Tuesday 17 July 2012

నా హృదయ సీమ


 అహంకారం ఎరుగని సరిహద్దులకు
 నా మనసు విస్తరించనీ 
 అలంకరణలకు విలువివ్వని
 అభిమానాన్ని సంతరించు కోనీ
 ఆప్యాయతానురాగాల భావాల
 సమున్నత్వాన్ని పెంపోందించుకోనీ
 ఈ విశాల   విశ్వాంతరాళంలో 
 నా మానసిక సౌందర్యం విస్తరించి ప్రకాశించనీ
 నా హృదయ సీమ లోని ప్రతి కణం  ఈ ప్రకృతి పై
 అవ్యాజ్య అభిమానాన్ని నిలుపుకోనీ
 నా మనోగగనాన స్నేహ మధురిమల పరిమళాలు
నా శ్వాస  నాళాల్లో ప్రాణవాయువు
 ప్లవించే వరకు గుబాళించనీయనీ
 అని నా హృద్యంతరం లోని శక్తిని కోరుతున్నా

14 comments:

  1. చాలా బాగుంది రవి శేఖర్ గారు!

    ReplyDelete
  2. మంచి భావాల చక్కనిమాలలా వుంది, శేఖర్.
    keep writing.

    ReplyDelete
    Replies
    1. మీకు ధన్యవాదాలు నచ్చి మెచ్చినందుకు.

      Delete
  3. మీ హృదయాంతర శక్తి మీరు కోరుకునే శక్తినిస్తుంది రవి శేఖర్ గారూ!
    చక్కని భావం...
    @శ్రీ

    ReplyDelete
  4. మహోన్నతమైన భావాలు మీవి. చాలా బాగుంది కవిత. మీకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ప్రతి భావం మనసు నుండే ఉద్భవిస్తుంది.అందులోని మంచి వాటిని అభివృద్ది చేసుకోవటమే కదా మానవ జీవిత పరమార్థం.మీ సహృదయతకు నెనర్లు.

      Delete
  5. ఆ స్థితిని సాధించగలిగితే...జీవితం సఫలమౌతుంది. కవిత బావుంది రవిశేఖర్ గారూ..

    ReplyDelete
    Replies
    1. జీవితం ప్రతిక్షణం ఓ తపస్సు లాంటిది.దాన్ని ఆనందం గా జీవించాలంటే మనసును మంచి భావాలతో నింపుతూ ఆచరిస్తూ నడవటమే కదా మనిషి కర్తవ్యం. మీ స్పందనకు నెనర్లు.

      Delete
  6. చాలా చక్కగా రాసారండి.

    ReplyDelete