ఆరోగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు .ఎన్నిసంపదలున్న ఆరోగ్యం సరిగా లేకుంటే వాటి ఉపయోగం సున్నే .మరి ఎంతమంది ఈ స్పృహ కలిగిఉన్నారు.ఈ విషయం తెలిసినా ఆచరణకు వచ్చేసరికి జావకారి పోతారు.జిహ్వచాపల్యం మనిషిని వూరుకోనీయదు.మన ఆరోగ్యం క్షీనించ టానికి  ప్రధాన కారణం మన జీవనశైలి .
          మనం తీసుకునేఆహారం ,శరీరానికి శ్రమ లేకపోవటం ,మన నిద్ర ,విశ్రాంతి,మానసిక ఒత్తిడులు వీటిల్లో వున్న తేడాలవల్ల మన ఆరోగ్యం అదుపుతప్పుతుంది.మరి ఎన్నో లక్ష్యాల ఫై  గురిపెట్టి పనిచేస్తుంటాము.మరి ఆరోగ్యాన్ని
ఒక లక్ష్యం గా ఎందుకు తీసుకోము.
       చాలా మంది ఆరోగ్యలక్ష్యం పెట్టుకుంటున్నారు.కాని కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు.ఆపిన గుర్తు రాగానే మల్లి మొదలు పెట్టాలి.తప్పాము కదాని పూర్తిగా వదిలి పెట్టేకంటే మరల ప్రయత్నం చేయడం  మంచిదే కదా !
మరి మనకు చాల విషయాలు తెలుసు.వాటిల్లో కొన్నింటిని ఆచరణలో పెడతామా !
    ఆరోగ్యం సరిగా ఉండాలంటే మొదట మనం తీసుకునే ఆహారం ఫై దృష్టి పెట్టాలి.పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోకుండా మనం చేయగలిగేవి ఆలోచించాలి.మంచినీరు కనీసం 2   లీటర్లు త్రగాలంటారు డాక్టర్స్.ఇంకా ఎక్కువ త్రాగితే మంచిదంటారు ప్రకృతి వైద్యులు.వివాదాల్లోకి పోకుండా మధ్యేమార్గం లో వెళ్ళడం మంచిది  2   తో మొదలు పెట్టి 3
కు  వెళ్ళడం  మంచిది.సరే ముందు రెండు లీటర్లు త్రాగడానికి ప్రయత్నిస్తే ఆ తరువాత మూడు సంగతి.రోజును రెండు  భాగాలు చేసుకునుని త్రాగడం మంచిది.ఉత్తమం ఒక లీటర్ పరగడుపున త్రాగటం .లేకపోతే మధ్యాహ్నం లోపు 4  గ్లాసులు త్రాగితే సరి.సాయంత్రం 7   లోపు మరి నాలుగు గ్లాసులు తీసుకుంటే సరి .ఈ చిన్న లక్ష్యం పెట్టుకుంటే సరి.తరువాత మరో అలవాటు గురించి చెబుతా
                  ఆరోగ్యం
చెమట పట్టిన వాడికే ముద్ద తినే హక్కుంటుందని పెద్దలు అంటుంటారు.ఇదెంత సత్యమో ఆలోచిస్తే అర్థమవుతుంది.శ్రమ జీవులు అధిక ఆహారం తీసుకోవాలి .చేసే పనికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి .కాని శ్రమ లేని జీవులు ఆహారం మితంగా తీసుకోవాలి.కాని అంతా విరుద్ధంగా జరుగుతుంది .సరే తీసుకున్నారు మరి దానిని ఖర్చు చేయాలి కదా! ఎలా! ఇంకెలా ! వంటికి చెమట పట్టించడమే 
        మరి సిద్ధమా !శ్రమ చేసే పనులు లేనివారందరూ ప్రతి రోజు 1 గంట వ్యాయామానికి కేటాయించాలి.ఇదంతా సులభమా కష్టమే కాని ఆరోగ్య లక్ష్యం పెట్టుకున్నవారు ఈ విషయాన్ని పాటించాలి.కాని చాలామంది మొదలెడతారు కాని కొద్ది కాలానికి ఆపి వేస్తుంటారు .అలా ఆపి ఇక  మనం కొనసాగించలేము అని పూర్తిగా మానేస్తుంటారు.వారికి ఒక సలహా గుర్తు వచ్చినప్పుడు మరల మొదలెట్టండి.ఎన్ని సార్లు ఆపివేసిన పరవాలేదు .

   వివేకానందుడు చెబుతాడు కదా ఉక్కునరాలు,ఇనుప కండరాలు కల యువత కావాలని .అంత కాకపోయినా మనం మన ఆరోగ్యం కోసం ఆమాత్రం శ్రద్ధ తీసుకోకపోతే ఎలా .సరే ఏమి చేస్తే బాగుంటుంది .మొదట సరళం గా మొదలెట్టండి .
మీకు తెలిసిన చిన్నచిన్న వ్యాయామాలు చేయండి .దగ్గరలో జిం వుంటే అందులో చేరడమో లేదా కొన్ని శిక్షణా సంస్థలు ఆసనాలు,ప్రాణాయామం ధ్యానం లాంటివి నేర్పిస్తుంటారు మీకు ఎలా అనుకూలం గా వుంటే అది .నడక కూడా ఆరోగ్యానికి మంచిదే .కాని నడక కంటే ఆసనాలు ఇంకా మంచిది అని నా అనుభవంమీ ఇష్టం. 
                ఈ వాక్యాన్ని గమనించండి .దేహమున్నంత వరకు వ్యాయామము,శ్వాస ఉన్నంత వరకు ప్రాణాయామము ,మనసున్నంత వరకు ధ్యానం చేయాలట .
         మరి మొదలెడతారా !             

    మన ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మరో అంశం మీ ముందుకు .
మనం సాయంత్రం ఆలస్యంగా భోజనం చేస్తుంటాము.ఈ అలవాటు అంత మంచిది కాదు .ఎందుకంటే మనం తిన్న తరువాత నిద్ర పోతాము కాబట్టి ఆహారం సరిగా జీర్ణం కాక పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి .దీని పలితంగా పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుంది.బరువు పెరగటం మామూలే .దీనికి ప్రత్యామ్నాయంగా పెందలకడనే భోజనం ముగించటం ఉత్తమం .
          సరే భోజనం లో ఏమి తీసుకుంటాము?సహజం గా తెలుగువారు అన్నము ఎక్కువగా వాడుతుంటారు.ఒక నివేదిక ప్రకారం ప్రపంచం లో భారత దేశం లో చక్కర వ్యాదిగ్రస్తులు ఎక్కువగా వుంటే మన  దేశం లో మన రాష్ట్రం లో ఎక్కువట .హైదరాబాద్ లో మరీ ఎక్కువ .అన్నము ఎక్కువగా తీసుకోవటం తగ్గించి నూనె  లేని పుల్కాలు రాత్రి త్వరగా తింటే పడుకోవటానికి సమయం ఉంటుంది కాబట్టి ఈలోపు కొంత అరగటమే  కాక బాగా నిద్ర పడుతుంది. 7 గంటలకు తినటం ఉత్తమం .
     ఈ చిన్న మార్పు చేసుకుంటే ఎంతో ఫలితము ఉంటుంది.ప్రయత్నిస్తారు కదూ !       
   


చిరుతిళ్ళు    బాగా తింటున్నారా !
మనం పడుకునే లోపు ఆహారం 3 సార్లు తీసుకుంటాము.కాని మధ్యలో చాలా పదార్థాలు తింటాము.అందులో ముఖ్యంగా తీపి పదార్థాలు ఎక్కువగా వుంటాయి.తరువాత వేడి వంటకాలు సరేసరి .ఇకశీతలపానీయాలు ఉండనే ఉన్నాయి .వీటన్నింటికి తోడు పార్టీలు,.ఇక నూనె  వస్తువులు ఎక్కువ గా తింటాము. ప్రస్తుతం మసాలాలు చాలా ఎక్కువ గా చిరుతిండ్ల క్రింద తీసుకుంటూ వుంటారు.ఇలా జిహ్వ చాపల్యం కొద్ది ఇష్టం వచ్చినట్లుగా తింటే మన ఆరోగ్యం ఏమి కావాలి !
               ఎప్పుడన్నా ఈ ఆహారం విషయం ఆలోచించారా !ఎప్పుడన్నా రుచి కోసం అయితే పరవాలేదు కాని ఎక్కువయితే ప్రమాదమే !ప్రస్తుతానికి మీ మీ ఆహారపు అలవాట్లు పరిశీలించుకోండి .ఎలా మార్పులు చేసుకుంటే బాగుంటుందో మరో టపాలో ప్రస్తావిస్తాను.