ఒక జీవనది
తల్లి స్పర్శ
తండ్రి పిలుపు
అక్క ఆప్యాయత
చెల్లి అనురాగం
అన్న అభిమానం
తమ్ముడి అనుబంధం
అమ్మమ్మ గోము
తాతయ్య మురిపెం
నానమ్మ నవ్వులు
జేజెయ్య దీవెనలు
ఇదంతా ప్రేమే కదా!

ప్రేమ

ఫూల పరిమళం
వెన్నెల వర్షం
హిమపాతపు చల్లదనం
ఉషోదయ గీతం
సంధ్యా రాగం
ఇంద్రధనుస్సు వర్ణం
ఇవన్నీ ప్రేమలా వుంటాయేమో!

Saturday 12 November 2011

కళ

తాళం
గానం
నాట్యం
మనోహర కళారూపానికి అందమైన రూపం

కవనం
శ్రుతి
లయ
మధుర గీతికకు పంచప్రాణం
వేదన
శోధన
రోదన
వెల్లువెత్తిన అణగారిన చైతన్యం
భాష్యం
భాషణ
భావుకథ
కొత్తపుంతలు తొక్కే కవిత్వం

Friday 4 November 2011

TUNNEL BORING MACHINE


దీనిని TUNNEL BORING MACHINE (T.B.M) అంటారు.శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ప్రకాశం జిల్లాలోని(ఆంధ్రప్రదేశ్ ) పశ్చిమప్రాంతమైన మార్కాపూర్,వై.పాలెం మొదలగు ప్రాంతాలకు సాగు నీరు అందించేందుకు పి .దోర్నాల వద్ద నుండి 18 k.m శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు సొరంగం త్రవ్వటానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.ప్రస్తుతం కొండల్లో 9 KM వరకు సొరంగం పూర్తయింది .మరో 3 సం:లలో ఇది పూర్తవుతుందని ఆశిస్తున్నారు.పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని దీనిని పిలుస్తారు.ఇది  పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామల మవుతుంది. 

వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం త్రవ్వకం

వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం త్రవ్వకం దగ్గర మరిన్ని ఫొటోస్

జర్మన్ ఇంజినీర్  తో నేను 


జర్మన్ ఇంజినీర్ తో నేను మా అబ్బాయి 

    నేను నా మిత్రుడు ప్రకాష్ 

Sunday 30 October 2011

మనసు(Mind)

గతం గట్లు తెంచుకున్నా
మడవలేసి మనసు నాపాలి
వర్తమానపు వరంఢాలో నిల్చుని
భవిథకు మార్గాలు అన్వేషించాలి

Wednesday 26 October 2011

కమ్మని కలలు(Sweat Dreams)

కమ్మని కలలకు రాగం నీవే
ఆలసిన బ్రతుకుకు ఆమని నీవే
కలిసిన మనసుకు కావ్యం నీవే
విరిసే వలపుకు గమనం నీవే
నీ వూహల వెల్లువకే
నా పాటను శ్రుతి చేర్చు
నీ వెన్నెల హాసానికి
నా మాటను క్రుతిగా కూర్చు

Wednesday 19 October 2011

అందమైన ప్రకృతి

అందమైన ప్రకృతి
ప్రకృతి ని ఆరాధించండి ఈ భూమి ఎంతో అందమైనది .ప్రకృతిని మనం ఎన్నో విధాలుగా కలుషితం చేస్తున్నాము.మన జీవనానికి అవసరమైనవి అన్ని ఇస్తుంది.మనం ప్రకృతి కి ఏమి ఇవ్వాలి?ఏమి ఇవ్వకపోయినా దాన్ని నాశనం చేయకపొతేచాలు.

అందమైన ప్రకృతి ( beautiful nature)

Saturday 15 October 2011

ప్రకృతి ప్రేమ(Nature love)

ప్రకృతి ప్రేమను మనిషికి పుట్టుకతొ ఇస్తుంది.దానిని మనిషి తన హృదయం ద్వారా ప్రదర్శించాలి.తన బంధువుల పైనేకాక విశ్వవ్యాపితం చెయ్యాలి.అప్పుడు ప్రపంచమంతా ప్రేమమయమవుతుంది.ప్రేమకు హద్దులు లేవు .మానవులంతా ఒక్కటె. ప్రేమను పంచుతుంటె పెరుగుతుంది.

Tuesday 4 October 2011

ప్రేమ

మనసే మనసుకు స్పందన
హ్రుదయానికి హ్రుదయమే ప్రతిస్పందన
ప్రేరేపించబడే మమకారమే ప్రేమ
పరస్పర అభిప్రాయాల అవగాహనకి
అనురాగపు అంబరాల చుంబనలకి
ఆత్మీయతల,ఆనందపు అనుభూతులకి
ఇటువిరచించిన గీతానికి
అటు స్వరసరిగమల ప్రతినాదాల
భావ వ్యక్తీకరణే ప్రేమ