Saturday 23 June 2012

అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!


       
రాత్రి ముసుగును భూమి కప్పుకున్నవేళ
నేను రక్త మాంసాల దోసిళ్ళలో నిదరోతున్నాను
                  ఉచ్చ్వాస ,నిశ్వాసాల్లోఉన్ననాలో కదలిక
                 అందుకే  అమ్మ ఆర్తనాదాల ధ్వనులిక
                 నా చిన్ని గుండె తడబడుతుంది
                 నా లోన ఆవేదనే రగులుతోంది
ఎక్కడో అరుపులు,బాధామయ రోదనలు
ప్రసవ వేదనలు,ఆకలికేకల శోధనలు
అమ్మ పీల్చే గాలిలో మిళితమై ప్లవిస్తూ
నా శ్రవణేంద్రియాలలో ధ్వనిస్తూ
నన్ను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి
                       ఓ వెన్నెల కిరణం
              నా తనువును స్పర్శిస్తున్నట్లుంది
             శశి నిశి పరదాలను తొలగిస్తున్నట్లుంది
               ఓ భయ విహ్వలత కంఠద్వానం
ఓ అంతరాల సమాజ వికృత పదఘట్టనలు
మరో శ్మశాన విషాద గీతాల ఆర్తారావాలు
శతకోటి దరిద్రనారాయణుల దీనాలాపాలు
అనారోగ్యంతో మరణించే పసివాళ్ళ ఆక్రందనలు
ప్రకృతీ వికటాట్టహాస వైపరీత్యాలు
         మత మూఢత్వాలపైశాచిక ఆనందపు డోలికలో
          తేలిపోతూ తూలిపోతు ఒకరినొకరు నరుక్కునే
         సుందర ప్రపంచాన్నానేను చూడబోయేది  
         ఇదేనా నా తడబడు అడుగులు పడబోయే ధరిత్రి
అణుధూళి విరామమెరుగక నిండబోయే రోజులు
సర్వమానవ వినాశ హేతువుల కారణభూత రాజ్యాలు
ఇవేనా నాకగుపించే  భవిష్యత్ సుందర్ దృశ్యాలు
          నా కొద్దు ఆ రాబోయే పరిణామాల ఫలితం
          ఇక్కడే ఆనందంగా,ఆహ్లాదంగా వుంది
          నా మనుగడకు ప్రాణం పోస్తూ తన మమకార
          మాధుర్యాలను నాలోన పొందుపరుస్తున్న
          అమ్మ ఆనంద బృందావనంలో
          ఇలానే ఉండాలనివుంది
          అందుకే అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!        

14 comments:

  1. చాలా బాగుంది రవిశేఖర్ గారు...

    ReplyDelete
  2. chakkaga undi sekhar, prasthutha samajanni vivaristhu,

    ReplyDelete
  3. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా..

    ఎక్కడో అరుపులు,బాధామయ రోదనలు
    ప్రసవ వేదనలు,ఆకలికేకల శోధనలు
    అమ్మ పీల్చే గాలిలో మిళితమై ప్లవిస్తూ
    నా శ్రవణేంద్రియాలలో ధ్వనిస్తూ...

    జీవి యాతన అంతా ఇక్కడే ఉంది.అద్భుతంగా వ్రాశారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్య బాగుంది .మీకు ధన్యవాదాలు.

      Delete
  4. "ఈ సమాజంలోని కుళ్ళుని భరించే శక్తి లేదని
    అమ్మ కడుపులోని బిడ్డ ఆక్రోశం "
    చాలా బాగుంది రవి గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణ బాగుంది.మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  5. చాలా చాలా బాగుంది అండీ...

    ReplyDelete
  6. చాలా బాగారాసారండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి మీ స్పందనకు

      Delete
  7. రవిశేఖర్ గారు, గర్భం లో శిశువు ఈ లోకం లోకి రాబోయే ముందు ఆ లోకం అందమైన లోకం కాదని, లోకం ప్రస్తుత తీరు ను వర్ణిస్తూ ఈ కవిత లో ఆ శిశువు వేదన ఓహ్! కదిలించేసింది నన్ను! Hats off అండి!

    ReplyDelete
    Replies
    1. కృష్ణుడు అర్జునుడికి పద్మవ్యూహమ్ గురించి వివరిస్తున్నప్పుడు సుభద్ర వినటం వలన కడుపులో వున్న అభిమన్యుడికి దాని ప్రవేశం తెలిసినట్లు అమ్మ నుండి బిడ్డకు ఈ విషయాలు తెలిసినట్లు తన బాధను అందులో వర్ణించాను.మీరు కవితలు చక్కగా వ్రాయటమే కాక కవితల్లోని భావాన్ని చక్కగా విశ్లేషించగలరు.మీస్పందనకు , ప్రశంసకి ధన్యవాదాలు.

      Delete