ఈ క్షణం
క్షణ క్షణం మనం స్పృహలో వుంటే,అంటే ఎరుకలో వుంటే
ఫూర్తిగ ఆ క్షణంలోనె జరుగుతున్నసృష్టి కార్యాల
పట్ల,కంటికి కనపడే ప్రకృతి కదలికలపట్ల,మనసులొ ఆక్షణంలో జరిగే స్పందనలను మనం గమనించగలిగితే అప్పుడు ఒక సజీవ దృశ్యం సాక్షాత్కారమౌతుంది.వివేకం ఉదయిస్తుంది. .వస్తున్న ఆలోచనలవెనుక మర్మం,మనసు చేస్తున్న మాయ అర్థమవుతాయి.దాన్నిప్రేక్షకుడిగా వీక్షిస్తూ వుండగలగడమే వర్తమానంలో వుండటం .అప్పుడు కలిగే భావనల్లోంచి ఆనందం మనసునిండా స్వచ్చంగా,స్వేచ్చగానిండా ప్రవహిస్తుంది.
Saturday, 26 November 2011
ప్రేమ
ప్రేమ
ప్రేమ ఒక జీవనది
తల్లి స్పర్శ
తండ్రి పిలుపు
అక్క ఆప్యాయత
చెల్లి అనురాగం
అన్న అభిమానం
తమ్ముడి అనుబంధం
అమ్మమ్మ గోము
తాతయ్య మురిపెం
నానమ్మ నవ్వులు
జేజెయ్య దీవెనలు
ఇదంతా ప్రేమే కదా!
ప్రేమ ఒక జీవనది
తల్లి స్పర్శ
తండ్రి పిలుపు
అక్క ఆప్యాయత
చెల్లి అనురాగం
అన్న అభిమానం
తమ్ముడి అనుబంధం
అమ్మమ్మ గోము
తాతయ్య మురిపెం
నానమ్మ నవ్వులు
జేజెయ్య దీవెనలు
ఇదంతా ప్రేమే కదా!
ప్రేమ
ఫూల పరిమళం
వెన్నెల వర్షం
హిమపాతపు చల్లదనం
ఉషోదయ గీతం
సంధ్యా రాగం
ఇంద్రధనుస్సు వర్ణం
ఇవన్నీ ప్రేమలా వుంటాయేమో!
వెన్నెల వర్షం
హిమపాతపు చల్లదనం
ఉషోదయ గీతం
సంధ్యా రాగం
ఇంద్రధనుస్సు వర్ణం
ఇవన్నీ ప్రేమలా వుంటాయేమో!
Saturday, 12 November 2011
కళ
తాళం
గానం
నాట్యం
మనోహర కళారూపానికి అందమైన రూపం
కవనం
శ్రుతి
లయ
మధుర గీతికకు పంచప్రాణం
వేదన
శోధన
రోదన
వెల్లువెత్తిన అణగారిన చైతన్యం
భాష్యం
భాషణ
భావుకథ
కొత్తపుంతలు తొక్కే కవిత్వం
గానం
నాట్యం
మనోహర కళారూపానికి అందమైన రూపం
కవనం
శ్రుతి
లయ
మధుర గీతికకు పంచప్రాణం
వేదన
శోధన
రోదన
వెల్లువెత్తిన అణగారిన చైతన్యం
భాష్యం
భాషణ
భావుకథ
కొత్తపుంతలు తొక్కే కవిత్వం
Friday, 4 November 2011
TUNNEL BORING MACHINE
దీనిని TUNNEL BORING MACHINE (T.B.M) అంటారు.శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ప్రకాశం జిల్లాలోని(ఆంధ్రప్రదేశ్ ) పశ్చిమప్రాంతమైన మార్కాపూర్,వై.పాలెం మొదలగు ప్రాంతాలకు సాగు నీరు అందించేందుకు పి .దోర్నాల వద్ద నుండి 18 k.m శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు సొరంగం త్రవ్వటానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.ప్రస్తుతం కొండల్లో 9 KM వరకు సొరంగం పూర్తయింది .మరో 3 సం:లలో ఇది పూర్తవుతుందని ఆశిస్తున్నారు.పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని దీనిని పిలుస్తారు.ఇది పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామల మవుతుంది.