Tuesday 29 May 2012

మనకి కోపం ఎందుకు వస్తుంది!2


 
           ముందుగా ఎవరికి వారు తమ   మానసిక పరిస్థితిని విశ్లేషించుకోవాలి. ప్రస్తుతమున్న సమాజంలో మనకు ఎన్నో అస్తవ్యస్థ  పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత కాలంలో జీవితంలో ఇంత వేగం లేదు.ఇంత పని ఒత్తిడి లేదు. సంపా దించాలనే కోరిక ఇంతగా లేదు.మనుషుల కింత ఆరాటం లేదు.ఉమ్మడి కుటుంబ వ్యవస్థల్లో పెద్దలు చెప్పిన మాటలు వింటూ ఇటు ఇంట్లోను బయట సానుకూలంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ నీతిగా,నిజాయితీగా బ్రతుకుతూ వుండే వారు. జ్ఞానం పెరిగి సంపాదనా కాంక్ష పెరిగిన తర్వాత కుటుంబాలు వేరయ్యాయి.పెద్దల సలహాలు,సూచనలు లేక ఇటు కు టుంబం లోను,బయట మనిషి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు.ఈ ఒత్తిడిలో ఏ చిన్నవిషయంలో నైనా తనకు వ్యతిరేకమైన సంఘటన జరిగితే తట్టుకోలేక వెంటనే అనాలోచితంగా ప్రతిస్పందిస్తున్నారు.అది కోపం రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భార్యా పిల్లలపై బయ టి వ్యక్తులపై ఇలా కోపాన్ని వ్యక్త పరుస్తుంటారు .కొంత మంది దానిని లోలోన అణచుకొని మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు.
     మరి కాస్త విశ్లేషిస్తే ఎవరయినా కోపాన్నితన కంటే బలహీనుల పైననే చూపిస్తుంటారు.ఉదాహరణకు తల్లి దండ్రులపై ఎదిగిన పిల్లలు,భార్యపై భర్త ఇలాగే కోప్పడుతుంటారు.ఈ మధ్య భార్యలు కూడా భర్తలపై బాగానే కోప్పడుతున్నారు. అధికార్లు తమ క్రింది సిబ్బంది పై కోపగించుకుంటారు.పై అధికార్ల దగ్గర మాత్రం అణకువగా వుంటారు.ఉపాధ్యాయులు విద్యార్థుల పై ఇలాగే కోప్పడుతారు.కాని ఎవరు బలవంతులపై  కోప్పడరు.ఎందుకంటే బలవంతుడు అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించటంతో పాటు కొండొకచో కొట్లాటకు దిగవచ్చుకూడా !కాబట్టి కోపానికి కూడా బలవంతుడంటే భయమే!ఈ విధంగా కోపం ప్రదర్శించబడు తుంది.
  తరువాతి వ్యాసం లో కోపం వల్ల నష్టాలు,దాన్ని అధిగమించే తీరు గురించి తెలుసుకుందాము.

2 comments:

  1. తెలుగులో సరైన పదాలతో చెప్పలేను, కాని కోపానికి ముఖ్య కారణాలు రెండు:
    1.Kind of defensive mechanism
    2.Lower frustation tolerance levels.

    ReplyDelete
  2. ఆత్మ రక్షణ చేసుకోవటానికి దీనిని వాడటం ,అలాగే తక్కువ సహనం కలిగి వుండటం .మీరు చెప్పిన కారణాలు సరి అయినవే!thanks for your opinion.

    ReplyDelete