Monday 30 January 2012

ఆరోగ్యం

ఆరోగ్యం
చెమట పట్టిన వాడికే ముద్ద తినే హక్కుంటుందని పెద్దలు అంటుంటారు.ఇదెంత సత్యమో ఆలోచిస్తే అర్థమవుతుంది.శ్రమ జీవులు అధిక ఆహారం తీసుకోవాలి .చేసే పనికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి .కాని శ్రమ లేని జీవులు ఆహారం మితంగా తీసుకోవాలి.కాని అంతా విరుద్ధంగా జరుగుతుంది .సరే తీసుకున్నారు మరి దానిని ఖర్చు చేయాలి కదా! ఎలా! ఇంకెలా ! వంటికి చెమట పట్టించడమే 
        మరి సిద్ధమా !శ్రమ చేసే పనులు లేనివారందరూ ప్రతి రోజు 1 గంట వ్యాయామానికి కేటాయించాలి.ఇదంతా సులభమా కష్టమే కాని ఆరోగ్య లక్ష్యం పెట్టుకున్నవారు ఈ విషయాన్ని పాటించాలి.కాని చాలామంది మొదలెడతారు కాని కొద్ది కాలానికి ఆపి వేస్తుంటారు .అలా ఆపి ఇక  మనం కొనసాగించలేము అని పూర్తిగా మానేస్తుంటారు.వారికి ఒక సలహా గుర్తు వచ్చినప్పుడు మరల మొదలెట్టండి.ఎన్ని సార్లు ఆపివేసిన పరవాలేదు .

   వివేకానందుడు చెబుతాడు కదా ఉక్కునరాలు,ఇనుప కండరాలు కల యువత కావాలని .అంత కాకపోయినా మనం మన ఆరోగ్యం కోసం ఆమాత్రం శ్రద్ధ తీసుకోకపోతే ఎలా .సరే ఏమి చేస్తే బాగుంటుంది .మొదట సరళం గా మొదలెట్టండి .
మీకు తెలిసిన చిన్నచిన్న వ్యాయామాలు చేయండి .దగ్గరలో జిం వుంటే అందులో చేరడమో లేదా కొన్ని శిక్షణా సంస్థలు ఆసనాలు,ప్రాణాయామం ధ్యానం లాంటివి నేర్పిస్తుంటారు మీకు ఎలా అనుకూలం గా వుంటే అది .నడక కూడా ఆరోగ్యానికి మంచిదే .కాని నడక కంటే ఆసనాలు ఇంకా మంచిది అని నా అనుభవంమీ ఇష్టం. 
                ఈ వాక్యాన్ని గమనించండి .దేహమున్నంత వరకు వ్యాయామము,శ్వాస ఉన్నంత వరకు ప్రాణాయామము ,మనసున్నంత వరకు ధ్యానం చేయాలట .
         మరి మొదలెడతారా !            
                

Friday 27 January 2012

ఆరోగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు .ఎన్నిసంపదలున్న ఆరోగ్యం సరిగా లేకుంటే వాటి ఉపయోగం సున్నే .మరి ఎంతమంది ఈ స్పృహ కలిగిఉన్నారు.ఈ విషయం తెలిసినా ఆచరణకు వచ్చేసరికి జావకారి పోతారు.జిహ్వచాపల్యం మనిషిని వూరుకోనీయదు.మన ఆరోగ్యం క్షీనించ టానికి  ప్రధాన కారణం మన జీవనశైలి .
          మనం తీసుకునేఆహారం ,శరీరానికి శ్రమ లేకపోవటం ,మన నిద్ర ,విశ్రాంతి,మానసిక ఒత్తిడులు వీటిల్లో వున్న తేడాలవల్ల మన ఆరోగ్యం అదుపుతప్పుతుంది.మరి ఎన్నో లక్ష్యాల ఫై  గురిపెట్టి పనిచేస్తుంటాము.మరి ఆరోగ్యాన్ని
ఒక లక్ష్యం గా ఎందుకు తీసుకోము.
       చాలా మంది ఆరోగ్యలక్ష్యం పెట్టుకుంటున్నారు.కాని కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు.ఆపిన గుర్తు రాగానే మల్లి మొదలు పెట్టాలి.తప్పాము కదాని పూర్తిగా వదిలి పెట్టేకంటే మరల ప్రయత్నం చేయడం  మంచిదే కదా !
మరి మనకు చాల విషయాలు తెలుసు.వాటిల్లో కొన్నింటిని ఆచరణలో పెడతామా !
    ఆరోగ్యం సరిగా ఉండాలంటే మొదట మనం తీసుకునే ఆహారం ఫై దృష్టి పెట్టాలి.పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోకుండా మనం చేయగలిగేవి ఆలోచించాలి.మంచినీరు కనీసం 2   లీటర్లు త్రగాలంటారు డాక్టర్స్.ఇంకా ఎక్కువ త్రాగితే మంచిదంటారు ప్రకృతి వైద్యులు.వివాదాల్లోకి పోకుండా మధ్యేమార్గం లో వెళ్ళడం మంచిది  2   తో మొదలు పెట్టి 3
కు  వెళ్ళడం  మంచిది.సరే ముందు రెండు లీటర్లు త్రాగడానికి ప్రయత్నిస్తే ఆ తరువాత మూడు సంగతి.రోజును రెండు  భాగాలు చేసుకునుని త్రాగడం మంచిది.ఉత్తమం ఒక లీటర్ పరగడుపున త్రాగటం .లేకపోతే మధ్యాహ్నం లోపు 4  గ్లాసులు త్రాగితే సరి.సాయంత్రం 7   లోపు మరి నాలుగు గ్లాసులు తీసుకుంటే సరి .ఈ చిన్న లక్ష్యం పెట్టుకుంటే సరి.తరువాత మరో అలవాటు గురించి చెబుతా .
     

Wednesday 25 January 2012


వ్యక్తిత్వ వికాసం

వ్యక్తిత్వం
          మానవుడు మొదట జంతువు లా జీవించినా తరువాత ఆహారం ,దుస్తులు,కుటుంబం ఏర్పరుచుకున్నతరువాత జీవితాన్ని జీవించే క్రమం లో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆచరిస్తూ ,అలవాట్లు మార్చుకుంటూ ప్రస్తుతమున్న స్థితికి చేరుకున్నాడు.
         కాని ఈ స్థితి మనిషికి సరి అయినదేనా !మన ఆలోచనా ధోరణి, మన ప్రవర్తన ,మనం ఆచరించే  పద్ధతులు ఇవన్నీ మన ఎదుగుదలకు సరిపోతున్నాయా లేదా అని ఆలోచించుకుంటే మనకు లోపమెక్కడుందో అర్థమవుతుంది.ఆ కాస్త సమయం మనం మన మనసుకు ఇస్తే అది చాల సరిచేసుకుంటుంది.కాని అంత తీరిక మనకుందా!
       వ్యక్తి యొక్క తత్వాన్నివికసింపచేసుకోవటమే వ్యక్తిత్వ వికాసం.ఇది చిన్నప్పట్నుంచి విద్యార్థులకు పాటాల్లో భోధిస్తే  దేశం ఎంతో అభివృద్ది చెందుతుంది.వ్యక్తి వికాసమే కదా దేశం, ప్రపంచ వికాసం. అలాగే విభిన్న వృత్తుల్లో వున్న  వారికి వృత్తిలో శిక్షణ తో పాటు మానసిక పరివర్తన కొరకు శిక్షణ అవసరం .మనిషి ప్రతి విషయాన్ని  గ్రహించి,విశ్లేషించుకునే సామర్థ్యాన్ని కలిగివుంటాడు.కాబట్టి విషయాన్ని తెలుసుకుని తన మనసుకు పనిపెడితే సరి.మనసుకు ఆలోచించే సమయం ఇస్తే అది అద్భుతాలు సృష్టిస్తుంది .మరిన్ని విషయాలతో కలుద్దాం .    

Saturday 21 January 2012

సేవ


సేవ
సృష్టి లో మానవుడు ఇతరుల సహాయం లేకుండా తనంతట తాను మనుగడ సాగించలేడు.శారీరక వైకల్యం తో  బాధపడేవారికి,మానసిక వికలాంగులకు,నయంకాని జబ్బులతో బాధపడేవారికి,వృద్ధులకు, అనాధ పిల్లలకు ఇలాంటి వర్గాలకు  సహాయం మరింత అవసరం .ఈనాడు పేపర్ నూతన సంవత్సరం సందర్భంగా(1/1/2012 ) ఆదివారం సంచికలో కొందరు సేవామూర్తుల వివరాలు ఇచ్చింది.వారి వివరాలు అందరితోపంచుకోవాలనుకుంటున్నాను.ఈనాడు వారికి కృతజ్ఞతలు
1) అన్నదాత:స్విట్జర్లాండ్ లోని 5నక్షత్రాల హోటల్ లో చెఫ్ ఉద్యోగాన్ని వొదులుకొని అక్షయ అను సంస్థను స్థాపించి 500  మందికి మూడు పూటలా  అన్నం పెడుతున్నాడు మధురయి కి చెందినా నారాయణన్ కృష్ణన్ .మధురయి శివార్లలో 3 1/2 ఎకరాల    విస్తీర్ణం  లో  అన్నిరకాల  వసతులతో  అక్షయ  హోం  నిర్మానంజరుగుతోంది .akshayatrust.org ph:09843319933.
2)మరణం అంచున :చికిత్స అనవసరం అనుకున్న వ్యక్తులకు ఆసరాగా,ఆరోగుల్లో ధైర్యం నింపుతూ ,ముంబయ్ నగరం లోని మౌంట్ మేరీ చర్చి ప్రాంతం లో శాంతి ఆవేదనా సదన్ ఈర్పాటు చేసి
 వంద మందికి పైగా మరణం అంచున ఉన్నవారిని అక్కున చేర్చుకొని వారికి పరిచర్యలు చేస్తూ గొప్ప సేవ చేస్తున్నారు డా .డిసౌజా ఎంత గొప్ప సేవా భావం .shanthiavednasadan.org 02226427464
3)అభయ ఫౌండేషన్ :ఎక్కడ అవసరం వుంటే అక్కడ తక్షణ సాయుం అందాలి,అనే సిద్ధాంతం తో c.s బాలచంద్ర సుంకు 
2006  లో  హైదరాబాద్ లో ఈ ఫౌండేషన్ తన మిత్రులైన s.v హరిప్రసాద్ ,s.n రంగయ్య ,a.వ సతీష్ కుమార్  లతో కలిసి స్థాపించారు.నిశ్శబ్ద విప్లవాని సృష్టిస్తున్నారు. abhayafoundation.org 040 23393654
4)అమ్మలకు అమ్మ నిరుపేద అనాధ వృద్ధులను తన ఇంటికి తీసుకువెళ్లి  ఓ తల్లిలా సాకుతారు నాగచన్ద్రొఇకా దేవి మెహదిపట్నం లోని ఓ అద్దె ఇంట్లో 2002 లో kinnera welfare society ఏర్పాటు చేసి 600 మంది వృద్ధులను చేరదీసి  సొంత కూతురు లాగ వారికి సేవ చేస్తుంది.కేంద్ర ప్రభుత్వం ఆమెను వయోశ్రేష్ట సమ్మాన్ తో గౌరవించింది. kinnerawelfaresociety.org
phone:9247367379
5)దివ్యదిశ :అనాధపిల్లలు,ఇంటినుంచి పారిపొయి పిల్లలను చేరదీసి వారి బాల్యాన్ని భద్రంగా కాపాడుతూ మంచి చదువు చెప్పించి ఉన్నత స్థానానికి చేరుస్తోంది.ఈ సంస్థ స్థాపకుడు ఎసిదోరే ఫిలిఫ్స్ .ఇప్పటికి  10 లక్షల మంది బాలల జీవితాల్ని ప్రత్యక్ష్జంగానో పరోక్షంగానో ప్రభావితం చేసారు divyadisha.org      phone no:9247367379   
హైదరాబాద్ లో పిల్లలను రక్షించేందుకు 1098 helpline ఏర్పాటు చేసారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లల కోసం 18004253525 toolfree number ఏర్పాటు చేసారు. 

Monday 16 January 2012

బాల్యం


బాలల పెదాలఫై
చిరునవ్వుల చిరునామా లేదెందుకు ?
స్వచ్చమైన  ఆ కళ్ళల్లో నిశ్చలమైన
నిర్వికారమైన  దైన్య మెందులకు   
  లేత  రెమ్మల్లాంటి  ఆచేతుల్లో
కందిన ఆ కాయల వెనుక కథలేమిటి ?
తల్లి చేతుల స్పర్శతో తన్మయం
చెందాల్సి న ఆ  తలఫై  బొప్పుల గుర్తులేమిటి ?
పాల్గారు పాదాల కోమలత్వం
కరకు రాతిబాటల పడి కమిలినకారనాలేమిటి ?
గని నుండి, పనినుండి,
క్వారీ నుండి,కార్ఖానాల నుండి,చేలనుండి
రాల్లెత్తుతూ,బరువులు మోస్తూ
విషవాయువులు పీలుస్తూ
చిన్నపని,పెద్దపని అంతా తామై  మోస్తూ
అవిద్య,అజ్ఞానం,అంధకారం లో
మగ్గుతున్న నిస్సహాయులయిన బాలల బ్రతుకుచిత్రం
ఛిద్రం  కావలసిందేనా!లేదు!లేదు!
నేటిబాలలునేటి పౌరులే
వారికీ హక్కులుంటాయి 
బడిబయట పిల్లలంతా బాలకార్మికులే
బాలలకు బద్రత బడిలోనే
అప్పుడే వారి జీవితాల్లో వెలుగులు  నిండుతాయి 





Sunday 8 January 2012

ప్రపంచ తెలుగు మహాసభలు















ప్రతిభా వాగ్దేవి 

లక్ష్మణ రావు 

బాలసుబ్రమణ్యం

శంకర్ నారాయణ్




 రామిరెడ్డి  మాజీ   ఎం ఎల్.సి







ప్రపంచ తెలుగు మహాసభలు ఒంగోలు లో ఘనంగా జరిగాయి .నేను,ఆనంద్      చివరి రోజు సమావేశానికి హాజరయ్యాము ..జనవరి 8  వ తారీకు న విద్య ఫై  ఒక సదస్సు జరిగింది.అందులో లక్ష్మణ రావు,బాలసుబ్రమణ్యం, రామిరెడ్డి(  శాసన మండలి సభ్యులు) శంకరనారాయణ జర్నలిస్ట్ డా .మన్నార్ ఇందిరా శ్రీనివాసన్,సామర్ల రమేష్ బాబు పాల్గొన్నారు .
         బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ మాతృభాషలో విద్య బోధించే దేశాలైన చైనా ,జపాన్ వియత్నాం కొరియా ఉత్పత్తి రంగం లో ముందున్నాయి .పరభాషా బోధనా పై మక్కువున్న మనదేశం సేవల రంగం లో ముందుంది.8 వ తరగతి పూర్తి అయ్యేలోపు ఒక భాష లో నిష్ణాతు లై  వుండాలి.మన ఇంగ్లీష్ మీడియం చదువుల్లో   బాషలో    పట్టు రావటంలేదు .అన్నారు శంకరనారాయణ తన మాటలలో Instein సాపేక్షసిధ్దంతాన్ని, మార్క్స్ దాస్ కాపిటల్ ను  తమ మాతృబాష ఐన జర్మనీ లోనే  వ్రాసారు. మన్నార్ ఇందిరా గారు ఆఫీసు ల లో మాతృబాష కు ప్రాధాన్యం లేకపోవటం చేత ప్రజలకు ఎలా నష్టం జరుగుతుందో వివరించారు.
బాష ఫై జరిగిన సదస్సు లో డా.పవనకుమార్ మాట్లాడుతూ బాషలు,చరిత్రలు,సంస్కృతులను ఏకం చెయ్యటం కష్టం అన్నారు.ప్రపంచీకరణ లోని ఏకత్వం సంస్కృతిని ఏకం చెయ్యలేకపోయింది సంస్కృతులు భిన్నత్వ దిశగా ప్రయాణం చేస్తాయన్నారు.అన్ని వ్యవస్థలను సమంగా ప్రభావితం చెయ్యగలిగేది విద్య. కంప్యూటర్ కు సంగనకము అని పేరు పెట్టారు.సామల  రమేష్ గారు బాషభివ్రుద్ధికి  అన్ని విధాల కృషి చేస్తామన్నారు.తెలుగు బాష అందచందాల పై  ౩౦ నిముషాల పాటు అనర్గళంగా మాట్లాడింది.
     ముగింపు కార్యక్రమం లో కృష్ణ జిల్లా వారి డప్పు నృత్యం అధ్బుతంగా వుంది.క్రింద కొన్ని ఛాయాచిత్రములు వున్నాయి                 

Tuesday 3 January 2012

ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5  వ తారీఖు నుండి 7 వ తారీఖు  వరకు ఒంగోలు లో పివిఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు జరుగును.కావున తెలుగు బాషాభిమానులు తప్పకుండ వచ్చి విజయవంతం చేయగలరు .ఇవి రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యం లో జరుగును . వివరములకు 3 -1 -2012 ఈనాడు పేపర్ చూడగలరు

నీవే

కమ్మని కలలకు రాగం నీవే
ఆలసిన బ్రతుకుకు ఆమని నీవే
కలిసిన మనసుకు కావ్యం నీవే
విరిసే వలపుకు గమనం నీవే
నీ వూహల వెల్లువకే
నా పాటను శ్రుతి చేర్చు
నీ వెన్నెల హాసానికి
నా మాటను కృతి గా కూర్చు

Monday 19 December 2011

భవానీద్వీపం( విజయవాడ )

విజయవాడ లో కృష్ణా నది ఒడ్డున వున్న భవానీద్వీపం చాలాఅందమైన ప్రదేశం .దీన్ని ప్రభుత్వం ఒక మంచి పర్యాటకప్రదేశం గా మార్చితే చాలా బాగుంటుంది. బోట్ మీద విహారం అందమైన అనుభవం.వూయల వూగుతుంటే చిన్నప్పుడు చెట్టుకు త్రాల్లు కట్టీ వూగిన జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి నిలువెత్తు చెట్లు,కృష్ణమ్మ పలకరింతలు పక్షుల కిలకిలారావాలు ఓహ్ .చెట్టుకొమ్మల పైన రెసార్ట్స్,కాఫీ త్రాగుతుంటే నదిని చుస్తూ ఎంత టేస్ట్ .రిసార్ట్లో అక్కడే ఒక రోజు గడిపితే ఎంత బాగుంటుందో అనిపించింది
దీన్ని ఓ అద్భుత ప్రదేశంగా మార్చల్సిన బాధ్యత ప్రభుత్వం పైవుంది.




Saturday 26 November 2011

ఈ క్షణం

ఈ క్షణం
క్షణ క్షణం మనం స్పృహలో వుంటే,అంటే ఎరుకలో వుంటే
ఫూర్తిగ ఆ క్షణంలోనె జరుగుతున్నసృష్టి కార్యాల
పట్ల,కంటికి కనపడే ప్రకృతి కదలికలపట్ల,మనసులొ ఆక్షణంలో జరిగే స్పందనలను మనం గమనించగలిగితే అప్పుడు ఒక సజీవ దృశ్యం సాక్షాత్కారమౌతుంది.వివేకం ఉదయిస్తుంది. .వస్తున్న ఆలోచనలవెనుక మర్మం,మనసు చేస్తున్న మాయ అర్థమవుతాయి.దాన్నిప్రేక్షకుడిగా వీక్షిస్తూ వుండగలగడమే వర్తమానంలో వుండటం .అప్పుడు కలిగే భావనల్లోంచి ఆనందం మనసునిండా స్వచ్చంగా,స్వేచ్చగానిండా ప్రవహిస్తుంది.

ప్రేమ

ప్రేమ
ప్రేమ ఒక జీవనది
తల్లి స్పర్శ
తండ్రి పిలుపు
అక్క ఆప్యాయత
చెల్లి అనురాగం
అన్న అభిమానం
తమ్ముడి అనుబంధం
అమ్మమ్మ గోము
తాతయ్య మురిపెం
నానమ్మ నవ్వులు
జేజెయ్య దీవెనలు
ఇదంతా ప్రేమే కదా!

ప్రేమ

ఫూల పరిమళం
వెన్నెల వర్షం
హిమపాతపు చల్లదనం
ఉషోదయ గీతం
సంధ్యా రాగం
ఇంద్రధనుస్సు వర్ణం
ఇవన్నీ ప్రేమలా వుంటాయేమో!

Saturday 12 November 2011

కళ

తాళం
గానం
నాట్యం
మనోహర కళారూపానికి అందమైన రూపం

కవనం
శ్రుతి
లయ
మధుర గీతికకు పంచప్రాణం
వేదన
శోధన
రోదన
వెల్లువెత్తిన అణగారిన చైతన్యం
భాష్యం
భాషణ
భావుకథ
కొత్తపుంతలు తొక్కే కవిత్వం

Friday 4 November 2011

TUNNEL BORING MACHINE


దీనిని TUNNEL BORING MACHINE (T.B.M) అంటారు.శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ప్రకాశం జిల్లాలోని(ఆంధ్రప్రదేశ్ ) పశ్చిమప్రాంతమైన మార్కాపూర్,వై.పాలెం మొదలగు ప్రాంతాలకు సాగు నీరు అందించేందుకు పి .దోర్నాల వద్ద నుండి 18 k.m శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు సొరంగం త్రవ్వటానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు.ప్రస్తుతం కొండల్లో 9 KM వరకు సొరంగం పూర్తయింది .మరో 3 సం:లలో ఇది పూర్తవుతుందని ఆశిస్తున్నారు.పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని దీనిని పిలుస్తారు.ఇది  పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామల మవుతుంది. 

వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం త్రవ్వకం

వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం త్రవ్వకం దగ్గర మరిన్ని ఫొటోస్

జర్మన్ ఇంజినీర్  తో నేను 


జర్మన్ ఇంజినీర్ తో నేను మా అబ్బాయి 

    నేను నా మిత్రుడు ప్రకాష్ 

Sunday 30 October 2011

మనసు(Mind)

గతం గట్లు తెంచుకున్నా
మడవలేసి మనసు నాపాలి
వర్తమానపు వరంఢాలో నిల్చుని
భవిథకు మార్గాలు అన్వేషించాలి

Wednesday 26 October 2011

కమ్మని కలలు(Sweat Dreams)

కమ్మని కలలకు రాగం నీవే
ఆలసిన బ్రతుకుకు ఆమని నీవే
కలిసిన మనసుకు కావ్యం నీవే
విరిసే వలపుకు గమనం నీవే
నీ వూహల వెల్లువకే
నా పాటను శ్రుతి చేర్చు
నీ వెన్నెల హాసానికి
నా మాటను క్రుతిగా కూర్చు

Wednesday 19 October 2011

అందమైన ప్రకృతి

అందమైన ప్రకృతి
ప్రకృతి ని ఆరాధించండి ఈ భూమి ఎంతో అందమైనది .ప్రకృతిని మనం ఎన్నో విధాలుగా కలుషితం చేస్తున్నాము.మన జీవనానికి అవసరమైనవి అన్ని ఇస్తుంది.మనం ప్రకృతి కి ఏమి ఇవ్వాలి?ఏమి ఇవ్వకపోయినా దాన్ని నాశనం చేయకపొతేచాలు.

అందమైన ప్రకృతి ( beautiful nature)

Saturday 15 October 2011

ప్రకృతి ప్రేమ(Nature love)

ప్రకృతి ప్రేమను మనిషికి పుట్టుకతొ ఇస్తుంది.దానిని మనిషి తన హృదయం ద్వారా ప్రదర్శించాలి.తన బంధువుల పైనేకాక విశ్వవ్యాపితం చెయ్యాలి.అప్పుడు ప్రపంచమంతా ప్రేమమయమవుతుంది.ప్రేమకు హద్దులు లేవు .మానవులంతా ఒక్కటె. ప్రేమను పంచుతుంటె పెరుగుతుంది.