Friday 27 January 2012

ఆరోగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు .ఎన్నిసంపదలున్న ఆరోగ్యం సరిగా లేకుంటే వాటి ఉపయోగం సున్నే .మరి ఎంతమంది ఈ స్పృహ కలిగిఉన్నారు.ఈ విషయం తెలిసినా ఆచరణకు వచ్చేసరికి జావకారి పోతారు.జిహ్వచాపల్యం మనిషిని వూరుకోనీయదు.మన ఆరోగ్యం క్షీనించ టానికి  ప్రధాన కారణం మన జీవనశైలి .
          మనం తీసుకునేఆహారం ,శరీరానికి శ్రమ లేకపోవటం ,మన నిద్ర ,విశ్రాంతి,మానసిక ఒత్తిడులు వీటిల్లో వున్న తేడాలవల్ల మన ఆరోగ్యం అదుపుతప్పుతుంది.మరి ఎన్నో లక్ష్యాల ఫై  గురిపెట్టి పనిచేస్తుంటాము.మరి ఆరోగ్యాన్ని
ఒక లక్ష్యం గా ఎందుకు తీసుకోము.
       చాలా మంది ఆరోగ్యలక్ష్యం పెట్టుకుంటున్నారు.కాని కొన్ని రోజులు చేసి ఆపేస్తుంటారు.ఆపిన గుర్తు రాగానే మల్లి మొదలు పెట్టాలి.తప్పాము కదాని పూర్తిగా వదిలి పెట్టేకంటే మరల ప్రయత్నం చేయడం  మంచిదే కదా !
మరి మనకు చాల విషయాలు తెలుసు.వాటిల్లో కొన్నింటిని ఆచరణలో పెడతామా !
    ఆరోగ్యం సరిగా ఉండాలంటే మొదట మనం తీసుకునే ఆహారం ఫై దృష్టి పెట్టాలి.పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోకుండా మనం చేయగలిగేవి ఆలోచించాలి.మంచినీరు కనీసం 2   లీటర్లు త్రగాలంటారు డాక్టర్స్.ఇంకా ఎక్కువ త్రాగితే మంచిదంటారు ప్రకృతి వైద్యులు.వివాదాల్లోకి పోకుండా మధ్యేమార్గం లో వెళ్ళడం మంచిది  2   తో మొదలు పెట్టి 3
కు  వెళ్ళడం  మంచిది.సరే ముందు రెండు లీటర్లు త్రాగడానికి ప్రయత్నిస్తే ఆ తరువాత మూడు సంగతి.రోజును రెండు  భాగాలు చేసుకునుని త్రాగడం మంచిది.ఉత్తమం ఒక లీటర్ పరగడుపున త్రాగటం .లేకపోతే మధ్యాహ్నం లోపు 4  గ్లాసులు త్రాగితే సరి.సాయంత్రం 7   లోపు మరి నాలుగు గ్లాసులు తీసుకుంటే సరి .ఈ చిన్న లక్ష్యం పెట్టుకుంటే సరి.తరువాత మరో అలవాటు గురించి చెబుతా .
     

No comments:

Post a Comment