Sunday 8 April 2012

మన వ్యసనాలు మానుకోవటం ఎలా?1


            వ్యసనం గురించి తెలుసుకునే ముందు అలవాటు అంటే ఏంటో తెలుసుకోవాలి.మనం రోజు క్రమం తప్ప కుండా చేసేవాటిని అలవాటు అనవచ్చు.ఉదాహరణకు కాలినడక,మంచినీళ్ళు త్రాగటం,వ్యాయామం చెయ్యటం సంగీతం వినడం,పుస్తకాలు చదవటం,యోగా,ధ్యానం చెయ్యటం లాంటివి.అలాగే కొంతమంది రోజు సిగ రెట్లు ,బీడీ లు,చుట్టలు,మద్యం త్రాగుతారు.కొంతమంది గుట్కాలు,మాదక ద్రవ్యాలు వాడతారు.ఫై అలవాట్లను వదలకుండా ప్రతి రోజు చేస్తూ వుంటారు.
           మరి మీకు పాటికే అర్థమయి వుంటుంది.ఏవి మంచి అలవాట్లో?ఏవి చెడు అలవాట్లో?ఇక్కడ మంచి, చెడు అంటే అర్థం ఏమిటి?దేనికి మంచి! అలవాట్ల వలన మనకు ఆరోగ్యపరంగా,మానసికంగా, కుటుంబపరంగా సామాజి కంగా మేలు జరిగితే మంచి అలవాట్ల క్రింద లెక్క.అలాగే కీడు జరిగితే చెడు అలవాట్ల క్రింద లెక్క.
        కొంతమంది ఫై అలవాట్లను వదలలేని పరిస్థితికి చేరుకుంటారు.ఉదాహరణకు వ్యాయామం చెయ్యకుంటే ఏదో లాగా వుండటం,యోగా చెయ్యకుండా వుండలేకపోవటం,పుస్తకాలు విడవకుండా చదవటం అప్పుడు వాటిని మంచి వ్యసనాలు అంటారు. అలవాటును మనం వదలలేని స్థితికి చేరుకున్నా మన్నమాట.
              మరికొంతమంది కాఫీ ,టీ లు ప్రతి రోజు 4 లేక ,5 సార్లు (ఇంకా ఎక్కువ సార్లు త్రాగేవారు చాలా మంది వున్నారు)త్రాగకుండా వుండలేకపోవటం,సిగరెట్లు రోజులేక,3 packs  త్రాగకుండా ఉండలేక పోవటం,ఇక మద్యం సేవించకుండా వుండలేకపోవటం ఇవి చెడ్డ వ్యసనాలుగా మనం పరిగణించవచ్చు అంటే అలవాటు యొక్క తారాస్థా యి వ్యసనం అన్నమాట .
           మరి అలవాట్లు ఎందుకు చేసుకోవాలి?ఎందుకు వదులుకోవాలి?అవి వ్యసనాలుగా మారేంత స్థితి ఎందు కు వచ్చింది ?వీటిని పరిశీలిద్దామా!
             ఏదయినా మనం క్రమం తప్పకుండా ఒక పనిచేస్తువున్నామంటే అందులో ఏదో మనకు త్రుప్తి ,సుఖం ,సంతోషం,ఆనందం దొరుకుతున్నట్లు భావిస్తాం . త్రుప్తి మరల మరల మనసు కోరుతున్నదన్నమాట!ఇక మన సు కోరినదే తడవుగా మన ఇంద్రియాలు వాటిని తీరుస్తున్నాయన్నమాట !ఉదా హరణ కు కాఫీ,టీ లు త్రాగిన తరు వాత ఎలా వుంటుంది.మనసులో ఎక్కడో త్రుప్తి!మరికొంతమందికి కాఫీ ,టీ లు పడనిదే ప్రక్రుతిపిలుపులు కూడా రావు.అలా నిబధ్ధమయి పోయి వుంటారు.అంటే అది వ్యసనం స్థాయికి చేరిందన్నమాట!అదేవిధంగా బీడిలు ,సిగ రెట్లు,చుట్టలు(విదేశాల్లో సిగార్స్ )త్రాగటం !ఎంతో ఇష్టం గా కాల్చి పారేస్తుంటారు .ఎక్కువగా ఒత్తిడి తో కూడిన పను లు  చేసేవారు,వీటిని ఖచ్చితంగా కాలుస్తారు.ఇక మద్యం త్రాగటం social status నేడు.ఒకప్పుడు  త్రాగుతారా!అని ఆశ్చర్యపోయేవారు.ప్రస్తుతం త్రాగరా!అని అంటున్నారు!ఇలా అలవాట్లు వ్యసనం స్థాయికి చేరుకొని మనుషుల ఆరోగ్యం ఫై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి.
         తరువాతి వ్యాసం లో మంచి అలవాట్లను చేసుకోవటం ఎలా?చెడ్డ అలవాట్లను మానుకోవటం ఎలా?గురించి తెలియ చేస్తాను.

10 comments:

  1. Correct గా చెప్పారు. నాకు మద్యం అలవాటు లేదంటే , చాల మంది అడిగారు ఎందుకు అని. నా చిన్నప్పుడు ఎవరైనా తాగుతారు అని తెలిస్తే చాల సూటిపోటి మాటలు అనేవాళ్ళు, ఇప్పుడు అది ఒక status symbol అయిపోయింది. ఏంటో ...చాల ఆశర్యం గా ఉంటుంది ఇవన్ని అలోచిస్తే ..

    ReplyDelete
  2. ధన్యవాదాలు మీ స్పందనకి ! నన్ను అయితే సన్మానిస్తామన్నారు మద్యం తీసుకోనందుకు(సరదాగా).అలా అయింది పరిస్థితి.

    ReplyDelete
  3. రవిశేఖర్ గారూ ! నా బ్లాగును వీక్షించి ప్రశంసలందించిన మీకు ధన్యవాదములు. రకరకముల అనుభవ సారములను అందించుచున్న మీ ప్రయత్నము బహు విధములుగా అభినందనీయము.

    ReplyDelete
  4. ధన్యవాదాలు మీ స్పందనకి.

    ReplyDelete
  5. ధన్యవాదాలు.స్వాగతం .త్వరలోనే

    ReplyDelete
  6. అమ్మో ! కాఫీ , టీ లు కూడా వ్యసనాలా?
    బాగుందండి. తొందరగా ఎలా మంచి అలవాట్లు చేసుకోవాలో చెప్పండి!

    ReplyDelete
    Replies
    1. thanks అండి.తరువాతి టపా చదివితే మీకే అర్థమవుతుంది.

      Delete
  7. హమ్మయ్యా! మీరు చెప్పిన చెడు అలవాట్ల లిస్టులో నాకు ఒక్కటి కూడా లేదు! ఇప్పటికీ పాలు లేదా రాగి జావ త్రాగటం నా అలవాటు.

    ReplyDelete
  8. మీరు ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యతకు అభినందనలు.థాంక్స్.

    ReplyDelete